
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎంపీల రాజీనామాలు ఆమోదించాల్సిందేనన్నారు. టీడీపీ, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ఉంటామని తెలిపారు. చంద్రబాబు నాయడు వంచనపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.
జూన్ 2న నెల్లూరు జిల్లా కేంద్రంగా ‘వంచనపై గర్జన’ పేరుతో సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గర్జనలో నల్ల బ్యాడ్జీలతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, రాజీనామా చేసిన ఎంపీలు, కార్యకర్తలంతా పాల్గొంటారని పేర్కొన్నారు. టీడీపీ మహానాడులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కాకుండా అనవసర విషయాలపై చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment