
ఇటీవల సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ బోర్డ్ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. నిజ జీవిత గాథలు, సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతుండటంతో అవి వివాదాస్పదమవుతున్నాయి. అదే సమయంలో కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమాలు తెరకెక్కుతున్ననాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చీట్ ఇండియా పేరుతో రిలీజ్ రెడీ అవుతున్న ఓ సినిమా విషయంలో ఇలాంటి వివాదాలే తలెత్తాయి.
ఇమ్రాన్ హష్మీ హీరోగా సౌమిక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన చీట్ ఇండియా సినిమా టైటిల్‌ను మార్చాలంటూ సెన్సార్ బోర్డ్ సూచించింది. టైటిల్ సినిమా కథా కథనాలను మిస్ లీడ్ చేసే విధంగా ఉందని బోర్డ్ అభిప్రాయపడింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా టైటిల్‌ను ‘వై చీట్ ఇండియా’ అని మార్చేందుకు అంగీకరించారు. శ్రేయా ధన్వంతరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment