keerti suresh
-
గుడ్‌న్యూస్, ‘సర్కారు వారి పాట’కు గుమ్మడికాయ కొట్టేశారు
Sarkaru Vaari Paata Wraps Up Shoot: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ‘సర్కారు వారి పాట’ టీం శుభవార్త అందించింది. ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. మే 12న ఈమూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ షూటింగ్‌ను డైరెక్టర్ శరవేగంగా పూర్తి చేశాడు. చదవండి: సమంత ఫేక్ ఫొటో షేర్ చేసిన విజయ్, పడిపడి నవ్విన సామ్ చివరిగా హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఓ పాట చిత్రీకరణతో సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ పాటలో మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్‌లు స్టెప్పులేశారు. ఇక పాట చిత్రీకరణ పూర్తికాగానే చిత్రానికి గుమ్మడికాయా కొట్టేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో శుక్రవారం(ఏప్రిల్ 22) సాయంత్రం మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ పూర్తి. ఇక మే 12న బాక్సాఫీసును షేక్ చేసేందుకే సిద్ధమవుతుంది’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. చదవండి: అందులో తప్పేముంది, అది నా ఇష్టం: ట్రోల్స్‌పై మలైకా ఫైర్ ఈ సందర్భంగా ఈ మూవీలోని మహేశ్ కొత్తలుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో తాళల గుత్తితో మహేశ్ మాస్‌లుక్‌లో కనిపించాడు. ఇక ఇది చూసి సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో మహేశ్ లుక్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇందులో పాటలు కళావతి, ఎవ్రీ పెన్నీ సాంగ్స్ రికార్టు క్రియేట్ చేశాయి. Shoot Done & Dusted 🤘 All Set for the Box Office Recovery From MAY 12th 💥💥#SarkaruVaariPaata#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/UOVMq4Pqlc — Mythri Movie Makers (@MythriOfficial) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'సర్కారు వారి పాట' నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే..
దుబాయ్‌కి టాటా చెప్పేసింది ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తీ సురేశ్ కథానాయిక. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దుబాయ్ షెడ్యూల్లో ఓ యాక్షన్ సన్నివేశం, ఓ పాట, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. తాజాగా దుబాయ్ షెడ్యూల్ పూర్తయింది. చిత్రబృందం హైదరాబాద్ తిరిగొచ్చారు. నెక్ట్స్ షెడ్యూల్ గోవాలో జరగనుందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
టాలెంటెడ్ అంటూ కీర్తికి మహేష్ బర్త్‌డే విషెస్!
మహానటితో తన సత్తా చాటి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు పొందింది కీర్తి సురేష్. ఈ రోజు కీర్తి పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తికి ట్విట్టర్ ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పారు. మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కార్ వారి పాట’ చిత్రంలో కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘టాలెంటెడ్ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కార్ వారి పాట’ టీం మీకు ఫారెన్ వెళ్లడానికి స్వాగతం పలుకుతోంది. కచ్ఛితంగా ఈ సినిమా మీ జీవితంలో ఒక మంచి గుర్తుగా మిగిలిపోతుంది’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. Here’s wishing the super talented @KeerthyOfficial a very happy birthday!! Team #SarkaruVaariPaata welcomes you aboard!! Will make sure it’s one of your most memorable films💥💥💥 Have a great one !! 😊😊😊 pic.twitter.com/MPzEWc0uGE — Mahesh Babu (@urstrulyMahesh) October 17, 2020 చదవండి: మిస్టరీ: అప్పుడు కట్టప్ప, ఇప్పుడు సీత! -
అక్టోబర్‌లో ఐనా ఇష్టం నువ్వు
సీనియర్ యాక్టర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌత్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. మూడు రోజుల చిత్రీకరణ మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ చివరి వారంలో విడుదల కానున్న ఈ సినిమా వివాదంలో పడింది. ‘‘ఈ సినిమాని చంటి అడ్డాల మాకు అమ్మినట్టు సాక్ష్యాలున్నాయి. అయినా ఎక్కువ డబ్బు కోసం ఆయన మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు’’ అని నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. కాగా, ఈ చిత్రానికి ‘జానకితో నేను’ అని టైటిల్ మార్చినట్లు, అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. మరి.. ఫైనల్‌గా ఈ సినిమాని ఎవరు రిలీజ్ చేస్తారో చూడాలి. -
తండ్రి బాటలోనే కీర్తి సురేష్!
మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా బిజీగా వుంది. కీర్తి సురేష్ ఇప్పుడు మరో అవతారం ఎత్తడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా మారి ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించడానికి కీర్తి సిద్దమౌతోంది. కథ బాగా నచ్చడంతో తమిళ వెబ్ సిరీస్‌ను నిర్మించాలని కీర్తి ఫిక్స్ అయ్యింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది. కీర్తి తండ్రి సురేశ్ కుమార్ కూడా నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఇక కీర్తి సినిమాల విషయానికి వస్తే మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకొని విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక సర్కారు వారి పాట సినిమాలో కీర్తి, మహేష్ బాబు సరసన నటించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నితిన్‌తో చేస్తున్న షూటింగ్ లాక్డౌన్ కారణంగా ఆగిపోగా అది మొదలు కానుంది. చదవండి: ఆ లవ్ లెటర్‌ను దాచుకున్నా: కీర్తి సురేష్ -
ఆ లవ్ లెటర్‌ను దాచుకున్నా: కీర్తి సురేష్
మహానటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అంతే కాకుండా ఇప్పుడు చాలా మంది ఫేవరేట్ హీరోయిన్గా కీర్తి మారిపోయింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీర్తి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మహానటి తన మొదటి చివరి బయోపిక్ అని, ఇతర బయోపిక్‌లలో నటించాలని అనుకోవడంలేదని తెలిపారు. తనకు హాలివుడ్లో టామ్ క్రూజ్ అంటే ఇష్టమని, బాలీవుడ్లో షారుక్‌ఖాన్, దీపికా పదుకునే, అలియాభట్ అంటే ఇష్టమని చెప్పారు. ఇక కోలివుడ్‌కు వస్తే నయనతార డ్రస్సింగ్, సిమ్రాన్ డాన్స్ నచ్చుతాయని కీర్తి తెలిపారు. చదవండి: రాఘవన్‌కి జోడీగా... ఇక ఈ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్నికీర్తి బయట పెట్టారు. కాలేజీ రోజుల్లో ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు కాలేజీ రోజుల్లో ఎవరు ప్రేమ లేఖలు రాయలేదని చెప్పింది. అయితే తాను ఒకసారి జ్యూవెలరీ షాపు ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు అక్కడకు వచ్చిన ఒక అభిమాని, ఓ బహుమతిని ఇచ్చి వెళ్లినట్లు చెప్పింది. అందులో తన ఫోటోలను అల్బమ్ గా ఎంతో చక్కగా అమర్చాడని, వాటితో పాటే ఓ ఉత్తరాన్ని కూడా అతను దాంట్లో ఉంచాడని కీర్తి చెప్పారు. అందులో ఏముందని చూస్తే, తనకు ప్రపోజ్ చేస్తూ లవ్ లెటర్ రాశాడని, దాన్ని తాను చాలా భద్రంగా దాచుకున్నాను అని కీర్తి తన లవ్ లెటర్ సీక్రెట్‌ను బయట పెట్టింది. ఇక సినిమాల విషయానికి వస్తే తాజాగా కీర్తి నటించిన 'గుడ్ లక్ సఖి', 'రంగ్ దే' చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. చదవండి: వడ్డీలు... వాయిదాలు! -
అమెజాన్ ప్రైమ్‌లో కీర్తి సినిమా విడుదల
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వలన సినిమా థియేటర్లన్ని మూతబడ్డాయి. లాక్డౌన్లో అనేక సవరింపులు ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు తెరవడానికి కానీ షూటింగ్‌లకు కానీ ఇంకా ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దీంతో లాక్డౌన్ ముందు విడుదల కావాల్సిన చిత్రాలన్ని ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆగిపోయాయి. దీంతో వాటిని ఆన్లైన్ ఫ్లాట్‌ఫ్లామ్స్‌లో విడుదల చేయడానికి చిత్రయూనిట్ ఆసక్తి చూపుతోంది. జ్యోతిక నటించిన పొన్మగల్ వంధల్ తమిళచిత్రం మొదటిసారి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా తాజాగా కీర్తి సురేష్ రాబోయే చిత్రం పెంగ్విన్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా జూన్19వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. పెంగ్విన్ టీజర్ జూన్ 8 న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. Kick starting the celebration this 8th of June with the teaser release! Stay tuned!