ఒక ఫైటర్​గా తప్ప లూజర్​గా చనిపోకూడదనుకున్నా: హీరో | Kalingapatnam Jeeva Movie First Look And Motion Poster Released | Sakshi
Sakshi News home page

Kalingapatnam Jeeva Movie : ఒక ఫైటర్​గా తప్ప లూజర్​గా చనిపోకూడదనుకున్నా: హీరో

Published Mon, Jan 31 2022 7:05 PM | Last Updated on Mon, Jan 31 2022 7:07 PM

Kalingapatnam Jeeva Movie First Look And Motion Poster Released - Sakshi

'చనిపోతే ఒక ఫైటర్​గా తప్ప లూజర్​గా చనిపోకూడదని అనుకున్నా' అని హీరో, నిర్మాత రిత్విక్​ చిల్లికేశల తెలిపారు. రిత్విక్​ చిల్లికేశల, చిత్రా శుక్లా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'కళింగపట్నం జీవా'. డీఎల్​ ప్రొడక్షన్స్​ బ్యానర్​పై పి. నానిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్​, మోషన్​ పోస్టర్​ను ఆదివారం హైదరాబాద్​లో విడుదల చేశారు. 'ఏజెంట్​ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'మళ్లీ రావా' చిత్రాల నిర్మాత రాహుల్​ యాదవ్​ నక్కా చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో లక్ష్య సినిమా దర్శకుడు సంతోష్​ జాగర్లపూడి పాల్గొన్నారు. సినిమా ఫస్ట్​ లుక్​, మోషన్​ పోస్టర్​ చాలా ఆసక్తికరంగా ఉందని రాహుల్​ యాదవ్ తెలిపారు. తనే కథ రాసుకుని, హీరోగా, ప్రొడ్యూసర్​గా కూడా వ్యవహరించడం గొప్ప విషయమన్నారు. 

సినిమా హీరో, నిర్మాత రిత్విక్​ మాట్లాడుతూ 'మాములుగా నేను డ్యాన్సర్​ని. కానీ ఈ చిత్రంలో ఒక్క పాట కూడా లేదు. ఒక కమర్షియల్​ చిత్రంగా కాకుండా వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించాను. ఈ చిత్రానికి కథ, నిర్మాత, రీరికార్డింగ్ వర్క్​ కూడా నేనే చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇంకో 20 రోజుల్లో ఫస్ట్​ కాపీ రెడీ అవుతుంది. ఈ సినిమా నిర్మాణంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా. అప్పుడు ఒక్కటే అనుకున్నా. ఒకవేళ చనిపోయినా ఒక ఫైటర్​గా చనిపోవాలి తప్ప లూజర్​గా కాదని. అందుకే పట్టుదలగా ఈ చిత్రాన్ని పూర్తి చేశాను. ఇందులో హీరోకి ఒక కన్ను మాత్రమే ఉండి చాలా వైవిధ్యంగా సినిమా ఉంటుంది.' అని పేర్కొన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement