కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వలన సినిమా థియేటర్లన్ని మూతబడ్డాయి. లాక్‌డౌన్‌లో అనేక సవరింపులు ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు తెరవడానికి కానీ షూటింగ్‌లకు కానీ ఇంకా ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దీంతో లాక్‌డౌన్ ముందు విడుదల కావాల్సిన చిత్రాలన్ని ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆగిపోయాయి. దీంతో వాటిని ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫ్లామ్స్‌లో విడుదల చేయడానికి చిత్రయూనిట్ ఆసక్తి చూపుతోంది. జ్యోతిక నటించిన పొన్మగల్ వంధల్ తమిళచిత్రం మొదటిసారి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా తాజాగా కీర్తి సురేష్ రాబోయే చిత్రం పెంగ్విన్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా జూన్19వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. పెంగ్విన్ టీజర్ జూన్ 8 న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
Kick starting the celebration this 8th of June with the teaser release!
— Keerthy Suresh (@KeerthyOfficial) June 6, 2020
Stay tuned!#WorldPremiereOnPrime #PenguinTeaserOn8thJune@PrimeVideoIN @karthiksubbaraj @EashvarKarthic @Music_Santhosh @KharthikD @Anilkrish88 @StonebenchFilms @kaarthekeyens @PassionStudios_ pic.twitter.com/wyzfIIW6ec
పెంగ్విన్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్, టీజర్ విడుదల సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. జూన్ 8న టీజర్ విడుదలతో సంబరాలు మొదలవుతాయి అంటూ ఆమె ఈ పోస్ట్ చేశారు. తాజాగా విడుదల చేసిన చిత్ర పోస్టర్‌లో కీర్తి సురేష్ ముఖమంతా గాయాలతో ఉండి, ఆమె ఒక కంటి నుంచి నీరు కారుతున్నట్లు ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించి కీర్తి సురేష్ జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం మహానటిలోని ఒక సన్నివేశంలో ఆమె కళ్ళలో ఒక కంటి నుంచి మాత్రమే నీరు కారే సన్నివేశం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ పోస్టర్ ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తోంది. (వార్నర్ ‘మైండ్ బ్లాక్’ అదిరింది కానీ..)
ఈ సినిమాలో కీర్తి సురేష్ గర్భిణీ పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఊహించని ఎన్నో మలుపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈషావర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ తమిళం, తెలుగు, మలయాళ భాషలలో కూడా విడుదల కానుంది. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రాఫర్ ఖార్తిక్ ఫలాని, ఎడిటర్ అనిల్ క్రిష్ సంగీతం అందించారు. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైన రెండవ చిత్రంగా పెంగ్విన్ నిలిచింది. (‘కోహ్లి.. నీ భార్యతో కలిసి జత కట్టు’)
Comments
Please login to add a commentAdd a comment