Dhanush Captain Miller Movie Motion Poster Released: చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్ తాజాగా మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కెప్టెన్ మిల్లర్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి రాఖీ, సాని కాగితం చిత్రాల ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం (జులై 4) విడుదల చేశారు. ఇది 1930 - 40 ప్రాంతంలో జరిగే పీరియడ్ కథా చిత్రంగా ఉంటుందని, తమిళం, తెలుగు, హిందీ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
నిర్మాత టీజీ త్యాగరాజన్ మాట్లాడుతూ తమ సంస్థలో నిర్మించిన భారీ చిత్రాల్లో ఇది చోటు దక్కించుకుంటుందన్నారు. దర్శకుడు కథ చెప్పినప్పుడు తానూ, ధనుష్ చాలా ఆనందంగా ఫీలయ్యామన్నారు. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, మదన్ కార్తీ మాటలు, శ్రేయోస్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారని తెలిపారు. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం
హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత..
Captain miller .. This is going to be so exciting. Super kicked to work with @ArunMatheswaran and my brother @gvprakash @SathyaJyothi pic.twitter.com/lS8OMSh4I9
— Dhanush (@dhanushkraja) July 2, 2022
Comments
Please login to add a commentAdd a comment