సాక్షి, ఢిల్లీ: సీఎం చంద్రబాబు నాయుడు తగిన మూల్యం చెల్లించక తప్పదని, టీడీపీ ఎంపీలు నిరాహారదీక్షను అవహేళన చేయడం తగదని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామి రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరం వద్ద నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్లు దీక్ష విరమించాలి అని చెప్పిన ఎంపీలు ఒప్పుకోవడం లేదన్నారు. కానీ, ఈ విషయం పీఎం నరేంద్ర మోదీ సర్కారుకి మాత్రం చీమ కుట్టినట్టులేదని విమర్శించారు. ఈ రోజు(మంగళవారం) ఎంపీలకు సంఘీభావంగా చేపట్టిన రహదారుల దిగ్భంధం విజయవంతం అయిందన్నారు. అంతేకాక రేపు( బుధవారం) రైల్ రోకోలను కూడా ఇదేవిధంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి రైలు ప్రయాణికులు కూడా సహకరించాలని కోరారు.
చంద్రబాబు మీరు అమర్‌సింగ్‌ని ఢిల్లీలో కలిసింది వాస్తవం.. ఏపీ భవన్ సీసీ ఫుటేజీ బయటపెట్టండని పేర్కొన్నారు. చంద్రబాబు నీ వ్యాపార లావాదేవీల కోసమే మీరు ఢిల్లీ వచ్చారని ధ్వజమెత్తారు. ఈ విషయాలన్నింటిని అగ్రిగోల్డ్ భాదితులు ప్రశ్నించాలన్నారు. భవిష్యత్తులో బాబు తగిన మూల్యం చెల్లించక తప్పదిన హెచ్చరించారు. ఇకనైనా నీ కల్లబొల్లి మాటలు కట్టిపెట్టు అని హితవు పలికారు.
అంతేకాక ఏపీ దేశంలో భాగమా? కాదా? అనే విషయాన్ని పీఎం నరేంద్ర మోదీ చెప్పాలి.. ఇప్పటికైనా కళ్లు తెరవండీ అని వైఎస్సార్ సీపీ నాయకులు కోరారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న నిరాహార ధీక్షను టీడీపీ మంత్రులు అవహేళన చేయడం.. అంతేకాక కించపరిచేలా మాటలు మాట్లాడం సరికాదన్నారు. టీడీపీ మంత్రులు ఢిల్లీలో చేసింది డ్రామాలు.. మోడీ ఇంటి ముందు ధర్నా అంటూ నాటకాలు చేశారని ధ్వజమెత్తారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడతున్నారు.. ఇప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోండని వైఎస్సార్ సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment