తమిళసినిమా: సంచలన తారల్లో నటి త్రిష ఒకరన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ప్రేమ, పెళ్లి దాకా వెళ్లి అంతటితోనే ఆగిపోయి నటనపైనే దృష్టిసారిస్తున్న ఈ బ్యూటీ. అదే విధంగా మూడు పదులు దాటినా కథానాయకిగా రాణిస్తున్న త్రిష కమర్శియల్ చిత్రాల నాయకిగానూ, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగానూ రాణిస్తోంది. అలా నయనతార, అనుష్కల బాటలో పయనిస్తున్న త్రిషను నాయకి చిత్రం నిరాశపరచింది. మరో విషయం ఏమిటంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం అయిన నాయకి ఫ్లాప్ అయినా, మరిన్ని ఆ తరహా చిత్రాలు ఆమెను వరించడం విశేషమే. అలా మోహిని, గర్జన వంటి చిత్రాలతో యాక్షన్ సన్నివేశాల్లో దుమ్మురేపడానికి త్రిష సిద్ధమైంది.
ఈ అమ్మడిని తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. కొడి చిత్రం తరువాత తమిళ తెరపై కనిపించలేదు. అలాగని అవకాశాలు లేవని కాదు. చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు మోహిని, గర్జన, అరవిందస్వామికి జంటగా చతురంగవేట్టై 2, విజయ్‌సేతుపతి సరసన 96, 1818 అనే మరో విభిన్న కథా చిత్రం అంటూ బిజీబిజీగా నటించేస్తోంది. అయితే చిత్ర నిర్మాణంలో జాప్యం వంటి పలు కారణాల వల్ల త్రిష చిత్రాల విడుదలలో ఆలస్యం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీ నటించిన మోహిని, గర్జన, 96 చిత్రాలు వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయన్నాయని సమాచారం. దీంతో త్రిష కూడా ఖుషీ అవుతోందట. ఈ విషయం ఆమె అభిమానులను మరింత ఖుషీ పరిచేదే అవుతుందిగా!
Comments
Please login to add a commentAdd a comment