‘ఈ పాస్’ పుస్తకాలకు రంగం సిద్ధం | Prepare the pass books | Sakshi
Sakshi News home page

‘ఈ పాస్’ పుస్తకాలకు రంగం సిద్ధం

Published Thu, Dec 11 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

Prepare the pass books

 రామచంద్రపురం : రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ ద్వారా ‘ఈ పాస్’ పుస్తకాలు (పట్టాదారు) అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ పుస్తకాల పంపిణీలో జాప్యం తగ్గింపునకు, నకిలీ పాస్‌పుస్తకాల నిరోధానికి ‘ఈ పాస్’ పుస్తకాలు దోహదపడనున్నాయి. తమ శాఖను, రిజిస్ట్రేషన్‌శాఖను అనుసంధానం చేస్తూ వెబ్‌ల్యాండ్ ద్వారా ఈ పాస్ పుస్తకాలను ఆన్‌లైన్‌లో అందించేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు చర్యలు చే పట్టారు. జిల్లాలో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌లో మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.  
 
 రెవెన్యూ ల్యాండ్ రికార్డులను రిజిస్ట్రేషన్లశాఖతో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే అడంగళ్ రికార్డుల అనుసంధానం 80 శాతం వరకు పూర్తయినట్టు రె వెన్యూ అధికారులు చెబుతున్నారు. స్థలాలను సబ్ డివిజన్ చేసే ప్రక్రియ మినహా ఏకమొత్తంగా ఉన్న అన్ని రకాల రెవెన్యూ స్థలాలను ఇప్పటికే వెబ్‌ల్యాండ్లో ఉం చినట్టు ఆ శాఖాధికారులు అంటున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఇకపై ఈ పాస్ పుస్తకాలకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆస్తిని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ ఆస్తి వెంటనే రెవెన్యూ రికార్డుల్లో కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారి పేరన మారుతుంది.  కొనుగోలు దారుడు మీ సేవలో చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన వీఆర్వోలు, ఇతర అధికారులు తహశీల్దార్ డిజిటల్ సంతకంతో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. అనంతరం ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు తీసుకున్న చెన్నైలోని ఏజెన్సీ స్పీడ్ పోస్టు ద్వారా ఈ పాస్ పుస్తకాన్ని దరఖాస్తుదారు ఇంటికి పంపిస్తుంది. ఈ మొత్తం పక్రియకు 40 నుంచి 45 రోజులు పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపై ఇప్పటికే రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌లో తహశీల్దార్‌లకు ఆర్డీఓ సుబ్బారావు ఆన్‌లైన్ శిక్షణ నిచ్చారు.
 
 తగ్గనున్న అధికారుల ప్రమేయం
  ఈ పాస్ పుస్తకాల మూలంగా రెవెన్యూ అధికారుల ప్రమేయం, అవినీతి, నకిలీ పాస్ పుస్తకాల బెడద కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అయితే టైటిల్ డీడ్ ఆన్‌లైన్‌లో ఇచ్చేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
 క్షేత్రస్థాయిలో తప్పని ఇబ్బందులుమీ సేవ ద్వారా ఈ పాస్ పుస్తకాలందించేందుకు  క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బందులున్నాయంటున్నారు. స్థలాలు సబ్ డివిజన్ కాకపోవటంతో పాటు రెవెన్యూ రికార్డులు పట్టాదారు పాస్ పుస్తకాల్లోని తప్పుడు సర్వే నంబర్లతో ఉండటం కూడా ఇందుకు కారణమంటున్నారు. జిల్లావ్యాప్తంగా ల్యాండ్ సర్వే పూర్తయి, రెవెన్యూ రికార్డులు ఆన్‌లైన్‌లో పూర్తి స్థాయిలో నమోదైతే గాని స్పష్టత రాదని అధికారులే చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement