‘భరోసా’కు భంగం! | TDP govt to complete 6 months on Monday; challenges galore | Sakshi
Sakshi News home page

‘భరోసా’కు భంగం!

Published Tue, Dec 9 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

‘భరోసా’కు భంగం!

‘భరోసా’కు భంగం!

రామచంద్రపురం :పింఛన్ల పంపిణీ పథకం పేరును ‘ఎన్టీఆర్ భరోసా’గా మార్చిన టీడీపీ ప్రభుత్వం సంతోషం, సంతృప్తి, భద్రత, ఆరోగ్యం, భరోసా అయిదురెట్లు పెరిగాయంటూ ప్రచారం చేసుకుంటోంది. అయితే పింఛన్ల మొత్తం పెరుగుతుందని ఆశ పెట్టుకున్నవారిలో అనేకులకు అసలుకే ముప్పు వాటిల్లింది. పలు సాకులతో పలువురికి పింఛన్లు నిలిచిపోయాయి. ఏ లబ్ధిదారునికి ఏ రోజు ఏ ఆటంకం కలుగుతుందోనని బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ గత రెండు రోజులుగా నిలిచిపోయింది. ఎందుకు నిలిపివేశారో, తిరిగి ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియక పింఛన్‌దారులు అల్లాడుతున్నారు.
 
 జిల్లాలో పింఛన్ల పంపిణీ రెండు రకాలుగా జరుగుతోంది. గ్రామాల్లో పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తుండగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి మనిపాల్ గ్రూప్ సంస్థ పంపిణీకి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అర్బన్ ప్రాంతాల్లో ప్రతి నెలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులు 57,560 మందికి రూ.6.36 కోట్లు పంపిణీ చేస్తున్నారు. మనిపాల్ గ్రూప్ జిల్లావ్యాప్తంగా సుమారు 85 మంది సిబ్బందితో బయో మెట్రిక్ మెషీన్ల ద్వారా ఈ పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా సొమ్ములు సరఫరా చేసేలా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ప్రభుత్వం ఈ బ్యాంకుకు సొమ్ములను  విడుదల చేస్తుంది.
 
  ఈనెల రెండు నుంచి మున్సిపాలిటీలలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన మనిపాల్ సిబ్బంది 6 వరకు జిల్లావ్యాప్తంగా సుమారు 16 వేల మంది లబ్ధిదారులకు రూ.1.80 కోట్ల వరకు పింఛన్లను పంపిణీ చేసినట్టు సమాచారం. అయితే అర్ధాంతరంగా ప్రభుత్వం నుంచి పింఛన్ల పంపిణీని నిలుపుదల చేయాలని మనిపాల్ సంస్ధకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇంకా సుమారు 40 వేల మందికి రూ.5 కోట్లకు పైగా పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే విడుదల చేసిన సొమ్ముల వరకూ పంపిణీ చేసి, ఆపై నిలిపివేయాలని ఈనెల 6న ఆదేశించినట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీకి సంబంధించిన సర్వర్లను ముందస్తు సమాచారం లేకుండానే నిలిపివేశారు.  మనిపాల్ సిబ్బంది వద్ద గల బయోమెట్రిక్ మెషీన్లను కూడా ఆ సంస్థ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నారు.
 
 ఎందుకు నిలిపివేశారో..?
 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పింఛన్ల కోసం వచ్చిన లబ్ధిదారులకు అవి రావటం లేదని తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఎందుకు నిలిపివేశారో, ఎప్పుడు ఇస్తారో  తెలియక గుబులు పడుతున్నారు. ఇలా అర్ధాంతరంగా సొమ్ముల పంపిణీ నిలిపివేయటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా పంపిణీ జరుగుతుండగా ఇప్పుడు అర్ధాంతరంగా నిలిపివేసిన నేపథ్యంలో.. తర్వాతైనా ఇస్తారా లేక నిలిపివేస్తారా అనే అనుమానాలు పీడిస్తున్నాయి. పింఛన్లు ఆగిపోయిన సం గతి మున్సిపాలిటీ అధికారులకు కూడా తెలియని స్థితి ఏర్పడింది. కాగా జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పింఛన్ల పంపిణీ విధులను నిర్వర్తిస్తున్న 80 మంది మనిపాల్ సిబ్బందికి కూడా ఈ పరిణామం జీర్ణం కావడం లేదు. ఈ పనిని నమ్ముకున్న తాము రోడ్డున పడతామని వాపోతున్నారు. ప్రభుత్వం ఇలా ఎందుకు చేసిందో తెలియని అయోమయం వారినీ వెన్నాడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement