Naveen Vijay Krishna
-
నా కుమారుడు అంతర్జాతీయ అవార్డు గెలిచాడు: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ మొదట్లో నటుడిగా సినిమాల్లో కనిపించాడు. కానీ తర్వాత ఉన్నట్లుండి వెండితెరపై మాయమయ్యాడు. చాలాకాలం తర్వాత అతడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేశాడు. అయితే ఈసారి నటుడిగా కాకుండా దర్శకుడిగా తెర వెనకనుంచి పని చేశాడు. సత్య అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించాడు. ఈ లఘు చిత్రంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నటించారు. ఇటీవల ఈ షార్ట్ ఫిలిం నుంచి సోల్ ఆఫ్ సత్య పేరిట సాంగ్ రిలీజైంది. సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ షార్ట్ ఫిలిం తాజాగా అరుదైన ఘనత అందుకుంది. న్యూయార్క్‌లో అంతర్జాతీయ ఒనిరోస్ ఫిలిం అవార్డ్స్ వేదికపై ఈ లఘుచిత్రాన్ని ప్రదర్శించగా రెండు అవార్డులను సాధించింది. ఉత్తమ తొలి పరిచయ దర్శకుడిగా నవీన్ విజయకృష్ణ అవార్డు గెలుచుకున్నాడు. అలాగే సత్య షార్ట్ ఫిలింకు హానరబుల్ మెన్షన్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది. మీ ఆశీర్వాదాలు కావాలి 'సాయిధరమ్ తేజ్ తదితరులు నటించిన సోల్ ఆఫ్ సత్య సినిమా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒనిరోస్ అవార్డు వేదికలో సత్తా చాటింది. ఈ షార్ట్ ఫిలింకు గానూ నా తనయుడు నవీన్ బెస్ట్ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అవార్డు గెలిచాడు. మా కుటుంబంలో నాలుగోతరం నుంచి వచ్చి తన అభిరుచిని కొనసాగించాలనుకుంటున్న ఈ యువ దర్శకుడికి మీ ఆశీర్వాదాలు కావాలి. ఈ షార్ట్ ఫిలింను హిందీలో కూడా అందిస్తున్నాం. సమయం దొరికినప్పుడు చూసేయండి. థాంక్యూ సో మచ్' అని నవీన్ తండ్రి నరేశ్ ట్వీట్ చేశాడు. అప్పుడు హీరోగా, ఇప్పుడు దర్శకుడిగా.. కాగా 2016లో ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో నవీన్ విజయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత ‘ఊరంతా అనుకుంటున్నారు’, ‘రెండు జెళ్ల సీత’ అనే సినిమాలు చేశాడు. కానీ, పెద్దగా వర్కవుట్ కాలేదు. హీరోగా రాణించలేకపోయిన నవీన్ చాలాకాలం సినిమాలకు దూరమయ్యాడు. బరువు కూడా భారీగా పెరిగాడు. చాలాకాలం తర్వాత ‘సత్య’ సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. Shubodayam! 🙏🏻 I’m delighted to share that my son, Nawin, has won the award for Best First-Time Director for his film “SOUL OF SATHYA,” featuring Sai Dharam Tej and others, at the prestigious international “ONIROS AWARDS.” We humbly request your best wishes and blessings for… pic.twitter.com/Sf9EgHVBe4 — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) November 8, 2023 Our little baby #Satya starts its journey with a bang! 💥 We are proud to announce that our super cool Director @NawinVK has won the Best 1st Time Director award at the @OnirosFilmAward - New York 😍 & Also happy to receive the Honorable Mention award for #Satya 🇮🇳 pic.twitter.com/ONqgSUC82K — Dil Raju Productions (@DilRajuProdctns) November 7, 2023 చదవండి: తల్లిని చూసి చంటిపిల్లాడిలా ఏడ్చేసిన గౌతమ్.. అమ్మ ప్రేమ గుర్తొచ్చి ప్రిన్స్ కంటతడి.. -
సాయితేజ్ పక్కనున్న వ్యక్తిని గుర్తుపట్టారా? స్టార్ హీరో కొడుకు!
మెగాహీరో సాయిధరమ్ తేజ్ జోష్‌లో కనిపిస్తున్నాడు. బైక్ యాక్సిడెంట్ తర్వాత రెండు సినిమాలు చేశాడు. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఓ వైపు ప్రమోషన్స్ చేస్తూనే మరోవైపు తన ఫ్రెండ్స్‌తో కలిసి మరో ప్రాజెక్ట్ కోసం రెడీ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన ఓ రెండు పిక్స్ వైరల్‌గా మారిపోయాయి. అయితే ఈ ఫొటోల్లో సాయితేజ్‌తో ఉన్న ఓ వ్యక్తి కాస్త తెలిసిన ముఖంలా అనిపించాడు. ఇంతకీ అతడెవరో గుర్తుపట్టారా? 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించన సాయితేజ్.. తర్వాత చిత్రం సంపత్ నంది డైరెక్షన్లో చేయబోతున్నాడు. దీనికి 'గాంజా శంకర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి ముందే ఓ షార్ట్ ఫిల్మ్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అవును మీరు విన్నది నిజమే. మెగాహీరో సాయిధరమ్ తేజ్.. 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్‌లో చాలా రోజుల క్రితమే నటించాడు. (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) ఆర్మీ జవాన్, అతడి ప్రేయసి మధ్య జరిగే కథతో ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సీనియర్ నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. పైన ఫొటోలో సాయితేజ్ పక్కన బ్లాక్ టీషర్ట్‌లో ఉన్నది అతడే. గతంలో హీరోగా నందిని 'నర్సింగ్ హోమ్', 'ఊరంతా అనుకుంటున్నారు' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. 'ఐనా ఇష్టం నువ్వు' అనే మూవీ కూడా చేశాడు. అయితే ఇవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనపెట్టేశాడు. అయితే ఇప్పుడు లావుగా మారిపోవడంతో నరేశ్ కొడుకు నవీన్‌ని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. మరోవైపు సాయితేజ్-మంచు మనోజ్-నవీన్ బెస్ట్ ఫ్రెండ్స్. సమయం చిక్కినప్పుడల్లా వీళ్ల ముగ్గురు కలుస్తుంటారు. హీరోగా మెప్పించలేకపోయిన నవీన్.. దర్శకుడిగా మారిపోయాడు. సాయితేజ్‌తో ఓ షార్ట్ ఫిల్మ్ తీసి అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయిపోయాడు. త్వరలో ఇది రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: సెట్లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!) -
అక్టోబర్‌లో ఐనా ఇష్టం నువ్వు
సీనియర్ యాక్టర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌత్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. మూడు రోజుల చిత్రీకరణ మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ చివరి వారంలో విడుదల కానున్న ఈ సినిమా వివాదంలో పడింది. ‘‘ఈ సినిమాని చంటి అడ్డాల మాకు అమ్మినట్టు సాక్ష్యాలున్నాయి. అయినా ఎక్కువ డబ్బు కోసం ఆయన మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు’’ అని నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. కాగా, ఈ చిత్రానికి ‘జానకితో నేను’ అని టైటిల్ మార్చినట్లు, అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. మరి.. ఫైనల్‌గా ఈ సినిమాని ఎవరు రిలీజ్ చేస్తారో చూడాలి. -
జానకితో నేను
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రానికి ‘జానకితో నేను’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తొలుత ‘ఐనా... ఇష్టం నువ్వు’ అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. కానీ ‘జానకితో నేను’ అనే టైటిల్ మరింత బావుంటుందన్న ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. నాలుగైదు రోజులు ప్యాచ్‌వర్క్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. త్వరలో కీర్తీ సురేష్‌తో ఆ సీన్స్ చిత్రీకరిస్తాం. అక్టోబర్ మొదటి వారానికి తొలి కాపీ సిద్ధం అవుతుంది. థియేటర్స్ ఓపెన్ కాగానే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్, సంగీతం: అచ్చు. -
నవీన్‌లో మంచి ఈజ్ ఉంది
‘‘టైటిల్ బావుంటే సినిమా సగం సక్సెస్ అయినట్టే. ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే టైటిల్లో నేటివిటీ ఉంది. ఇంగ్లీష్ టైటిల్స్ ఎక్కువ వస్తున్న టైమ్‌లో ఇలాంటి టైటిల్‌తో రావడం బాగుంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. నవీన్ విజయ్‌కృష్ణ, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా బాలాజి సానల తెరకెక్కించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. మేఘా చౌదరి, సోఫియా సింగ్ కథానాయికలు. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.యల్.యన్. రెడ్డి, ఎ. పద్మనాభరెడ్డి నిర్మాతలు. నవీన్ విజయ్‌కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్ లోగోను కృష్ణ, ఫస్ట్ లుక్‌ను విజయ నిర్మల రిలీజ్ చేశారు. నవీన్ లుక్ టీజర్‌ను నరేశ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ – ‘‘నవీన్ చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగాడు. తనలో మంచి ఈజ్ ఉంది. పాటలు, ఫైట్లు బాగా చేస్తున్నాడు. ఆర్టిస్ట్‌గా మంచి భవిష్యత్తు ఉంది. కథ బావుందని నరేశ్ అన్నాడంటే సినిమాలో విషయం ఉన్నట్టే. