నువ్వంటే ఇష్టం! | Aina Istam Nuvvvu Telugu Movie | Sakshi

నువ్వంటే ఇష్టం!

May 22 2015 11:26 PM | Updated on Sep 3 2017 2:30 AM

నువ్వంటే ఇష్టం!

నువ్వంటే ఇష్టం!

ఓ అమ్మాయితో అబ్బాయి ‘నువ్వెన్ని అన్నా నాకు నువ్వు ఇష్టమే’ అంటున్నాడు. మరి అదేంటో తెలుసుకోవాలంటే

ఓ  అమ్మాయితో అబ్బాయి ‘నువ్వెన్ని అన్నా నాకు నువ్వు ఇష్టమే’ అంటున్నాడు. మరి అదేంటో తెలుసుకోవాలంటే ‘ఐనా... ఇష్టం నువ్వు’ చూడాల్సిందే. సీనియర్ నరేశ్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ, కీర్తి సురేశ్ జంటగా ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్న  చిత్రం ‘ఐనా... ఇష్టం నువ్వు’. రామ్‌ప్రసాద్ రఘుతు దర్శకుడు. ఈ సినిమా టైటిల్, టీజర్‌ను కృష్ణ, విజయనిర్మల హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ -‘‘మా కుటుంబంలో మొదటితరం, రెండో తరాన్ని అభిమానించారు. ఇప్పుడు మూడో తరం నుంచి వస్తున్న నవీన్ విజయ్‌కృష్ణకు మీ ఆశీస్సులు అందించా లని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ‘‘టైటిల్‌లోనే మంచి కథ కనపడుతోంది. నరేశ్‌ను జంధ్యాలగారు పరిచయం చేసి పెద్ద హీరోను చేశారు. అలాగే ఆయన తనయుడిని చంటి అడ్డాల పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని విజయనిర్మల అన్నారు. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: సురేశ్ రఘుతు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement