
‘‘ఇప్పటివరకు నేనెక్కువగా కామెడీ రోల్స్ చేశాను. ‘ధగడ్ సాంబ’లో తొలిసారి సీరియస్ పాత్ర చేశాను. ‘కొబ్బరి మట్ట, సింగం 123’ వంటి సినిమాల్లో ఎక్కువగా స్పూఫ్‌లు ఉన్నాయి. కానీ ‘ధగడ్ సాంబ’లో స్పూఫ్‌లు ఉండవు’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. ఎన్.ఆర్.రెడ్డి దర్శకత్వంలో సంపూర్ణేష్, సోనాక్షి జంటగా నటించిన చిత్రం ‘ధగడ్ సాంబ’. బి.ఎస్. రాజు సమర్పణలో ఆర్‌ఆర్ బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది.
సంపూర్ణేష్ మాట్లాడుతూ– ‘‘చిన్న సమస్య వల్ల హీరో చిన్నతనంలో తన ఆస్తి కోల్పోతాడు.. మళ్లీ అది సంపాదించుకునే క్రమంలో జరిగే సినిమా ‘ధగడ్ సాంబ’. ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. ఇలా అన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు 12 సినిమాల్లో హీరోగా చేశాను. వాటిలో ‘ధగడ్ సాంబ’ ఏడవది. మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం ‘బ్రిలియంట్ బాబు, సన్నాఫ్ తెనాలి, ‘దాన వీర శూర కర్ణ, మిస్టర్ బెగ్గర్’తో పాటు ఒక తమిళ సినిమాలో హీరోగా చేస్తున్నాను’’అన్నారు.
చదవండి 👇
Comments
Please login to add a commentAdd a comment