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నందిని నర్సింగ్ హోమ్’ నవీన్‌కు హీరోగా మంచి పేరు తెచ్చింది. ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకోవాలన్నది అతని తాపత్రయం. నేను బాగున్నాయి అన్న సినిమాలు 99 శాతం ఫెయిల్ అవ్వలేదు’’ అన్నారు నరేశ్. ‘‘ఈ సినిమా అంతా పాలకొల్లులో షూట్ చేశాం. అక్కడే సెటిల్ కావాలనిపించేంతగా నచ్చింది’’ అన్నారు నవీన్. ‘‘గ్రామీణ నేపథ్యంలో అందంగా సాగే సినిమా ఇది. విలేజ్ బాయ్‌గా నవీన్ మెప్పిస్తాడు. నవీన్‌లోని పలు షేడ్స్ ఇందులో కనిపిస్తాయి’’ అన్నారు నిర్మాతలు. -
ఊరంతా అనుకుంటున్నారు
‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంతో ప్రేక్షకులకు నవ్వులు పంచడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ విజయ్‌కృష్ణ. ప్రస్తుతం తండ్రి నరేష్‌తో కలిసి ‘విఠలాచార్య’ సినిమాలో నటిస్తున్న నవీన్ పుట్టినరోజును(మంగళవారం) పురస్కరించుకొని మూడో సినిమా ప్రకటించారు. బాలాజీ సనాల దర్శకత్వంలో రోవస్కైర్ ఎంటర్టైన్మెంట్స్–యు–ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి– ఎ.పద్మనాభరెడ్డి నిర్మించనున్న ఈ సినిమాకి ‘ఊరంతా అనుకుంటున్నారు’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను నవీన్ విజయ్‌కృష్ణ మిత్రుడు హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నెల 22 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. మేఘా చౌదరి, సోఫియా సింగ్, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ, కెమెరా: జి.లింగబాబు, లైన్ ప్రొడ్యూసర్: శ్రీరమ్య గోగుల. -
తల్లి–తనయుడు–ఇద్దరు మనవళ్లు.. ఓ సినిమా
విఠలాచార్య.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడున్న టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే జానపద చిత్రాలు తీసి, ప్రేక్షకుల చేత ఔరా అనిపించారాయన. అటువంటి గొప్ప దర్శకుడి పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘నందిని నర్సింగ్ హోమ్’ ఫేమ్ నవీన్ విజయ కృష్ణ, అనీషా ఆంబ్రోస్ జంటగా, నరేశ్, ఇంద్రజ కీలక పాత్రల్లో సుహాస్ మీరా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విఠలాచార్య’ గురువారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటి–దర్శకురాలు విజయనిర్మల కెమెరా స్విచ్చాన్ చేయగా సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా బ్రోచర్స్‌ను మరో దర్శకుడు కోదండ రామిరెడ్డి విడుదల చేసి, కృష్ణకు అందించారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘విఠలాచార్యతో ‘ఇద్దరు మొనగాళ్లు’ సినిమాకు పనిచేశా. ఆయన ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. నరేశ్, నవీన్ కలిసి చేస్తున్న ఈ సినిమా కోసం నేనూ వెయిట్ చేస్తున్నా’’ అన్నారు.‘‘మా తరతరాలు నటీనటులుగా కొనసాగుతారు. మా పెద్ద మనవడితో పాటు చిన్న మనవడు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు’’ అన్నారు విజయనిర్మల. ‘‘పరుచూరి వెంకటేశ్వరరావుగారి దగ్గర రచనలోనూ, దర్శకుడు గుణశేఖర్‌గారి వద్ద టెక్నికల్ విభాగాల్లోనూ పనిచేశా. డైరెక్టర్‌గా చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు Sథ్యాంక్స్’’ అన్నారు సుహాస్ మీరా. నరేశ్ మాట్లాడుతూ– ‘‘మాస్, ఫ్యామిలీ, యూత్ కాన్సెప్ట్ చిత్రమిది. ఇందులో నా ఇద్దరు కుమారులతో పాటు మా అమ్మగారు (విజయ నిర్మల) నటిస్తున్నారు’’ అన్నారు. రచయితలు పరుచూరి బ్రదర్స్, నిర్మాత మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: సత్య కశ్యప్, నిర్మాతలు: ఎస్.కె.విశ్వేశ్‌బాబు, కె.ఎస్.టి.యువరాజ్, యం.వి.కె.రెడ్డి. -
నువ్వంటే ఇష్టం!
ఓ అమ్మాయితో అబ్బాయి ‘నువ్వెన్ని అన్నా నాకు నువ్వు ఇష్టమే’ అంటున్నాడు. మరి అదేంటో తెలుసుకోవాలంటే ‘ఐనా... ఇష్టం నువ్వు’ చూడాల్సిందే. సీనియర్ నరేశ్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ, కీర్తి సురేశ్ జంటగా ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్న చిత్రం ‘ఐనా... ఇష్టం నువ్వు’. రామ్‌ప్రసాద్ రఘుతు దర్శకుడు. ఈ సినిమా టైటిల్, టీజర్‌ను కృష్ణ, విజయనిర్మల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ -‘‘మా కుటుంబంలో మొదటితరం, రెండో తరాన్ని అభిమానించారు. ఇప్పుడు మూడో తరం నుంచి వస్తున్న నవీన్ విజయ్‌కృష్ణకు మీ ఆశీస్సులు అందించా లని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ‘‘టైటిల్లోనే మంచి కథ కనపడుతోంది. నరేశ్‌ను జంధ్యాలగారు పరిచయం చేసి పెద్ద హీరోను చేశారు. అలాగే ఆయన తనయుడిని చంటి అడ్డాల పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని విజయనిర్మల అన్నారు. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: సురేశ్ రఘుతు.