మెగాహీరో సాయిధరమ్ తేజ్ జోష్‌లో కనిపిస్తున్నాడు. బైక్ యాక్సిడెంట్ తర్వాత రెండు సినిమాలు చేశాడు. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఓ వైపు ప్రమోషన్స్ చేస్తూనే మరోవైపు తన ఫ్రెండ్స్‌తో కలిసి మరో ప్రాజెక్ట్ కోసం రెడీ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన ఓ రెండు పిక్స్ వైరల్‌గా మారిపోయాయి. అయితే ఈ ఫొటోల్లో సాయితేజ్‌తో ఉన్న ఓ వ్యక్తి కాస్త తెలిసిన ముఖంలా అనిపించాడు. ఇంతకీ అతడెవరో గుర్తుపట్టారా?
'బ్రో' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించన సాయితేజ్.. తర్వాత చిత్రం సంపత్ నంది డైరెక్షన్‌లో చేయబోతున్నాడు. దీనికి 'గాంజా శంకర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి ముందే ఓ షార్ట్ ఫిల్మ్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అవును మీరు విన్నది నిజమే. మెగాహీరో సాయిధరమ్ తేజ్.. 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్‌లో చాలా రోజుల క్రితమే నటించాడు.
(ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ‍్యాగ్)
ఆర్మీ జవాన్, అతడి ప్రేయసి మధ్య జరిగే కథతో ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సీనియర్ నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. పైన ఫొటోలో సాయితేజ్ పక్కన బ్లాక్ టీషర్ట్‌లో ఉన్నది అతడే. గతంలో హీరోగా నందిని 'నర్సింగ్ హోమ్', 'ఊరంతా అనుకుంటున్నారు' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. 'ఐనా ఇష్టం నువ్వు' అనే మూవీ కూడా చేశాడు. అయితే ఇవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనపెట్టేశాడు.
అయితే ఇప్పుడు లావుగా మారిపోవడంతో నరేశ్ కొడుకు నవీన్‌ని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. మరోవైపు సాయితేజ్-మంచు మనోజ్-నవీన్ బెస్ట్ ఫ్రెండ్స్. సమయం చిక‍్కినప్పుడల్లా వీళ్ల ముగ్గురు కలుస్తుంటారు. హీరోగా మెప్పించలేకపోయిన నవీన్.. దర్శకుడిగా మారిపోయాడు. సాయితేజ్‌తో ఓ షార్ట్ ఫిల్మ్ తీసి అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయిపోయాడు. త్వరలో ఇది రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: సెట్‌లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!)
Comments
Please login to add a commentAdd a comment