Ramchandrapuram
-
ప్రియుడు కోసం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వస్తే.
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని ఒంగోలు చెందిన ఓ బాలిక తను ప్రేమించిన వ్యక్తి కోసం హైదరాబాద్‌కు వచ్చింది. కాగా ప్రేమించిన ఆ యువకుడు ఆమెను సోమవారం రామచంద్రాపురం పట్టణంలోని లింగంపల్లిలో వదిలేసి వెళ్లాడు. దీంతో ఆ బాలిక రోడ్డుపై రోదిస్తూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెకు ధైర్యం చెప్పారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన యువకుడు ప్రస్తుతం పటాన్చెరులో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడని అతని కోసం ఇక్కడికి వచ్చానని వివరించింది. అతడి ఫోన్ నంబరు కూడా తన వద్ద లేదని సీఐ సంజయ్‌కు చెప్పగా, స్టేట్ హోంకు తరలించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయిందని.. పటాన్చెరు టౌన్: ఉద్యోగం పోయిందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ పోలీసుల కథనం ప్రకారం..సాయి విల్లాస్‌లో నివాసం ఉండే హరీశ్(30) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. అయితే ఇటీవలే హరీశ్ ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఆదివారం భార్య నందిని బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న హరీశ్ చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇంటికి రాగా ఉరివేసుకొన్న భర్త కనిపించాడు. స్థానికుల సాయంతో భర్తను మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు హరీశ్ సోదరుడు రమేశ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక సమరమే..
రామచంద్రపురం :విభిన్న అంశాలకు వేదికగా ఉండే రామచంద్రపురం నియోజకవర్గంలో మరోసారి భిన్న పరిస్థితులు నెలకుంటున్నాయి. నియోజకవర్గంలో 30 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటిగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇంత వరకు ఏకపక్షంగా సాగిన పాలనకు బోస్ ఎమ్మెల్సీగా రావటంతో తెరపడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన సత్కార సభలో ఇక సమరమే అన్నట్టుగా సాగిన బోస్ ప్రసంగం మరింత బలం చేకూరుస్తుందంటున్నారు. సాధారణ ఎన్నికలు జరిగిన ఏడాదికి ఎమ్మెల్సీ పదవిని పొందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత బోస్ తన సాధారణ శైలికి భిన్నంగా ప్రసంగించిన తీరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. గత నెల 30న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సుభాష్‌బోస్ ఈ నెల 2న నియోజకవర్గానికి విచ్చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గం నలుమూలల నుంచి ఊహించని విధంగా, అభిమానులు ప్రజలు తరలివచ్చిన తీరు టీడీపీ ప్రభుత్వంపైనా, స్థానిక నేత పైనా పెరుగుతున్న అసంతృప్తిని తెలియజేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీ నేతలు నివ్వెరపోయేలా జరిగింది బోస్ స్వాగత సత్కార ర్యాలీ. ఈ నెల 2న ద్రాక్షారామలో జరిగిన సత్కార సభలో బోస్ ఎన్నడూ లేని విధంగా మాట్లాడడం అటు అధికార పార్టీ నాయకుల్లోను, అధికారుల్లోనూ గుబులు రేపుతోంది. నిబద్ధతకల నేతగా ఉండే బోస్ ఒక్కసారిగా హెచ్చరికలు జారీ చేయటంతో అధికార పార్టీ నేతలకు, వారికి వంత పాడుతున్న అధికారులకు రాబోయే కాలంలో జరిగే పరిణమాలను ముందుగానే ఎలాగుంటాయోననే భయం ఏర్పడుతుందని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. చట్ట ప్రకారం పనిచేయండని ఎప్పుడూ అధికారులకు చెప్పే ఎమ్మెల్సీ బోస్‌కు..... నేను చెప్పిందే చేయాలనే స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు మధ్య అధికారులు నలిగిపోక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడాది కాలంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో పరిస్థిలు అధ్వానంగా మారిపోయాయి. స్థానిక అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా మారింది. వైఎస్సార్సీపీ నాయకులపైనా, కార్యకర్తలపైనా కేసులు పెట్టి వేధింపులకు గురిచేయటం షరా మామూలుగా మారింది. వైఎస్సార్సీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులను వేధింపులకు గురిచేస్తు వారి చెక్ పవర్లను కూడా రద్దు చేయటం, రేషన్‌షాపు లెసైన్సులను రద్దు చేయటం వంటి కార్యక్రమాలు అధికార పార్టీ నేతలు చేపట్టారనే విమర్శలుకూడా ఉన్నాయి. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన సమయంలో పట్టంచుకోకుండా ఉన్న అధికారుల తీరు బోస్‌ను మారే విధంగా చేశాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన కార్యకర్తలకు గానీ, ప్రజలకు గానీ అధికారులను అడ్డం పెట్టుకుని అన్యాయం చేస్తే ఊరుకునే స్థితిలో లేననే సంకేతాలను బోస్ పంపించినట్టు స్పష్టమైందని స్థానిక నేతలు అంటున్నారు. నిబంధనల ప్రకారం పనిచేయకపోతే శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసి తాట తీస్తానని హెచ్చరించిన బోస్ మాటలు ఆ పార్టీ నేతల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపిందనే చెప్పాలి.ఎమ్మెల్సీ బోస్ నాయకత్వంలో పార్టీ నాయకులు ఇక అధికార పార్టీపై పోరాటానికి సిద్దమవుతున్నారనే చెప్పాలని పలువురు అంటున్నారు. -
‘ఈ పాస్’ పుస్తకాలకు రంగం సిద్ధం
రామచంద్రపురం : రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ ద్వారా ‘ఈ పాస్’ పుస్తకాలు (పట్టాదారు) అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ పుస్తకాల పంపిణీలో జాప్యం తగ్గింపునకు, నకిలీ పాస్‌పుస్తకాల నిరోధానికి ‘ఈ పాస్’ పుస్తకాలు దోహదపడనున్నాయి. తమ శాఖను, రిజిస్ట్రేషన్‌శాఖను అనుసంధానం చేస్తూ వెబ్‌ల్యాండ్ ద్వారా ఈ పాస్ పుస్తకాలను ఆన్లైన్లో అందించేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు చర్యలు చే పట్టారు. జిల్లాలో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ ల్యాండ్ రికార్డులను రిజిస్ట్రేషన్లశాఖతో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే అడంగళ్ రికార్డుల అనుసంధానం 80 శాతం వరకు పూర్తయినట్టు రె వెన్యూ అధికారులు చెబుతున్నారు. స్థలాలను సబ్ డివిజన్ చేసే ప్రక్రియ మినహా ఏకమొత్తంగా ఉన్న అన్ని రకాల రెవెన్యూ స్థలాలను ఇప్పటికే వెబ్‌ల్యాండ్‌లో ఉం చినట్టు ఆ శాఖాధికారులు అంటున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఇకపై ఈ పాస్ పుస్తకాలకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆస్తిని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ ఆస్తి వెంటనే రెవెన్యూ రికార్డుల్లో కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారి పేరన మారుతుంది. కొనుగోలు దారుడు మీ సేవలో చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన వీఆర్వోలు, ఇతర అధికారులు తహశీల్దార్ డిజిటల్ సంతకంతో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు తీసుకున్న చెన్నైలోని ఏజెన్సీ స్పీడ్ పోస్టు ద్వారా ఈ పాస్ పుస్తకాన్ని దరఖాస్తుదారు ఇంటికి పంపిస్తుంది. ఈ మొత్తం పక్రియకు 40 నుంచి 45 రోజులు పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపై ఇప్పటికే రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో తహశీల్దార్లకు ఆర్డీఓ సుబ్బారావు ఆన్లైన్ శిక్షణ నిచ్చారు. తగ్గనున్న అధికారుల ప్రమేయం ఈ పాస్ పుస్తకాల మూలంగా రెవెన్యూ అధికారుల ప్రమేయం, అవినీతి, నకిలీ పాస్ పుస్తకాల బెడద కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అయితే టైటిల్ డీడ్ ఆన్లైన్లో ఇచ్చేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో తప్పని ఇబ్బందులుమీ సేవ ద్వారా ఈ పాస్ పుస్తకాలందించేందుకు క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బందులున్నాయంటున్నారు. స్థలాలు సబ్ డివిజన్ కాకపోవటంతో పాటు రెవెన్యూ రికార్డులు పట్టాదారు పాస్ పుస్తకాల్లోని తప్పుడు సర్వే నంబర్లతో ఉండటం కూడా ఇందుకు కారణమంటున్నారు. జిల్లావ్యాప్తంగా ల్యాండ్ సర్వే పూర్తయి, రెవెన్యూ రికార్డులు ఆన్లైన్లో పూర్తి స్థాయిలో నమోదైతే గాని స్పష్టత రాదని అధికారులే చెబుతున్నారు. -
‘భరోసా’కు భంగం!
రామచంద్రపురం :పింఛన్ల పంపిణీ పథకం పేరును ‘ఎన్టీఆర్ భరోసా’గా మార్చిన టీడీపీ ప్రభుత్వం సంతోషం, సంతృప్తి, భద్రత, ఆరోగ్యం, భరోసా అయిదురెట్లు పెరిగాయంటూ ప్రచారం చేసుకుంటోంది. అయితే పింఛన్ల మొత్తం పెరుగుతుందని ఆశ పెట్టుకున్నవారిలో అనేకులకు అసలుకే ముప్పు వాటిల్లింది. పలు సాకులతో పలువురికి పింఛన్లు నిలిచిపోయాయి. ఏ లబ్ధిదారునికి ఏ రోజు ఏ ఆటంకం కలుగుతుందోనని బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ గత రెండు రోజులుగా నిలిచిపోయింది. ఎందుకు నిలిపివేశారో, తిరిగి ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియక పింఛన్‌దారులు అల్లాడుతున్నారు. జిల్లాలో పింఛన్ల పంపిణీ రెండు రకాలుగా జరుగుతోంది. గ్రామాల్లో పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తుండగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి మనిపాల్ గ్రూప్ సంస్థ పంపిణీకి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అర్బన్ ప్రాంతాల్లో ప్రతి నెలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులు 57,560 మందికి రూ.6.36 కోట్లు పంపిణీ చేస్తున్నారు. మనిపాల్ గ్రూప్ జిల్లావ్యాప్తంగా సుమారు 85 మంది సిబ్బందితో బయో మెట్రిక్ మెషీన్ల ద్వారా ఈ పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా సొమ్ములు సరఫరా చేసేలా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ప్రభుత్వం ఈ బ్యాంకుకు సొమ్ములను విడుదల చేస్తుంది. ఈనెల రెండు నుంచి మున్సిపాలిటీలలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన మనిపాల్ సిబ్బంది 6 వరకు జిల్లావ్యాప్తంగా సుమారు 16 వేల మంది లబ్ధిదారులకు రూ.1.80 కోట్ల వరకు పింఛన్లను పంపిణీ చేసినట్టు సమాచారం. అయితే అర్ధాంతరంగా ప్రభుత్వం నుంచి పింఛన్ల పంపిణీని నిలుపుదల చేయాలని మనిపాల్ సంస్ధకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇంకా సుమారు 40 వేల మందికి రూ.5 కోట్లకు పైగా పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే విడుదల చేసిన సొమ్ముల వరకూ పంపిణీ చేసి, ఆపై నిలిపివేయాలని ఈనెల 6న ఆదేశించినట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీకి సంబంధించిన సర్వర్లను ముందస్తు సమాచారం లేకుండానే నిలిపివేశారు. మనిపాల్ సిబ్బంది వద్ద గల బయోమెట్రిక్ మెషీన్లను కూడా ఆ సంస్థ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు నిలిపివేశారో..? మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పింఛన్ల కోసం వచ్చిన లబ్ధిదారులకు అవి రావటం లేదని తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఎందుకు నిలిపివేశారో, ఎప్పుడు ఇస్తారో తెలియక గుబులు పడుతున్నారు. ఇలా అర్ధాంతరంగా సొమ్ముల పంపిణీ నిలిపివేయటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా పంపిణీ జరుగుతుండగా ఇప్పుడు అర్ధాంతరంగా నిలిపివేసిన నేపథ్యంలో.. తర్వాతైనా ఇస్తారా లేక నిలిపివేస్తారా అనే అనుమానాలు పీడిస్తున్నాయి. పింఛన్లు ఆగిపోయిన సం గతి మున్సిపాలిటీ అధికారులకు కూడా తెలియని స్థితి ఏర్పడింది. కాగా జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పింఛన్ల పంపిణీ విధులను నిర్వర్తిస్తున్న 80 మంది మనిపాల్ సిబ్బందికి కూడా ఈ పరిణామం జీర్ణం కావడం లేదు. ఈ పనిని నమ్ముకున్న తాము రోడ్డున పడతామని వాపోతున్నారు. ప్రభుత్వం ఇలా ఎందుకు చేసిందో తెలియని అయోమయం వారినీ వెన్నాడుతోంది. -
పట్టాలిచ్చింది పొమ్మనడానికేనా?
రామచంద్రపురం :‘మీరు ఇల్లు కట్టుకోలేదు గనుక.. గతంలో ఇచ్చిన ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం’ అంటూ రెవెన్యూ అధికారులు జారీ చేస్తున్న నోటీసులు రామచంద్రపురం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పేదలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇచ్చిన జాగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఇళ్ల నిర్మాణానికి కృషి చేయాల్సి ఉండగా.. జిల్లాలో ఎక్కడా లేనట్టు వెనక్కి లాక్కునే ప్రయత్నం చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. రామచంద్రపురం మండలంలోని ఆదివారపుపేటలో 13, నరసాపురపుపేటలో 10 ఎకరాలను 2007లో ప్రభుత్వం సేకరించింది. స్థలాల మెరక నిమిత్తం అప్పట్లో సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఆదివారపుపేట భూమికి రూ.3 కోట్లు, నరసాపురపుపేట భూమికి రూ.1.80 కోట్లు మంజూరు చేశారు. ఆదివారపుపేటలో సేకరించిన స్థలాన్ని మెరకపనులు పూర్తిచేసి 525 లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. నరసాపురపుపేటలో అసంపూర్తి మెరక పనులతోనే 170 మందికి పట్టాలందజేశారు. అనంతరం వచ్చిన ప్రభుత్వం ఆ స్థలాల్లో గృహనిర్మాణానికి పూనుకోకపోగా తాగునీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కల్పించలేదు. గృహనిర్మాణ శాఖ ద్వారా రుణాలు సైతం మంజూరు చేయలేదు. దీంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు వీలులేకపోయింది. ఇప్పుడు ‘మీరు ఇల్లు కోలేదు. మీ అందరి ఇంటి పట్టాలు రద్దు చేసి, స్థలాలు స్వాధీనం చేసుకుంటాం’ అంటూ తహశీల్దార్ నోటీసులు ఇవ్వడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. రుణాలు మంజూరు చేయకుండా ఇళ్లు ఎలా నిర్మించుకోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై ఏళ్లు పోరాడి సాధించుకున్న స్థలాలను లాక్కొనే ప్రయత్నమేమిటని ప్రశ్నిస్తున్నారు. నోటీసులపై ఇదేమిటని ప్రశ్నిస్తే ఆ స్థలాల్లో ప్రభుత్వం వివిధ కళాశాలలను నిర్మిస్తుందని తహశీల్దార్ చెబుతున్నారని లబ్ధిదారులు అంటున్నారు. నిరుపేదలకు అందించిన స్థలాల్లో కళాశాలలు నిర్మించటమేమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకే ఇలా జరుగుతోందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టాల రద్దును నిలిపివేసి, రుణాలు మంజూరు చేస్తే ఇంటి నిర్మాణం చేపడతామంటున్నారు. దీనిపై కలెక్టర్‌ను ఆశ్రయిస్తామంటున్నారు. పాత పట్టాలు రద్దు చేసి.. తమ వారికి కట్టబెట్టాలని.. కాగా రామచంద్రపురం అర్బన్ పరిధిలోని కొత్తూరులో గతంలో 42 ఎకరాలు సేకరించి, జీ ప్లస్ తరహాలో గృహ సముదాయం నిర్మించి ఇచ్చేందుకు పట్టణంలో పేద, మధ్య తరగతులకు చెందిన 2800 మందిని ఎంపిక చేసి పట్టాలు ఇచ్చారు. స్థలం మెరక పనులకు సుమారు రూ.3 కోట్లు కేటాయించారు. కాగా ప్రభుత్వాలు మారాక ఈ స్థలాన్ని పట్టించుకునే వారే లేరు. ఇప్పుడు.. గతంలో ఇచ్చిన పట్టాల్ని రద్దు చేసి, కొత్తగా అధికార పార్టీ కార్యకర్తలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ వినిపిస్తోంది. ఈమేరకు అధికార పార్టీకి చెందిన కొందరు తమ పార్టీ కార్యకర్తల నుంచి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులతో పాటు కొంత సొమ్మును కూడా వసూలు చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఇదే స్థలంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధి ప్రయత్నించి నిబంధనలు అడ్డు రావటంతో వెనుకంజ వేశారు. ఇప్పుడు పాత పట్టాలను రద్దు చేయడానికి అధికార పార్టీ నేతలు రెవెన్యూ అధికారులను వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇళ్లు కట్టుకోనందునే నోటీసులిచ్చాం.. ఆదివారపుపేట, నరసాపురపుపేటల్లో గతంలో పట్టాలు పొందిన వారికి నోటీసులు ఇవ్వడంపై రామచంద్రపురం తహశీల్దార్ టీఎల్ రాజేశ్వరరావును వివరణ కోరగా లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోనందునే పట్టాల రద్దుకు నోటీసులిచ్చామన్నారు. గృహనిర్మాణ శాఖ రుణాలు మంజూరు ఎందుకు చేయలేదనే విషయాన్ని ఆ శాఖ అధికారులతో చర్చించి అనంతరం పట్టాల రద్దుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. -
మాసూళ్లయినా..మోపెడు కష్టాలే
పంటను అమ్ముదామంటే.. మద్దతు, గిట్టుబాటు ధరల మాటటుంచి కొనే దిక్కే లేదు. సర్కారీ కొనుగోలు కేంద్రాలున్నా ఉపయోగం శూన్యం. ఖరీఫ్ మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ అన్నదాతల అవస్థలను ‘వీఐపీ రిపోర్టర్’ ద్వారా వెలుగులోకి తేవాలన్న ‘సాక్షి’ ఆలోచనను రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు ఆమోదించారు. శనివారం కె.గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన చేసిన ‘వీఐపీ రిపోర్టింగ్’ విశేషాలివి.. రైతుల మేలు, మేలుకొలుపులకు కృషి చేస్తా...రైతులతో ముఖాముఖి మాట్లాడటం వల్ల క్షేత్రస్థాయిలో మద్దతు ధర, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో సాధకబాధకాల వంటి సమస్యలు తెలుసుకున్నాను. వారికి వ్యవసాయశాఖాధికారులు సరైన అవగాహన కల్పించడం లేదని తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, చేస్తున్న సూచనలు ైరె తుల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. పొలంబడిలో రైతులను చైతన్యం చేయాల్సి ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, ప్రతి పథకాన్నీ రైతులుసద్వినియోగం చేసుకునేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులువినియోగించుకుని మంచి ధర పొందేలా అన్ని స్థాయిల్లో అధికారులకు స్వయంగా తెలియచేస్తాను రిపోర్టర్ కె. సుబ్బారావు,ఆర్టీఓ,రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు : బాబూ నీ పేరేంటయ్యా...? రైతు : పర్వతిని సత్యన్నారాయణండీ.... ఆర్డీఓ : ఏంటీ వ్యవసాయం ఎలా ఉంది? ఎన్ని ఎకరాలు చేస్తున్నావు? తొలకరికి ఎంత పండించావు? రైతు : ఏటా బాడి పిసుక్కుని పంట పండిస్తున్నా తగిన డబ్బులు రావటంలేదు. ఈసారి 11 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఆర్డీఓ : 75 కేజీల బస్తా రేటు ఎంత ఉంది? రైతు : నెమ్ము 18 శాతం దాకా వస్తంటే మిల్లోళ్లు 15 శాతం ఉంటే గానీ కొనమంటున్నారు. ఇప్పటి దాకా ఊళ్లో గింజ కూడా కొనలేదండీ. ఆర్డీఓ : కూలీ డబ్బులు ఎలా ఇస్తున్నారు? రైతు: కుప్ప నూరుత్తున్నానాండీ.. సందేలకి కూలీలకి రూ.15 వేలు దాకా ఇయ్యాల. అక్కడో పదేలు, ఇక్కడో పదేలు తెత్తాను. ఆనక దాన్యం అమ్మాక సావుకారికి తీర్చాలంతే... ఆర్డీఓ : నీపేరేంటయ్యా? రైతు : తాడాల ఏడుకొండలండి. మూడెకరాలు ఏసి, పుత్తు పూస తాకట్టెట్టి పెట్టుబడి ఎట్టానండి. ఆ డబ్బులొత్తాయో లేదో తెలత్తాలేదండీ...? ఆర్డీఓ : తాతా నీ పేరేంటి? కూలి రేట్లు ఎలా ఉన్నాయి? రైతు : కొరమాటి సుబ్బారావండీ. వుప్పుడు సీజన్ కదాండీ మగాళ్లకు రూ.600 నుంచి రూ.700వరకు ఉంది బాబూ. ఆర్డీఓ : నీ పేరేంటి బాబూ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల గురించి తెలుసా? రైతు : దంగేటి సుర్యనారాయణండీ. మాకు పెబుత్వం పెట్టిన వాటి కాడికి దాన్యాన్ని పట్టికెళ్లటం చేనా కట్టం బాబూ. ఆర్డీఓ : నీ పేరేంటయ్యా? ప్రభుత్వ సహకారం అందుతోందా? రైతు : అల్లూరి వీరవెంకట సత్యన్నారాయణండీ. ఏం పెబుత్వమండీ బాబూ.. సీజన్ అయిపోయినాక అప్పులు ఇత్తే ఏటి లాభం? ఆర్డీఓ : నీ పేరేంటి పెద్దయ్యా? నీవెంత చేను పండిస్తున్నావు? కీ ఇబ్బందులేంటి? రైతు : బోడపాటి అర్జునరావయ్యా. గింజలకు సరైన ధర అందటంలేదు. ఆర్డీఓ : కొనుగోలు కేంద్రాలున్నాయిగా? రైతు : ఆళ్లేమో 15 నెమ్ముండాలంటారు బాబూ. ఇయ్యేమో 18 నెమ్ముంటున్నాయి. ఆర్డీఓ : నీ పేరేంటయ్యా? వెదజల్లే విధానం పాటిస్తున్నారా? రైతు : పర్వతిని సత్యన్నారాయణ సార్! 20 ఏళ్ల క్రితమే ఎదజల్లేనండీ. ఎద సాగు బానే ఉంటంది. ఈ ప్రాంతంలో రైతులు ఈ పద్దతే ఎక్కువగా రెండో పంటలో వేత్తున్నారు. ఆర్డీఓ : శ్రీవరి సాగు మీకు తెలుసా? వ్యవసాయాధికారులు ఏమైనా సూచనలిస్తున్నారా? రైతు : శ్రీవరి సాగు బానే ఉంటుంది గాని సారూ.. పెట్టుబడి ఎక్కువ. వ్యవసాయాధికారులు మా దగ్గరకు రారు సారూ! ఆర్డీఓ : నీ పేరేంటి? మీకు రుణాలు ఏమైనా ఇస్తున్నారా? పెట్టుబడులు ఎలా పెడుతున్నారు? రైతు : సత్యసాయి వెంకటరమణండీ. డిగ్రీ చదివి వ్యవసాయం చేస్తున్నా..అంత లాభసాటిగా లేదండి. ఆర్డీఓ : చదువుకున్నావు కదా.. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తున్నావా? రైతు : వ్యవసాయాధికారులు ఎప్పుడు మీటింగులు పెడుతున్నారో తెలియటం లేదు. ఆర్డీఓ : సేంద్రియ పద్ధతుల్ని ఎందుకు ఎంచుకోవటంలేదు? పొలంబడికి వెళుతున్నారా? రైతు: ఈ ప్రాంత రైతులకు దీనిపై ఇంకా అవగాహన లేదు. పొలంబడి ఎక్కడో ఒక చోట పెట్టి, అధికారులు వచ్చి వెళుతున్నారు తప్ప ఉపయోగంలేదు. ఆర్డీఓ : మీపేరేంటండీ? మీరెంత వ్యవసాయం చేస్తున్నారు? మీ ఇబ్బందులేంటి? రైతు : జానకిరామయ్యండీ. మూడెకరాలు చేస్తున్నాను. 80 బస్తాల వరకు పండినా కూలీలకే రూ.54 వేలు ఖర్చయ్యింది. ఆర్డీఓ : ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ఎందుకు వినియోగించుకోవటం లేదు? రైతు : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు మాకు ఖర్చవుతుంది. అదే మిల్లర్లయితే ఆ ఖర్చు వారే భరించి తీసుకెళతారండీ. ఆర్డీఓ : నీ పేరేమిటయ్యా? మద్దతు ధర లభిస్తోందా? రూ.1020, రూ.1060 వస్తున్నాయా? రైతు : నరసింహ మూర్తి అండీ. పెట్టుబడులు వస్తే చాలు.. గిట్టుబాటు ఎక్కడ వస్తుంది సారూ. అమ్ముదామంటే కొనేవాడే కనిపించడం లేదండీ. రూ.980, రూ.990 అంటున్నారు. అదీ 17 శాతం నెమ్ములున్నాయంటే ప్రతి ఒక్కశాతానికి కేజీ కటింగ్ పెడుతున్నారండీ. ఆర్డీఓ : నేనూ రైతు బిడ్డనే. మీ ఇబ్బందులన్నీ అర్థమయ్యాయి. అధికారులకు చెప్పి కొనుగోలు కేంద్రాలపై మీకు తెలియచేసే ఏర్పాటుచేస్తా. వ్యవసాయాధికారులు మీ దగ్గరకు వచ్చేలా ఆదేశాలు జారీచేస్తాను. సరే వెళ్లి రమ్మంటారా. రైతులు : మంచిది సారూ.. ప్రజెంటర్స్: - లక్కింశెట్టి శ్రీనివాసరావు, చెల్లుబోయిన శ్రీనివాస్ ఫోటోలు : గరగ ప్రసాద్ -
న్యాయం కోసం మహిళ మౌనపోరాటం
రామచంద్రపురం : అదనపు కట్నం కావాలని డిమాండ్ చేస్తూ తనను కాపురానికి తీసుకువెళ్లడం లేదని, తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఆదివారం స్థానిక కేఎస్ఆర్ నగర్లో అత్తవారి ఇంటి వద్ద మౌనపోరాటం చేపట్టింది. బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన దంగేటి నారాయణరావు కుమారుడు రవికుమార్‌తో 2012లో తునికి చెందిన శేషవల్లికి వివాహమైంది. పెళ్లి సమయంలో శేషవల్లి తల్లిదండ్రులు కట్నంగా రూ.1.5 లక్షలు ఇచ్చారు. అదనంగా రూ.20 లక్షలు కట్నంగా తీసుకురావాలంటూ శేషవల్లిని అత్తింటి వారు పుట్టింటికి పంపించేశారు. ఒకటిన్నరేళ్లుగా కాపురానికి తీసుకువెళ్లకుండా ఆమెను వేధిస్తున్నారు. దీంతో ఆమె అత్తవారింటి వద్ద మౌనపోరాటం చేపట్టింది. రామచంద్రపురం ఎస్సై ఫజల్ రహ్మాన్ అక్కడకు చేరుకుని శేషవల్లి, ఆమె భర్త రవికుమార్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎస్సై హామీ ఇవ్వడంతో శేషవల్లి తన ఆందోళన విరమించింది. -
రాక్షస పాలనను ప్రతిఘటించాలి
రామచంద్రపురం :రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని రాక్షస పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆరోపించారు. దీనిని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక గాంధీపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయిప్రసాద్ అద్యక్షతన శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో బోస్ మాట్లాడారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారం చేతికందగానే వాటిని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయకుండా, పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నామనడం సిగ్గుచేటని విమర్శించారు. పెన్షన్ల సెలక్షన్ కమిటీల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు కాకుండా టీడీపీ కార్యకర్తలను సభ్యులుగా వేశారన్నారు. వారి ఇష్టానుసారం పెన్షనర్లను ఎంపిక చేసి అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. దీనిపై కోర్టును ఆశ్రయించైనా సరే అర్హులందరికీ న్యాయం చేసేలా పోరాడతామని బోస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మోసపూరిత కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త పైనా ఉందన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ ఎగవేతకు ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలను బయటపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఐదో తేదీన ప్రతి మండలంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ వైద్య విభాగం జిల్లా కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆధార్ సీడింగ్‌లో లోపాలు
రామచంద్రపురం :సర్వేల పేరుతో పింఛన్లు తొలగించడంతో లబ్ధిదారులు లబోదిబోమంటుంటే సర్వర్‌లో లోపాలతో మరి కొంత మందికి పింఛన్లు అందక పోస్టాఫీసులు, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అసలు తమ పింఛన్లు ఉన్నాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా పోస్టాఫీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక పింఛన్లు అందిస్తున్నారు. వేలిముద్రలను ఆధార్‌తో అనుసంధానం చేసి బయోమెట్రిక్ మిషన్లు ద్వారా పింఛన్లు అందిస్తున్నారు. ఆధార్ అనుసంధానం కానివారికి లోకల్ సర్వర్ ద్వారా వేలిముద్రలు తీసుకుని పింఛన్ అందించే వారు. కానీ ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వే అనంతరం పింఛన్ల పెంపును అమలు చేశారు. దీంతో పాటు ఆధార్ సీడింగ్ సర్వర్‌ను మాత్రమే అందుబాటులో ఉంచారు. దీంతో లోకల్ సర్వర్ ద్వారా అనుసంధానం అయిన లబ్ధిదారులకు పింఛను నిలిచిపోయింది. ప్రభుత్వం పెంచిన పింఛన్ల జాబితాలో తమ పేర్లు ఉన్నా వారికి సొమ్ములు రావడం లేదు. పింఛను మంజూరు కావడంతో పోస్టాఫీసు వద్దకు వెళ్లేసరికి వేలిముద్రలు సరిపోవడం లేదంటూ సొమ్ము ఇవ్వడం లేదు. గతంలో పింఛనుదారుల వద్ద నుంచి తీసుకున్న వేలిముద్రలను కాకుండా ప్రస్తుత ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసందానం చేయడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల సర్వే అనంతరం ఆధార్ సీడింగ్‌ను హడావుడిగా చేయడం వల్ల కొంతమంది పింఛనుదారుల ఆధార్ నంబర్లను తప్పుగా ఎంట్రీ చేయటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం సర్వర్‌లోని పింఛనుదారుల వేలిముద్రలు, ప్రస్తుత వేలి ముద్రలు తేడాల వల్ల పింఛనురావడం లేదని మండల కోఆర్డినేటర్లు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 72 వేల పింఛన్లు నిలిచిపోయాయి. ఇప్పటికే జిల్లాలో వివిధ కారణాలతో 90,981 మందికి పింఛన్లు నిలిపివేశారు.ప్రస్తుతం లోకల్ సర్వర్ అనుసంధానం చేయకపోవటంతో మరికొంత మందికి పింఛన్లు ఆగిపోవటం పింఛన్‌దారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. లోకర్ సర్వర్ ఓపెన్ కాక ఆధార్ లోపాలు, వేలిముద్రలు ఉన్నవారికి పింఛన్ రాకపోవడంతో అసలు తమకు పింఛన్ వస్తుందో రాదోనని వారు ఆందోళన పడుతున్నారు. గ్రామాల్లోను, మున్సిపాలిటీల్లోనూ జరగుతున్న గ్రామసభలకు వచ్చి తమ పింఛను మెషీన్లు నుంచి రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ప్రతి నెలా ఆధార్ సర్వర్‌తో పాటుగా లోకల్ సర్వర్‌ను కూడా అధికారులు ఓపెన్ చేసేవారు, కానీ ఈ నెలలో ప్రస్తుతం 20వ తేదీ దాటి పోతున్నా గ్రామ సభలు నిర్వహించలేదు. దీంతో పింఛన్లు అందక కొంత మందికి, సర్వర్‌లో లోపాలతో మరి కొంత మందికి ఈనెల పింఛన్ల తీసుకోవటం ఒక ప్రహసనంలా మారిందంటున్నారు. లోకల్ సర్వర్‌ను ఓపెన్ చేసి వీరికి పింఛన్లు అందేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
డ్రెయిన్‌లో వివాహిత మృతదేహం
కాజులూరు :భర్తతో కలసి బయటకు వెళ్లిన ఓ భార్య డ్రెయిన్‌లో శవమై తేలింది. ఆమె మృతికి భర్తే కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లరేవు మండలం పత్తిగొందికి చెందిన గుత్తుల సుశీలకుమారి (30)కు రామచంద్రపురంలోని గుబ్బలవారిపేటకు చెందిన రమణతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. రమణ తరచూ మద్యం సేవించి వేధింపులకు గురిచేస్తుండటంతో తొమ్మిది నెలలు క్రితం సుశీల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా సుశీల ఆదివారం కె.గంగవరం మండలం పామర్రులోని తన సోదరి ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న రమణ పామర్రు వెళ్లి సుశీలను మన ఇంటికి వెళదామని తీసుకుని బయలుదేరాడు. ఆ రోజు నుంచి సుశీల కనిపించడం లేదు. రమణ ఆచూకీ కూడా లేదు. కుమార్తె కనిపించకపోవడంపై ఆమె తండ్రి బొక్కా జోగిరాజు తాళ్లరేవు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం సాయంత్రం కాజులూరు మండలం నామవానిపాలెం-ఉప్పుమిల్లి మధ్యలో టేకి డ్రెయిన్‌లో మహిళ మృతదేహాన్ని స్థానికులు కనుగొని గొల్లపాలం పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసే వీలులేకపోయింది. గురువారం మృతదేహాన్ని బయటకు తీసి గుర్తు తెలియని మహిళగా పేర్కొని చుట్టుపక్కల గల తాళ్లరేవు, పామర్రు, రామచంద్రపురం పోలీస్ స్టేషన్లకు సమాచారమందించారు. అప్పటికే సుశీల అదృశ్యంపై తాళ్లరేవు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఉండటంతో ఆమె తండ్రిని వెంట పెట్టుకుని తాళ్లరేవు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండగా దుస్తుల ఆధారంగా మృతురాలు సుశీలగా ఆమె తండ్రి జోగిరాజు గుర్తించారు. కాగా ఆమె భర్త రమణ పరారీలో ఉన్నట్టు గొల్లపాలెం ఎస్ఐ సీహెచ్ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ సుధాకర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హౌసింగ్ ప్రత్యేకాధికారి విచారణ
రామచంద్రపురం :బిల్లుల చెల్లింపులో కక్ష సాధింపులకు గురిచేస్తున్నారనే దళితుల ఫిర్యాదుపై స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ మూడు జిల్లాల ప్రత్యేకాధికారి కుమార స్వామి స్థానిక హౌసింగ్ ఈఈ కార్యాలయంలో మంగళవారం విచారణ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంగా తమకు హౌసింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామచంద్రపురం మండలం కందులపాలేనికి చెందిన పలివెల దుర్గాప్రసాద్, కోలమూరి నాగరాజు, కోలమూరి ముసలయ్య ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దాంతో కమిషన్ ఆదేశాల మేర కు బాధితులతో విచారణ నిర్వహించి, రికార్డులను పరిశీలించేందుకు తాను వచ్చినట్టు కుమారస్వామి తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లాలోని గ్రీవెన్స్‌సెల్‌లో హౌసింగ్ ఏఈ, డీఈ, ఈఈలకు తెలిపినప్పటికీ పట్టించుకోలేదని కందులపాలేనికి చెందిన పది దళిత కుటుంబాలవారు పేర్కొన్నారు. దాంతో తాము లోకాయుక్తను ఆశ్రయించామన్నారు. అప్పుడు బేస్మెంట్ బిల్లులు చెల్లించిన అధికారులు ఆ తర్వాత తమకు బిల్లులు రాకుండా చేశారన్నారు. మొదటి బిల్లులు చెల్లించి ఏడాది కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి బిల్లులు చెల్లించలేదని బాధితులు దుర్గాప్రసాద్, నాగరాజు, ముసలయ్య వాపోయారు. తాము ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించడంతో హౌసింగ్ అధికారులు ఇప్పటికీ తమను బెదిరిస్తున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని విచారణాధికారికి విన్నవించుకున్నట్టు వారు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లి శేషగిరి, పెంకే వీరబాబు బాధితులతో కలసి విచారణలో పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
రామచంద్రాపురం: రంజాన్ పండుగను పురస్కరించుకుని నూతన వస్త్రా లు కొనుగోలు చేసేందుకు వెళుతున్న అన్నదమ్ములను మృత్యువు లారీ రూ పంలో కబలించింది. ఈ సంఘటన పట్టణంలోని సంగీత థియేటర్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవీం దర్‌రెడ్డి కథనం మేరకు.. పట్టణంలోని మార్కెట్లో నివాసముండే ఇస్మాయిల్ మటన్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇస్మాయిల్‌కు ముగ్గురు కుమారులు. రంజాన్‌ను పండుగను పురస్కరించుకుని బట్టలు తెచ్చుకునేందుకు పెద్ద కుమారుడు ఇమ్రాన్ (28), రెండో కుమారుడు సద్దాం (24) బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం రామచంద్రాపురం పట్టణంలోని సంగీత థియేటర్ సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న లారీ వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇమ్రాన్ అక్కడిక్కడే దుర్మరణం చెందగా, సద్దాం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రంజాన్ దగ్గర పడడంతో ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు అక్కడివారిని కలిచివేసింది. మృతుడి కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇంటి దొంగల టాలెంట్
సాక్షి ప్రతినిధి, రామచంద్రపురం :రామచంద్రపురం మున్సిపాలిటీ జనాభా 43 వేల పైమాటే. పట్టణంలో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య 17వేలు. మున్సిపాలిటీ అంచనా ప్రకారం ఆస్తిపన్ను వసూలు చేయాల్సిన భవనాలు 10వేల 500 వరకు ఉన్నాయి. మున్సిపాలిటీ గుర్తించి డిమాండ్ నోటీసులు జారీచేసిన భవనాల యజమానుల నుంచి ఆస్తిపన్నులు వసూలుకు ఉపక్రమించిన సిబ్బంది చేతివాటం చూపించి రూ. లక్షలు దిగమింగేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2013-2014 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిమాండ్ నోటీసుల ప్రకారం అర్థ సంవత్సరానికి సుమారు కోటి రూపాయలు వసూలు కావాల్సి ఉంది. మూడు పద్ధతుల్లో జరుపుతున్న వసూళ్ల ప్రక్రియలో కొందరు బిల్లుకలెక్టర్లు ప్రజల నుంచి సొమ్ములు