#WorldPremiereOnPrime #PenguinTeaserOn8thJune@PrimeVideoIN @karthiksubbaraj @EashvarKarthic @Music_Santhosh @KharthikD @Anilkrish88 @StonebenchFilms @kaarthekeyens @PassionStudios_ pic.twitter.com/wyzfIIW6ec — Keerthy Suresh (@KeerthyOfficial) June 6, 2020 పెంగ్విన్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్, టీజర్ విడుదల సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను ట్విటర్లో తన అభిమానులతో పంచుకున్నారు. జూన్ 8న టీజర్ విడుదలతో సంబరాలు మొదలవుతాయి అంటూ ఆమె ఈ పోస్ట్ చేశారు. తాజాగా విడుదల చేసిన చిత్ర పోస్టర్లో కీర్తి సురేష్ ముఖమంతా గాయాలతో ఉండి, ఆమె ఒక కంటి నుంచి నీరు కారుతున్నట్లు ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించి కీర్తి సురేష్ జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం మహానటిలోని ఒక సన్నివేశంలో ఆమె కళ్ళలో ఒక కంటి నుంచి మాత్రమే నీరు కారే సన్నివేశం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ పోస్టర్ ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తోంది. (వార్నర్ ‘మైండ్ బ్లాక్’ అదిరింది కానీ..) ఈ సినిమాలో కీర్తి సురేష్ గర్భిణీ పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఊహించని ఎన్నో మలుపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈషావర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ తమిళం, తెలుగు, మలయాళ భాషలలో కూడా విడుదల కానుంది. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రాఫర్ ఖార్తిక్ ఫలాని, ఎడిటర్ అనిల్ క్రిష్ సంగీతం అందించారు. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైన రెండవ చిత్రంగా పెంగ్విన్ నిలిచింది. (‘కోహ్లి.. నీ భార్యతో కలిసి జత కట్టు’) -
ప్రేమతో రంగ్ దే
నితిన్ హీరోగా, ‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేశ్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ‘తొలిప్రేమ, మజ్ను’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా రోజున హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త పరుచూరి మహేంద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ‘రంగ్ దే’ స్క్రిప్ట్‌ను నిర్మాతలు ‘దిల్’ రాజు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరికి అందించారు. ‘‘ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. సుప్రసిద్ధ కెమెరామేన్ పి.సి.శ్రీరామ్‌గారు మా సినిమాకి ఛాయాగ్రహణం అందిస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మా సినిమాకి ప్రత్యేక ఆకర్షణ’’ అని వెంకీ అట్లూరి అన్నారు. ‘‘మా సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచే మొదలుపెట్టాం. 2020 వేసవికి ఈ చిత్రం విడుదలవుతుంది’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. నిర్మాతలు కిరణ్, సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిషోర్, ‘సత్యం’ రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్ నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్). -
‘మహానటి’పై మెగాస్టార్ ప్రశంసల జల్లు
-
’సిని’మా కథ
-
అమ్మ ఎదిగిన తీరును బాగా చూపించారు
-
సావిత్రమ్మ
-
‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ విడుదల
-
నేను లోకల్ సినిమాలో డిలీటెడ్ సీన్స్
-
ఫన్నీ వీడియో పోస్ట్ చేసిన నాని