‘భారత్‌’గా మారిన అక్షయ్‌ కొత్త సినిమా పేరు | Akshay Kumar's 'Mission Raniganj' title changes from 'The Great Indian Rescue' - Sakshi
Sakshi News home page

‘భారత్‌’గా మారిన అక్షయ్‌ కొత్త సినిమా పేరు

Published Thu, Sep 7 2023 6:38 AM | Last Updated on Thu, Sep 7 2023 9:13 AM

Akshay Kumar Mission Raniganj title changes from The Great Indian Rescue - Sakshi

ముంబై: భారతదేశం పేరును అధికారికంగా ఇండియా నుంచి భారత్‌కు మార్చాలన్న ప్రతిపాదనలు, వివాదాల నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ కొత్త సినిమా పేరు మారింది. ‘మిషన్‌ రాణీగంజ్‌: ది గ్రేట్‌ ఇండియన్‌ రెస్క్యూ’ పేరులోని ఇండియా పదాన్ని తొలగించి భారత్‌ పదాన్ని చేర్చారు. దీంతో సినిమా పేరు ‘మిషన్‌ రాణీగంజ్‌: ది గ్రేట్‌ భారత్‌ రెస్క్యూ’గా మారింది.

ఈ రోజే(గురువారం) ఈ సినిమా థియేటర్లలో విడుదలకాబోతోంది. 1989 నవంబర్‌లో పశి్చమబెంగాల్‌లోని రాణిగంజ్‌లో వరదమయమైన బొగ్గు గనిలో చిక్కుకున్న వారిని సాహసోపేతంగా రక్షించిన సహాయక బృందానికి సారథ్యం వహించిన మైనింగ్‌ ఇంజనీర్‌ దివంగత జస్వంత్‌ సింగ్‌ గిల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement