
సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం 'మత్తు వదలరా'. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ‘మత్తు వదలరా 2’ పేరుతో సీక్వెల్‌గా వస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో కనిపించనుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. పార్ట్ 1 మాదిరే ఇందులో కూడా శ్రీ సింహా, సత్యలు కామెడీ అదుర్స్ అనేలా ఉంది. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment