'సర్కారు వారి పాట' నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఎక్కడంటే.. | Sarkaru Vari Pata Next schedule Planned In Goa..! | Sakshi
Sakshi News home page

'సర్కారు వారి పాట' నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఎక్కడంటే..

Published Mon, Feb 22 2021 11:51 PM | Last Updated on Tue, Feb 23 2021 12:52 AM

Sarkaru Vari Pata Next schedule Planned In Goa..! - Sakshi

దుబాయ్‌కి టాటా చెప్పేసింది ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తీ సురేశ్‌ కథానాయిక. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దుబాయ్‌ షెడ్యూల్‌లో ఓ యాక్షన్‌ సన్నివేశం, ఓ పాట, కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. తాజాగా దుబాయ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. చిత్రబృందం హైదరాబాద్‌ తిరిగొచ్చారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ గోవాలో జరగనుందని సమాచారం. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement