
మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఆదివారం పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. పలువురు సినీ ప్రముఖులు అతడికి విషెస్ చెప్పారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఎవరూ ఊహించని ఓ మంచి పనిచేసిన ఈ కుర్రహీరో శెభాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్)
మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్.. కెరీర్ ప్రారంభంలో వరస హిట్స్ కొట్టాడు. కానీ తర్వాత రొటీన్ కమర్షియల్ సినిమాలతో ఘోరంగా దెబ్బతిన్నాడు. మధ్యలో 'రిపబ్లిక్' లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అలాంటిది 2021లో ఇతడికి బైక్ ప్రమాదం జరగడం, కోమాలోకి వెళ్లిపోవడంతో బతుకుతాడా లేదా అనుకున్నారు. కానీ కోలుకుని మళ్లీ తిరిగొచ్చాడు.
ఈ ఏడాది 'విరూపాక్ష', 'బ్రో' చిత్రాలతో ఆకట్టుకున్న సాయితేజ్.. గతంతో పోలిస్తే ఆలోచన పరంగా చాలా మారిపోయాడు. ఇప్పుడు తన పుట్టినరోజున ఏకంగా రూ.20 లక్షలు విరాళమిచ్చాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ అధికారుల భార్యలకు రూ.10 లక్షలు.. ఏపీ-తెలంగాణ పోలీసులకు రూ.10 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ట్వీట్ చేశాడు. దీంతో అందరూ ఇతడిని ప్రశంసిస్తున్నారు.
(ఇదీ చదవండి: స్టార్ హీరో షూటింగ్‌లో ప్రమాదం.. ఆయన మృతి!)
Exercising my responsibility & Paying respect to the ones who sacrifice their today for our tomorrow, EVERYDAY 🙋♂️
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 15, 2023
Thank you Indian Army, A P Police & Telangana Police & their ever sacrificing families.@adgpi@TelanganaCOPs @APPOLICE100 pic.twitter.com/tHM6RkTER8