అక్టోబర్‌లో ఐనా ఇష్టం నువ్వు | Inaa Ishtam Nuvvu Movie Will Release October 2020 | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో ఐనా ఇష్టం నువ్వు

Published Wed, Sep 16 2020 4:08 AM | Last Updated on Wed, Sep 16 2020 4:08 AM

Inaa Ishtam Nuvvu Movie Will Release October 2020 - Sakshi

సీనియర్‌ యాక్టర్‌ నరేష్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ, కీర్తీ సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్‌ రౌత్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. మూడు రోజుల చిత్రీకరణ మినహా సినిమా షూటింగ్‌ పూర్తయింది. అక్టోబర్‌ చివరి వారంలో విడుదల కానున్న ఈ సినిమా వివాదంలో పడింది. ‘‘ఈ సినిమాని చంటి అడ్డాల మాకు అమ్మినట్టు సాక్ష్యాలున్నాయి. అయినా ఎక్కువ డబ్బు కోసం ఆయన మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు’’ అని నిర్మాత నట్టికుమార్‌ ఆరోపించారు. కాగా, ఈ చిత్రానికి ‘జానకితో నేను’ అని టైటిల్‌ మార్చినట్లు, అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. మరి.. ఫైనల్‌గా ఈ సినిమాని ఎవరు రిలీజ్‌ చేస్తారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement