సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం 'మత్తు వదలరా'. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్‌గా రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన వారసుడు శ్రీసింహా తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే, ఈ సినిమా తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ లాంటి సినిమాలు శ్రీసింహ చేసినా పెద్దగా మెప్పించలేకపోయాడు. దీంతో తన హిట్ సినిమా మత్తు వదలరా సీక్వెల్‌ను స్పీడ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు.
డైరెక్టర్ రితేష్- శ్రీసింహా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 13న 'మత్తు వదలరా-2' చిత్రాన్ని విడుదల చేస్తామని ఒక పోస్టర్‌తో మేకర్స్ ప్రకటించారు. పార్ట్-1లో శ్రీ సింహతోపాటు అతని సహచరుడిగా నటించిన సత్య కూడా ఈ సీక్వెల్లో ఉండనున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్‌లోకి కొత్తగా ఫరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment