
‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంతో ప్రేక్షకులకు నవ్వులు పంచడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ విజయ్‌కృష్ణ. ప్రస్తుతం తండ్రి నరేష్‌తో కలిసి ‘విఠలాచార్య’ సినిమాలో నటిస్తున్న నవీన్ పుట్టినరోజును(మంగళవారం) పురస్కరించుకొని మూడో సినిమా ప్రకటించారు. బాలాజీ సనాల దర్శకత్వంలో రోవస్కైర్ ఎంటర్‌టైన్మెంట్స్–యు–ఐ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి– ఎ.పద్మనాభరెడ్డి నిర్మించనున్న ఈ సినిమాకి ‘ఊరంతా అనుకుంటున్నారు’ టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను నవీన్ విజయ్‌కృష్ణ మిత్రుడు హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నెల 22 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. మేఘా చౌదరి, సోఫియా సింగ్, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ, కెమెరా: జి.లింగబాబు, లైన్ ప్రొడ్యూసర్: శ్రీరమ్య గోగుల.
Comments
Please login to add a commentAdd a comment