E pass books
-
ఏపీజీబీలో ఈ పాస్ బుక్ సౌకర్యం
రీజినల్ మేనేజర్ శివయ్య నెల్లూరు(బృందావనం): ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులకు విస్తృ సేవలను అందించే క్రమంలో ఈ–పాస్ బుక్ మొబైల్ అప్లికేషన్ సౌకర్యాన్ని శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచినట్లు ఆ బ్యాంక్ నెల్లూరు రీజినల్ మేనేజర్ బీవీ శివయ్య తెలిపారు. స్థానిక కరెంటాఫీస్ సెంటర్ సమీపంలోని ఆ బ్యాంక్ రీజినల్ కార్యాలయంలో శుక్రవారం ఏపీజీబీ ఈ పాస్ బుక్ సౌకర్యాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బ్యాంక్ చైర్మన్ సంపత్‌కుమారాచారి తీసుకున్న నిర్ణయం మేరకు ఐదు జిల్లాలో ఈ సౌకర్యాన్ని కలిగిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 88 శాఖలను కలిగి ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ నాటికి రూ.1458కోట్లు డిపాజిట్లుగా, రూ.1299 కోట్లు రుణాలుగా కలిగి ఉందని వెల్లడించారు. జిల్లాలో ఎనిమిది ప్రాంతాల్లో ఏటీఎంలను కలిగి ఉందన్నారు. మరో మూడు ఏటీఎంలను పెంచలకోన, కోవూరు, కొండాపురంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అన్ని శాఖల్లో మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం కలిగి ఉందన్నారు. అలాగే మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సౌకర్యం (92669 21358)తో పాటు ఎస్ఎంఎస్ సేవలను ఖాతాదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ వి.మధుసూదన్‌రావు పాల్గొన్నారు. -
ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంలో జిల్లా ఫస్ట్
జాయింట్ కలెక్టర్ రామారావు ప్రొద్దుటూరు కల్చరల్ : ఓటరు కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ రామారావు అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కృషితో వీఆర్ఓ స్థాయి నుంచి ఆర్డీఓ వరకు అందరు ఎంతో కృషి చేశారని, దీని వలనే 13వ స్థానంలో నుంచి 1వ స్థానంలోకి చేరిందన్నారు. ఇంత వరకు ఆధార్‌తో ఓటరు కార్డు లింకేజి చేసుకోని వారి ఓట్లు ఎందుకు తొలగించకూడదంటూ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల గడువులో సరైన వివరణ ఇవ్వకపోతే ఓటరు జాబితా నుంచి తొలగిస్తారన్నారు. జిల్లాలో రైతులకు గతంలోని పాసుపుస్తకాల స్థానంలో ఈ పాస్‌పుస్తకాలు మంజూరు చేశామన్నారు. టైటిల్ డీడ్‌ను జిల్లాలోనే ముద్రించి రైతులకు జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ పాస్‌పుస్తకాల కోసం 12346 దరఖాస్తులు రాగా వాటిలో 404 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. 8676 మందికి ఈ పాస్ పుస్తకాలను జారీ చేశామన్నారు. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీ డీలర్లు అధిక ధరలను వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినాయకం, తహశీల్దార్ రాంభూపాల్‌రెడ్డిలు ఉన్నారు. విషపూరిత డ్రమ్ములను తొలగించాలి గోపవరం పంచాయతీ పరిధిలోని ఇందిరా నగర్లో ఉన్న విషపూరిత లిక్విడ్ డ్రమ్ములను తొలగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బాలలక్షుమయ్య, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, మురళీ, ప్రసాద్, రాయుడు జాయింట్ కలెక్టర్ రామారావుకు వినతి పత్రం అందించారు. అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణమనాయుడు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని జేసీని కోరారు. -
‘ఈ పాస్’ పుస్తకాలకు రంగం సిద్ధం
రామచంద్రపురం : రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ ద్వారా ‘ఈ పాస్’ పుస్తకాలు (పట్టాదారు) అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ పుస్తకాల పంపిణీలో జాప్యం తగ్గింపునకు, నకిలీ పాస్‌పుస్తకాల నిరోధానికి ‘ఈ పాస్’ పుస్తకాలు దోహదపడనున్నాయి. తమ శాఖను, రిజిస్ట్రేషన్‌శాఖను అనుసంధానం చేస్తూ వెబ్‌ల్యాండ్ ద్వారా ఈ పాస్ పుస్తకాలను ఆన్లైన్లో అందించేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు చర్యలు చే పట్టారు. జిల్లాలో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ ల్యాండ్ రికార్డులను రిజిస్ట్రేషన్లశాఖతో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే అడంగళ్ రికార్డుల అనుసంధానం 80 శాతం వరకు పూర్తయినట్టు రె వెన్యూ అధికారులు చెబుతున్నారు. స్థలాలను సబ్ డివిజన్ చేసే ప్రక్రియ మినహా ఏకమొత్తంగా ఉన్న అన్ని రకాల రెవెన్యూ స్థలాలను ఇప్పటికే వెబ్‌ల్యాండ్‌లో ఉం చినట్టు ఆ శాఖాధికారులు అంటున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఇకపై ఈ పాస్ పుస్తకాలకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆస్తిని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ ఆస్తి వెంటనే రెవెన్యూ రికార్డుల్లో కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారి పేరన మారుతుంది. కొనుగోలు దారుడు మీ సేవలో చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన వీఆర్వోలు, ఇతర అధికారులు తహశీల్దార్ డిజిటల్ సంతకంతో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు తీసుకున్న చెన్నైలోని ఏజెన్సీ స్పీడ్ పోస్టు ద్వారా ఈ పాస్ పుస్తకాన్ని దరఖాస్తుదారు ఇంటికి పంపిస్తుంది. ఈ మొత్తం పక్రియకు 40 నుంచి 45 రోజులు పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపై ఇప్పటికే రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో తహశీల్దార్లకు ఆర్డీఓ సుబ్బారావు ఆన్లైన్ శిక్షణ నిచ్చారు. తగ్గనున్న అధికారుల ప్రమేయం ఈ పాస్ పుస్తకాల మూలంగా రెవెన్యూ అధికారుల ప్రమేయం, అవినీతి, నకిలీ పాస్ పుస్తకాల బెడద కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అయితే టైటిల్ డీడ్ ఆన్లైన్లో ఇచ్చేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో తప్పని ఇబ్బందులుమీ సేవ ద్వారా ఈ పాస్ పుస్తకాలందించేందుకు క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బందులున్నాయంటున్నారు. స్థలాలు సబ్ డివిజన్ కాకపోవటంతో పాటు రెవెన్యూ రికార్డులు పట్టాదారు పాస్ పుస్తకాల్లోని తప్పుడు సర్వే నంబర్లతో ఉండటం కూడా ఇందుకు కారణమంటున్నారు. జిల్లావ్యాప్తంగా ల్యాండ్ సర్వే పూర్తయి, రెవెన్యూ రికార్డులు ఆన్లైన్లో పూర్తి స్థాయిలో నమోదైతే గాని స్పష్టత రాదని అధికారులే చెబుతున్నారు. -
ఇక..ఈ-పాస్ పుస్తకాలు!
నరసన్నపేట రూరల్: పారదర్శక పాలనే ధ్యే యంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ-పాసు పుస్తకాలను ప్రవేశపెడుతున్నారు. ప్రదక్షిణలు అవసరం లేదు ఇప్పటి వరకు పట్టాదారు పుస్తకం కావాలం టే రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ఇదే అదనుగా కొందరు కార్యదర్శులు వేలాది రూపాయలు తీసుకొని కాళ్లరిగేలా..తిప్పిన సంఘటనలు కోకొల్లలు. ఇకపై ఈ దుశ్చర్యలకు బ్రేక్ పడనుంది. ఇదివరకు.. దరఖాస్తు చేసుకోవడం వరకూ ఆన్లైన్ విధా నం అందుబాటులోకి వచ్చినా, తదుపరి ప్రక్రి య అంతా మామూలుగానే సాగేది. దీంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంకుల్లో తనఖాలు వంటి వాటిలో అవకతవకలకు ఆశించిన స్థాయిలో చెక్ పడలేదు. దీంతో రాజాం తదితర మండలాల్లో పలు అవకతవకలు వెలుగు చూసిన విషయం విదితమే. భూముల అమ్మకాల సమయంలో రిజిస్ట్రేషన్‌కు పాసుపుస్తకాలు పరిగణనలోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. ఉదాహరణకు పదెకరాల రైతు రెండెకరాల భూమిని విక్రయిస్తే, అతని వద్ద మిగిలేది 8 ఎకరాలు. అయితే ఇది పాస్‌పుస్తకాల్లో నమోదు కాక పోవడంతో 10 ఎకరాలు పాస్‌పుస్తకంలో ఉంటుం ది. దీంతో బ్యాంకుల్లో ఈ పదెకరాలకు రైతులు రుణాలు పొందిన సందర్భాలు అనేకం. ఇలాం టి అవకతవకలను సమర్థంగా నిరోదించేందుకు ఈ -పాస్‌పుస్తకం ఉపకరిస్తుందని రెవె న్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాసుపుస్తకం కోసం ఏం చేయాలి దరఖాస్తుదారు భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్, గతంలో ఉన్న పాస్‌పుస్తకాలు తదితర ఆధారాలతో మీ సేవాకేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. సర్వీసు చార్జి కింద రూ. 35, స్టేషనరీ చార్జి కింద రూ.100 చెల్లించాలి. దరఖా స్తు చేసిన 60 రోజుల్లో పోస్టులో హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ముద్రితమైన ఆధునిక ఈ పాస్‌పుస్తకం ఇంటికి చేరుతుంది. ఎంతో మేలు ఈ-పాసుపుస్తకం విధానం మేలైనది. భూ మి రిజిస్ట్రేషన్ సమయంలో పాసుపుస్తకం ఆప్షనను పెట్టుకొంటే రిజిస్ట్రేషన్‌తో పాటు ఈ- పాస్‌పుస్తకం కూడా వచ్చేస్తుంది. దీంతో లింకు డాక్యుమెంట్, యూనిక్ ఐడీ నంబర్ తో సహా ప్రింట్ వస్తుంది. బ్యాంకులు, సబ్‌రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాల్లో ఆన్లైన్ వివరాలు అందుబాటులో ఉంటాయి. -సుధాసాగర్, నరసన్నపేట