సాక్షి, శ్రీకాకుళం: వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. భావితరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం నడుస్తోందని ఆయన అన్నారు. ‘అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు. నిపుణులు ఎంత చెప్పినా.. చంద్రబాబు పట్టించుకోలేద’ని తమ్మినేని మండిపడ్డారు.
జిల్లా ఆముదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభివృద్ధి వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని జేఏసీ ప్రతినిధులు అన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఎనలేని పురోగతి ఉంటుందన్నారు. విశాఖను రాజధాని చేస్తే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తాయన్నారు.
చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ
Comments
Please login to add a commentAdd a comment