సల్మాన్‌ రేస్‌ 3 మోషన్‌ పోస్టర్‌ విడుదల | Salman Khan shares Race 3 Motion Poster | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ రేస్‌ 3 మోషన్‌ పోస్టర్‌ విడుదల

Published Thu, Mar 15 2018 4:05 PM | Last Updated on Thu, Mar 15 2018 4:30 PM

Salman Khan shares Race 3 Motion Poster - Sakshi

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌

సాక్షి, న్యూఢిల్లీ : సల్మాన్‌ ఖాన్‌ నెక్ట్స్‌ మూవీ రేస్‌ 3 మోషన్‌ పోస్టర్‌ను బాలీవుడ్‌ కండలవీరుడు గురువారం విడుదల చేశారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రేస్‌ 3 ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకొస్తుందని ఈ సందర్భంగా సల్మాన్‌ వెల్లడించారు. రేస్‌ 3 లీడ్‌ రోల్‌లో సల్మాన్‌ ఖాన్‌ సందడి చేయనుండగా, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌, డైసీ షా తమ అందాలతో కనువిందు చేయనున్నారు. ఇంకా అనిల్‌ కపూర్‌, సాఖిబ్‌ సలీంలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గతంలో రేస్‌, రేస్‌ 2 మూవీల్లో సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఇక రేస్‌ 3 మూవీ టిప్స్‌ ఫిల్మ్స్‌, సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటోంది. రేస్‌ సీక్వెల్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌ స్ధానంలో సల్మాన్‌ ఖాన్‌ ఎంతవరకూ మెప్పించగలరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో సోనాక్షి సిన్హా కూడా కొద్దిసేపు మెరవనున్నట్టు తెలిసింది. యాక్షన్‌, డ్రామా, రొమాన్స్‌, గ్లామర్‌ కలగలిపి రేస్‌ 3 ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement