మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు | Telangana Anti-Narcotics Bureau Notice To Ganja Shankar Movie Team | Sakshi
Sakshi News home page

మెగాహీరో సినిమా.. నోటీసులిచ్చిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో

Published Sun, Feb 18 2024 11:07 AM | Last Updated on Sun, Feb 18 2024 11:22 AM

Telangana Anti Narcotics Bureau Notice To Ganja Shankar Movie Team - Sakshi

సాధారణంగా సినిమాలు రిలీజైన తర్వాత లేదంటే విడుదలకు దగ్గర పడుతున్న టైంలో అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. కానీ మెగాహీరో సాయిధరమ్ తేజ్ చిత్రానికి మాత్రం షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడీ విషయం మెగా అభిమానుల మధ్య చర్చకు కారణమైంది.

యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్.. 'విరూపాక్ష' సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హారర్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం హిట్ అయింది. దీని తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో 'గాంజా శంకర్' అనే సినిమాని నాలుగు నెలల క్రితం ప్రకటించారు. ఆ తర్వాత షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

తాజాగా ఈ చిత్రబృందానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి నోటీసులు వచ్చాయి. టైటిల్‌లోని 'గాంజా' అనే పదాన్ని తొలగించాలని సూచించారు. సినిమాలోనూ డ్రగ్స్‌కి సంబంధించిన సీన్స్ ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, యువతపై ఈ టైటిల్ ప్రభావం చూపించొచ్చని, వెంటనే మార్చాలని చెప్పారు.

అయితే ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ అప్పట్లో వచ్చాయి. ఎందుకంటే టీజర్ లాంటి వీడియో రిలీజ్ చేసి చాలా రోజులైంది గానీ ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లినట్లు సమాచారం లేదు. అలాంటిది ఇప్పుడు టీఎస్ న్యాబ్ వాళ్ల నుంచి నోటీసులు రావడంతో.. ఆగిపోయిన మూవీకి నోటీసులు రావడం ఏంటబ్బా అని కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement