మంచి మలుపు అవుతుంది | Victory Venkatesh Launches Ullalla Ullalla Motion Poster | Sakshi
Sakshi News home page

మంచి మలుపు అవుతుంది

Published Sun, Oct 13 2019 12:26 AM | Last Updated on Sun, Oct 13 2019 12:26 AM

Victory Venkatesh Launches Ullalla Ullalla Motion Poster - Sakshi

గురురాజ్, నటరాజ్, వెంకటేష్, సత్యప్రకాశ్‌

సీనియర్‌ నటుడు సత్యప్రకాశ్‌ దర్శకుడిగా మారి, రూపొందిస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. రక్షకభటుడు, ఆనందం, లవర్స్‌ డే లాంటి చిత్రాలను అందించిన నిర్మాత ఎ. గురురాజ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటరాజ్, నూరిన్, అంకిత తదితరులు ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ని హీరో వెంకటేశ్‌ ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గురురాజ్‌ మాట్లాడుతూ– ‘‘సత్యప్రకాష్‌ నాకు మంచి మిత్రుడు. నటునిగా అతనిలో ఎంత ఫైర్‌ ఉందో, దర్శకునిగా అంతకు మించిన ఫైర్‌ ఉంది. ఈ చిత్రానికి నేనే కథను అందించాను. నిర్మాతగా నాకు, దర్శకునిగా సత్యప్రకాష్‌కు ఈ చిత్రం మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదు’’ అన్నారు సత్యప్రకాష్‌. ఈ చిత్రానికి సమర్పణ:  శ్రీమతి ఎ.ముత్తమ్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement