
‘హృదయ కాలేయం’, ‘సింగం 123’,‘కొబ్బరి మట్ట’ చిత్రాల తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మళ్లీ తెరపై కనిపించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత సంపూ ‘బజార్ రౌడీ’తో మళ్లీ ప్రేక్షకులను నవ్వించేందుకు వస్తున్నాడు. దర్శకుడు వసంత నాగేశ్వర్ రూపొందించిన ఈ చిత్రాన్ని కేఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. ఇటీవల క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధవారం మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.
పోస్టర్ విషయానికి వస్తే.. చార్మినార్ సిటీ, హైదరాబాద్ మెట్రో రైలు సీన్లతో మొదలై... రసూల్ పూర సిటీకి రౌడీలు జీపులో వచ్చి హల్‌చల్ చేస్తున్నట్లు కనిపించారు. అక్కడే పక్కన నడిరోడ్డులో మంచంపై పడుకుని స్టైల్‌గా సిగరేట్ వెలిగిస్తూ బర్నింగ్ స్టార్ రౌడీ లుక్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ పోస్టర్ చూస్తూంటే మరోసారి సంపూ సీరియస్ కామెడీతో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇక పెద్ద పెద్ద హీరోలకు పనిచేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ‘బజార్ రౌడీ’కి కొరియోగ్రఫీ అందించడం విశేషం.
First Look & Motion Poster of BURNING STAR sampoornesh's #BazarRowdy #SandhireddySrinivasaRao #VasantaNageswaraRao #SekharAlvalapati #SaiKarthik pic.twitter.com/yV042wYDja
— Movie Updates (@popcorn553) February 10, 2021