
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రానికి ‘జానకితో నేను’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తొలుత ‘ఐనా... ఇష్టం నువ్వు’ అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. కానీ ‘జానకితో నేను’ అనే టైటిల్ మరింత బావుంటుందన్న ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. నాలుగైదు రోజులు ప్యాచ్‌వర్క్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. త్వరలో కీర్తీ సురేష్‌తో ఆ సీన్స్ చిత్రీకరిస్తాం. అక్టోబర్ మొదటి వారానికి తొలి కాపీ సిద్ధం అవుతుంది. థియేటర్స్ ఓపెన్ కాగానే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్, సంగీతం: అచ్చు.
Comments
Please login to add a commentAdd a comment