నా కుమారుడు అంతర్జాతీయ అవార్డు గెలిచాడు: నరేశ్‌ | VK Naresh Appreciates Son Naveen For Winning Oniros Best First Time Director For Soul Of Satya | Sakshi
Sakshi News home page

VK Naresh: ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న నవీన్‌.. పుత్రోత్సాహంతో పొంగిపోతున్న నరేశ్‌

Published Wed, Nov 8 2023 1:56 PM | Last Updated on Wed, Nov 8 2023 2:46 PM

VK Naresh Appreciates Son Naveen For Winning Oniros Best First Time Director For Soul Of Satya - Sakshi

సీనియర్‌ నటుడు నరేశ్‌ తనయుడు నవీన్‌ విజయకృష్ణ మొదట్లో నటుడిగా సినిమాల్లో కనిపించాడు. కానీ తర్వాత ఉన్నట్లుండి వెండితెరపై మాయమయ్యాడు. చాలాకాలం తర్వాత అతడు మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌ వైపు అడుగులు వేశాడు. అయితే ఈసారి నటుడిగా కాకుండా దర్శకుడిగా తెర వెనకనుంచి పని చేశాడు. సత్య అనే షార్ట్‌ ఫిలిం తెరకెక్కించాడు. ఈ లఘు చిత్రంలో మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, కలర్స్‌ స్వాతి జంటగా నటించారు. ఇటీవల ఈ షార్ట్‌ ఫిలిం నుంచి సోల్‌ ఆఫ్‌ సత్య పేరిట సాంగ్‌ రిలీజైంది. సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. 

అయితే ఈ షార్ట్‌ ఫిలిం తాజాగా అరుదైన ఘనత అందుకుంది. న్యూయార్క్‌లో అంతర్జాతీయ ఒనిరోస్‌ ఫిలిం అవార్డ్స్‌ వేదికపై ఈ లఘుచిత్రాన్ని ప్రదర్శించగా రెండు అవార్డులను సాధించింది. ఉత్తమ తొలి పరిచయ దర్శకుడిగా నవీన్‌ విజయకృష్ణ అవార్డు గెలుచుకున్నాడు. అలాగే సత్య షార్ట్‌ ఫిలింకు హానరబుల్‌ మెన్షన్‌ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ప్రకటించింది.

మీ ఆశీర్వాదాలు కావాలి
'సాయిధరమ్‌ తేజ్‌ తదితరులు నటించిన సోల్‌ ఆఫ్‌ సత్య సినిమా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒనిరోస్‌ అవార్డు వేదికలో సత్తా చాటింది. ఈ షార్ట్‌ ఫిలింకు గానూ నా తనయుడు నవీన్‌ బెస్ట్‌ ఫస్ట్‌ టైమ్‌ డైరెక్టర్‌ అవార్డు గెలిచాడు. మా కుటుంబంలో నాలుగోతరం నుంచి వచ్చి తన అభిరుచిని కొనసాగించాలనుకుంటున్న ఈ యువ దర్శకుడికి మీ ఆశీర్వాదాలు కావాలి. ఈ షార్ట్‌ ఫిలింను హిందీలో కూడా అందిస్తున్నాం. సమయం దొరికినప్పుడు చూసేయండి. థాంక్యూ సో మచ్‌' అని నవీన్‌ తండ్రి నరేశ్‌ ట్వీట్‌ చేశాడు.

అప్పుడు హీరోగా, ఇప్పుడు దర్శకుడిగా..
కాగా 2016లో ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో నవీన్ విజయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత ‘ఊరంతా అనుకుంటున్నారు’, ‘రెండు జెళ్ల సీత’ అనే సినిమాలు చేశాడు. కానీ, పెద్దగా వర్కవుట్‌ కాలేదు. హీరోగా రాణించలేకపోయిన నవీన్‌ చాలాకాలం సినిమాలకు దూరమయ్యాడు. బరువు కూడా భారీగా పెరిగాడు. చాలాకాలం తర్వాత ‘సత్య’ సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

చదవండి: తల్లిని చూసి చంటిపిల్లాడిలా ఏడ్చేసిన గౌతమ్‌.. అమ్మ ప్రేమ గుర్తొచ్చి ప్రిన్స్‌ కంటతడి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement