'గీత' మూవీ మోష‌న్ పోస్ట‌ర్ విడుదల | Geetha Movie Motion Poster Released | Sakshi
Sakshi News home page

Geetha Movie: 'గీత' మూవీ మోష‌న్ పోస్ట‌ర్ విడుదల

Published Sat, Feb 5 2022 4:11 PM | Last Updated on Sat, Feb 5 2022 4:15 PM

Geetha Movie Motion Poster Released - Sakshi

రామ్‌, శ్రీజ జంటగా ​కిరణ్‌ తిమ్మల దర్శకత్వంలో నటించిన చిత్రం​ `గీత‌` (మ‌న కృష్ణ‌గాడి ప్రేమ‌క‌థ ట్యాగ్ లైన్).   శ్రీ మ‌ణికంఠ  సినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై  రాము, ముర‌ళి, ప‌ర‌మేష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను ఫిలించాంబర్‌లో లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ``మోష‌న్ పోస్ట‌ర్ చాలా బావుంది. హీరో హీరోయిన్ జంట కూడా చూడ‌ ముచ్చ‌ట‌గా ఉంది. ఇటీవ‌ల కాలంలో కొత్త కంటెంట్ తో కొత్త వాళ్లు చేసే చిన్న చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ఆ కోవ‌లో ఈ చిత్రం కూడా బాగా ఆడాల‌ని కోరుకుంటున్నా. కంటెంట్ బాగుంటే  థియేట‌ర్స్ కూడా దొరుకుతున్నాయి. ప్రేక్ష‌కులు కూడా ఆద‌రిస్తున్నారు అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement