Superstar Mahesh Babu and Keerthy Suresh's Sarkaru Vaari Paata Wraps Up Shoot - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: ‘షూటింగ్‌ పూర్తి, ఇక బాక్సాఫీసు కలెక్షన్ల సునామికి సిద్ధం’

Published Fri, Apr 22 2022 9:08 PM | Last Updated on Sat, Apr 23 2022 9:56 AM

Mahesh Babu Sarkaru Vaari Paata Wraps Up Shoot - Sakshi

Sarkaru Vaari Paata Wraps Up Shoot: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌కు ‘సర్కారు వారి పాట’ టీం శుభవార్త అందించింది. ఈ మూవీ షూటింగ్‌ పూర్తయినట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. పరశురామ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మే 12న ఈమూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ షూటింగ్‌ను డైరెక్టర్‌ శరవేగంగా పూర్తి చేశాడు.

చదవండి: సమంత ఫేక్‌ ఫొటో షేర్‌ చేసిన విజయ్‌, పడిపడి నవ్విన సామ్‌

చివరిగా హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఓ పాట చిత్రీకరణతో సర్కారు వారి పాట షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. ఈ పాటలో మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్‌లు స్టెప్పులేశారు. ఇక పాట చిత్రీకరణ పూర్తికాగానే చిత్రానికి గుమ్మడికాయా కొట్టేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో శుక్రవారం(ఏప్రిల్‌ 22) సాయంత్రం మైత్రీ మూవీ మేకర్స్ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌ పూర్తి. ఇక మే 12న బాక్సాఫీసును షేక్‌ చేసేందుకే సిద్ధమవుతుంది’’ అంటూ మేకర్స్‌ ప్రకటించారు.

చదవండి: అందులో తప్పేముంది, అది నా ఇష్టం: ట్రోల్స్‌పై మలైకా ఫైర్‌

ఈ సందర్భంగా ఈ మూవీలోని మహేశ్‌ కొత్తలుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో తాళల గుత్తితో మహేశ్‌ మాస్‌లుక్‌లో కనిపించాడు. ఇక ఇది చూసి సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దీంతో మహేశ్‌ లుక్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఇక ఇందులో పాటలు కళావతి, ఎవ్రీ పెన్నీ సాంగ్స్‌ రికార్టు క్రియేట్‌ చేశాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement