
'హృదయ కాలేయం' సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. తనదైన కామెడీ శైలీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. వరుస పెట్టి చిత్రాలు చేస్తూ ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ పంచే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు సంపూర్ణేష్ బాబు.
Sampoornesh Babu Mr Beggar Movie Motion Poster Released: 'హృదయ కాలేయం' సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. తనదైన కామెడీ శైలీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. వరుస పెట్టి చిత్రాలు చేస్తూ ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ పంచే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు సంపూర్ణేష్ బాబు. ఇటీవలే 'శీలో రక్షతి రక్షితః' అనే విభిన్నమైన క్యాప్షన్‌తో క్యాలీఫ్లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా బెగ్గర్‌గా అలరించనున్నాడు సంపూర్ణేష్ బాబు.
సంపూర్ణేష్ బాబు, అద్వితీ శెట్టి జంటగా వడ్ల జనార్థన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బెగ్గర్’. ‘వీడు చిల్లరడగడు’ అన్నది ట్యాగ్‌లైన్. వడ్ల నాగశారద సమర్పణలో గురురాజ్, కార్తీక్ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘సరదాగా సాగే కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ నెల 25న ప్రారంభించే సెకండ్ షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుంది’’ అన్నారు వడ్ల జనార్థన్. ‘‘దర్శకుడు చక్కటి ప్లానింగ్‌తో అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కిస్తున్నారు’’ అని గురురాజ్, కార్తీక్ అన్నారు.
చదవండి: ఓటీటీలోకి సంపూర్ణేష్ బాబు ‘క్యాలీ ఫ్లవర్’