ఇక..ఈ-పాస్ పుస్తకాలు!
నరసన్నపేట రూరల్: పారదర్శక పాలనే ధ్యే యంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ-పాసు పుస్తకాలను ప్రవేశపెడుతున్నారు.
ప్రదక్షిణలు అవసరం లేదు
ఇప్పటి వరకు పట్టాదారు పుస్తకం కావాలం టే రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ఇదే అదనుగా కొందరు కార్యదర్శులు వేలాది రూపాయలు తీసుకొని కాళ్లరిగేలా..తిప్పిన సంఘటనలు కోకొల్లలు. ఇకపై ఈ దుశ్చర్యలకు బ్రేక్ పడనుంది.
ఇదివరకు..
దరఖాస్తు చేసుకోవడం వరకూ ఆన్‌లైన్ విధా నం అందుబాటులోకి వచ్చినా, తదుపరి ప్రక్రి య అంతా మామూలుగానే సాగేది. దీంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంకుల్లో తనఖాలు వంటి వాటిలో అవకతవకలకు ఆశించిన స్థాయిలో చెక్ పడలేదు. దీంతో రాజాం తదితర మండలాల్లో పలు అవకతవకలు వెలుగు చూసిన విషయం విదితమే. భూముల అమ్మకాల సమయంలో రిజిస్ట్రేషన్‌కు పాసుపుస్తకాలు పరిగణనలోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. ఉదాహరణకు పదెకరాల రైతు రెండెకరాల భూమిని విక్రయిస్తే, అతని వద్ద మిగిలేది 8 ఎకరాలు. అయితే ఇది పాస్‌పుస్తకాల్లో నమోదు కాక పోవడంతో 10 ఎకరాలు పాస్‌పుస్తకంలో ఉంటుం ది. దీంతో బ్యాంకుల్లో ఈ పదెకరాలకు రైతులు రుణాలు పొందిన సందర్భాలు అనేకం. ఇలాం టి అవకతవకలను సమర్థంగా నిరోదించేందుకు ఈ -పాస్‌పుస్తకం ఉపకరిస్తుందని రెవె న్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పాసుపుస్తకం కోసం ఏం చేయాలి
దరఖాస్తుదారు భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్, గతంలో ఉన్న పాస్‌పుస్తకాలు తదితర ఆధారాలతో మీ సేవాకేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. సర్వీసు చార్జి కింద రూ. 35, స్టేషనరీ చార్జి కింద రూ.100 చెల్లించాలి. దరఖా స్తు చేసిన 60 రోజుల్లో పోస్టులో హైదరాబాద్ సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి ముద్రితమైన ఆధునిక ఈ పాస్‌పుస్తకం ఇంటికి చేరుతుంది.
ఎంతో మేలు
ఈ-పాసుపుస్తకం విధానం మేలైనది. భూ మి రిజిస్ట్రేషన్ సమయంలో పాసుపుస్తకం ఆప్షనను పెట్టుకొంటే రిజిస్ట్రేషన్‌తో పాటు ఈ- పాస్‌పుస్తకం కూడా వచ్చేస్తుంది. దీంతో లింకు డాక్యుమెంట్, యూనిక్ ఐడీ నంబర్ తో సహా ప్రింట్ వస్తుంది. బ్యాంకులు, సబ్‌రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాల్లో ఆన్‌లైన్ వివరాలు అందుబాటులో ఉంటాయి.
-సుధాసాగర్, నరసన్నపేట