title changed
-
‘భారత్’గా మారిన అక్షయ్ కొత్త సినిమా పేరు
ముంబై: భారతదేశం పేరును అధికారికంగా ఇండియా నుంచి భారత్‌కు మార్చాలన్న ప్రతిపాదనలు, వివాదాల నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కొత్త సినిమా పేరు మారింది. ‘మిషన్ రాణీగంజ్: ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ’ పేరులోని ఇండియా పదాన్ని తొలగించి భారత్ పదాన్ని చేర్చారు. దీంతో సినిమా పేరు ‘మిషన్ రాణీగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ’గా మారింది. ఈ రోజే(గురువారం) ఈ సినిమా థియేటర్లలో విడుదలకాబోతోంది. 1989 నవంబర్‌లో పశి్చమబెంగాల్‌లోని రాణిగంజ్‌లో వరదమయమైన బొగ్గు గనిలో చిక్కుకున్న వారిని సాహసోపేతంగా రక్షించిన సహాయక బృందానికి సారథ్యం వహించిన మైనింగ్ ఇంజనీర్ దివంగత జస్వంత్ సింగ్ గిల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. -
జానకితో నేను
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రానికి ‘జానకితో నేను’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తొలుత ‘ఐనా... ఇష్టం నువ్వు’ అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. కానీ ‘జానకితో నేను’ అనే టైటిల్ మరింత బావుంటుందన్న ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. నాలుగైదు రోజులు ప్యాచ్‌వర్క్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. త్వరలో కీర్తీ సురేష్‌తో ఆ సీన్స్ చిత్రీకరిస్తాం. అక్టోబర్ మొదటి వారానికి తొలి కాపీ సిద్ధం అవుతుంది. థియేటర్స్ ఓపెన్ కాగానే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్, సంగీతం: అచ్చు. -
సెన్సార్ బోర్డ్ అభ్యంతరంతో టైటిల్ మార్పు
ఇటీవల సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ బోర్డ్ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. నిజ జీవిత గాథలు, సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతుండటంతో అవి వివాదాస్పదమవుతున్నాయి. అదే సమయంలో కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమాలు తెరకెక్కుతున్ననాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చీట్ ఇండియా పేరుతో రిలీజ్ రెడీ అవుతున్న ఓ సినిమా విషయంలో ఇలాంటి వివాదాలే తలెత్తాయి. ఇమ్రాన్ హష్మీ హీరోగా సౌమిక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన చీట్ ఇండియా సినిమా టైటిల్‌ను మార్చాలంటూ సెన్సార్ బోర్డ్ సూచించింది. టైటిల్ సినిమా కథా కథనాలను మిస్ లీడ్ చేసే విధంగా ఉందని బోర్డ్ అభిప్రాయపడింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా టైటిల్‌ను ‘వై చీట్ ఇండియా’ అని మార్చేందుకు అంగీకరించారు. శ్రేయా ధన్వంతరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రియల్ స్టార్ వస్తున్నాడు!
నటుడిగా విభిన్న తరహా పాత్రలు పోషించి, ‘రియల్ స్టార్’ అనిపించుకున్నారు శ్రీహరి. ఆయన హీరోగా నటించిన ‘టీ సమోసా బిస్కెట్’ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమా టైటిల్‌ని ‘రియల్ స్టార్’ అని మార్చారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాతలు కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు తెలియజేశారు. ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హంసా నందిని కథానాయికగా నటించారు. ఈ నెలలోనే పాటలను, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీహరి నటించిన చివరి సినిమా ఇదని, ఆయన నిజజీవితానికి దగ్గరగా ఉంటుందనే ‘రియల్ స్టార్’ అని టైటిల్ పెట్టామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ: ఎస్. బాబ్జీ, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్.