వసూలుచేసి మున్సిపాలిటీ రశీదులు ఇచ్చి సొమ్ము మాత్రం మున్సిపల్ ఖాతాలో జమచేయలేదని తెలియవచ్చింది. మున్సిపల్ బిల్లు కలెక్టర్లు పట్టణంలో ఇంటింటికీ నేరుగా వెళ్లి డిమాండ్ నోటీసుల మేరకు పన్నులు జమ చేసుకుని రసీదులు ఇస్తుంటారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో కూడా ఆస్తిపన్నులను కట్టించుకుని రసీదులు ఇచ్చారు. ఈ రెండు పద్ధతుల్లో వసూలు సందర్భంగానే సొమ్ము పక్కదారి పట్టించారని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారాన్ని బట్టి తెలియవచ్చింది. ఇక మూడో పద్ధతి మీ సేవా కేంద్రాలు. వీటి ద్వారా పన్నులు వసూలు చేసి మున్సిపల్ ఖాతాకు ఆన్లైన్ ద్వారా జమ చేస్తుంటారు. వీటిలో పైన పేర్కొన్న రెండు పద్ధతుల్లో జరిగిన వసూళ్లలోనే అవకతవకలు చోటుచేసుకున్నాయని నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది. ఆస్తిపన్నులు వసూలుచేసే ఏడుగురు బిల్లు కలెక్టర్లలో ముగ్గురు ఈ అవినీతి బాగోతంలో కీలకపాత్ర పోషించారని మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్ నోటీసుల మేరకు ఇంటింటికీ వెళ్లి వసూలు చేసిన సొమ్ము, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ప్రజలు జమ చేసిన ఆస్తిపన్నులకు సంబంధించిన సొమ్ముల్లోనే అవినీతి చోటుచేసుకుందనే విషయం మున్సిపల్ అధికారులకు ఆలస్యంగా తెలిసింది. బిల్లుల వసూలు పుస్తకంలో కౌంటర్ ఫాయిల్, రశీదుల వారీగా లెక్కలేయగా సుమారు రూ.48 లక్షలకు లెక్కా పత్రం లేకుండా పోయిందని సమాచారం. నేరుగా ఇళ్లకు వెళ్లి బిల్లు కలెక్టర్లు వసూలు చేసిన ఆస్థిపన్నులకు రశీదులు ఇచ్చినా ఆన్లైన్లో జమ చేయకుండా నొక్కేశారు. కార్యాలయ కౌంటర్లో జమ చేసుకున్న బిల్లుల సొమ్ము సైతం ఆన్లైన్ చేయకుండా గోల్మాల్ చేశారంటున్నారు. పురపాలక సంఘం పరిధిలో అసెస్మెంట్లను ఇటీవల పరిశీలించిన బిల్లు వసూళ్ల విభాగ అధికారులకు ఈ విషయం అవగతమైంది. పాత అసెస్మెంట్లతో పాటు కొత్తవాటిలో సొమ్ము పక్కదారి పట్టినట్టు ఒక అధికారి మున్సిపల్ ఉన్నతాధికారులకు తెలియచేయగా, గుట్టుచప్పుడు కాకుండా అంతర్గతంగా ఇద్దరు దిగువ స్థాయి అధికారులతో ఆరా తీయించారని తెలియవచ్చింది. అనంతరం ఈ వ్యవహారంపై నివేదిక అందచేయాలని ఇద్దరు అధికారులకు కమిషనర్ జీవరత్నం రెండురోజుల క్రితం బాధ్యత అప్పగించారని చెబుతున్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న బాగోతం బయటకు పొక్కడంతో పట్టణంలో ఎవరిమట్టుకు వారు చెల్లించిన సొమ్ము ఆన్లైన్లో జమ అయిందో లేదో తెలుసుకునేందుకు కార్యాలయంలోని కౌంటర్ వద్ద క్యూ కడుతున్నారు. వారికి బిల్లు కలెక్టర్లు ఇచ్చిన రసీదులను పట్టుకుని కార్యాలయానికి వచ్చి తమ సొమ్ము జమ అయ్యిందా లేదా తేల్చి చెప్పాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలోని పన్నుల వసూలు కౌంటర్‌ను ఇటీవల మూసేయడం ఈ అవినీతి బాగోతం వాస్తవమనే విషయాన్ని స్పష్టం చేస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. కార్యాలయంలోని కౌంటర్ మూసివేయడంపై స్థానికులు నిలదీస్తుంటే అధికారులు నోళ్లు వెళ్లబెడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం.జీవరత్నంను ‘సాక్షి’ ఈ అంశంపై వివరణ కోరగా ఆస్తిపన్నుల వసూలులో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు రావడం వాస్తవమేనన్నారు. ఇదే విషయమై మున్సిపాలిటీలో ఆస్తిపన్నులకు సంబంధించిన రికార్డులు పరిశీలిస్తున్నామని చెప్పారు. అవన్నీ అవకతవకలు కాకపోవచ్చునని, రికార్డుల్లో పొరపాట్లు దొర్లి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
చిన్నకోడూరు/రామచంద్రాపురం : జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. రోడ్డును దాటుతున్న వృద్ధురాలిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ వద్ద రాజీవ్హ్రదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బైరోజు శాంతమ్మ (55)కు భర్త అనారోగ్యంతో మృతి చెందగా.. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యంతో మంచం పట్టాడు. ఇదిలా ఉండగా.. శాంతమ్మ గ్రామంలోని బస్‌స్టాప్ వద్ద రోడ్డుపై పండ్లు విక్రయిస్తూ వచ్చే ఆదాయంతో కుమారుడిని పోషిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం శాంతమ్మ గ్రామంలో రోడ్డు దాటుతుండగా సిద్దిపేట వైపునుంచి వస్తున్న కారు ఢీకొంది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న చిన్నకోడూరు ఎస్ఐ ఆనంద్‌గౌడ్ అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మంచంపై ఉన్న కుమారుడి పరిస్థితిపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. స్కూటర్, మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన రామచంద్రాపురం జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్‌రెడ్డి కథనం మేరకు.. పట్టణంలో శ్రీనివాస్ నగర్లో నివాసముండే అశోక్ (45) పటాన్చెరు మార్క్‌ఫెడ్ శాఖలో కూలీగా పనిచేస్తున్నాడు. కాగా.. గురువారం మధ్యాహ్నం పటాన్చెరు నుంచి రామచంద్రాపురం వైపు స్కూటర్‌పై బయలుదేరాడు. అయితే అశోక్ ప్రయాణిస్తున్న రోడ్డులోనే వెనుక ఓ బైక్‌పై వేగంగా వస్తున్నాడు. కాగా స్కూటర్‌ను అధిగమించే క్రమంలో బైక్.. అశోక్ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో ఇరువురూ డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఉస్మానియా ఆస్పత్రిలో అశోక్ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి హైదరాబాద్ కూకట్పల్లి లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న వ్యక్తి పూర్తి వివరాలు తెలియరాలేదు. మృతుడు అశోక్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రచార రథంపై దాడి..చేతగానితనానికి నిదర్శనం
మేళ్లచెర్వు, నూస్లైన్ : వైఎస్సార్సీపీ ప్రచార రథంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం వారి చేతగానితనానికి నిదర్శనమని ఆ పార్టీ హుజూర్నగర్ అసెంబ్లీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మఠంపల్లి మండలం రామచంద్రాపురం తండాలో మంగళవారం వైఎస్సార్సీపీ ప్రచార రథంపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై ఆయన మేళ్లచెర్వు మండలం తమ్మారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కమిషన్ అనుమతితో నడిచే వాహనంపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ దాడి చేయించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన అనుచరులకు ప్రజాస్వామ్యం, చట్టాలు, రాజ్యాంగం పట్ల వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందన్నారు. రౌడీషీటర్లు, బైండోవర్ కేసులున్న వారు ప్రచారరథంపై దాడి చేయడం అత్యంత హేయమన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, వైఎస్ అభిమానులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఈ పది రోజులు 24గంటలు కష్టపడి సైనికుల్లా పనిచేసి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
రామచంద్రపురంలో ‘ఫ్యాన్’కు కలిసొచ్చిన ‘సైకిల్’ కలహాలు
రామచంద్రపురం బరిలో టీడీపీలో ఒకరి కంటే ఎక్కువ మంది చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకోవడంతో కొన్ని వార్డుల్లో సొంత వారినే ఓడించే పరిస్థితి ఎదురైందని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. దీనికి తోడు తమ చైర్మన్ అభ్యర్థి అడ్డూరి పద్మనాభరాజుపై పార్టీ రహితంగా ఉన్న ఆదరణ తమకు కలిసొచ్చిందని వైఎస్సార్ సీపీ నేతలు లెక్కలేస్తున్నారు. 27 వార్డుల్లో తమ ఖాతాలో జమ కానున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సామర్లకోట, పెద్దాపురంలలో కూడా సానుకూల పవనాలు వీచాయని వైఎస్సార్ సీపీ అంచనా వేస్తోంది. కాగా పెద్దాపురంలో పట్టు సాధించామని టీడీపీ చెబుతోంది. 28 వార్డుల్లో 10 చోట్ల టీడీపీ, వైఎస్సార్ సీపీల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా వాటిలో నాలుగు, మిగిలిన 18లో 13 స్థానాలు తమవేనని వైఎస్సార్ సీపీ అంచనా వేస్తోంది. సామర్లకోటలో 30 వార్డులకు పోరు జరగ్గా, జగన్ రోడ్‌షో నిర్వహించిన వార్డుల్లో మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరడంతో 16 వార్డులు సానుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అమలాపురం తమదేనని టీడీపీ మొదట్లో ధీమా వ్యక్తం చేసినా పోలింగ్ అనంతరం పరిస్థితిలో మార్పు వచ్చిందంటున్నారు. ఇక్కడ 30 వార్డులకు 15 తమకు వస్తాయని టీడీపీ చెబుతుండగా, బరిలోకి దిగిన 26 వార్డుల్లో 16 చోట్ల తమకు ఆధిక్యం లభిస్తుందని వైఎస్సార్ సీపీ అంచనా వేస్తోంది. -
వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు
రామచంద్రపురం అభ్యర్థిగా జగన్నాథ వర్మ రామచంద్రపురం,న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త అడ్డూరి జగన్నాథవర్మ పోటీ చేయనున్నట్టు మాజీ మంత్రి, ఆపార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రకటించారు. పట్టణంలోని జగన్నాథ వర్మ స్వగృహం వద్ద ఆదివారం కార్యకర్తల సమావేశంలో బోస్ మాట్లాడుతూ అంకిత భావంతో ప్రజాసేవ చేసే కుటుంబం నుంచి వచ్చిన జగన్నాథవర్మ మచ్చలేని మనిషన్నారు. అవినీతికి పాల్పడితే నిలదీయండి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అందించేందుకు, పట్టణంలో అవినీతి రహిత పాలన అందించేందుకు తాను చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు అడ్డూరి జగన్నాథవర్మ తెలిపారు. తాను ఎప్పుడైనా అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే రోడ్డుపై చొక్కా పట్టుకుని నిలదీయండని ప్రజలకు సూచించారు. పట్టణంలో ఇంటి పన్నులను దారుణంగా పెంచేశారని, తాము దాన్ని పునః పరిశీలిస్తామన్నారు. పార్టీ జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ, కొవ్వూరి త్రినాథ్ రెడ్డి, తొగరు మూర్తి, జి. శ్రీధర్, సీహెచ్ ఏసయ్య పాల్గొన్నారు. తుని చైర్పర్సన్ అభ్యర్థిగా శోభారాణి తుని, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుని మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా కుసుమంచి శోభారాణిని పార్టీ తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత రాజశేఖరరెడ్డి హయాంలో 2005 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 30 వార్డుల్లో విజయం సాధించడంలో కుసుమంచి శోభారాణి పాత్ర కీలకమైనదని అన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో అమలుచేసిన సంక్షేమ పథకాల ఫలాలను శోభారాణి అందరికీ అందజేశారని రాజా అన్నారు. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీని ప్రజల్లోకి తీసుకువెళ్లి, పురపాలక ఎన్నికల్లో ప్రజల మద్దతును కోరుతున్నామన్నారు. ప్రజలకు నిస్వార్ధమైన సేవలు అందించే నాయకుడు వెంట జనం ఉంటారని రాజశేఖరరెడ్డి నిరూపించారన్నారు. అదే పరిస్థితి జగన్మోహన్రెడ్డికి ఉందని శోభారాణి అన్నారు. తనకు చైర్పర్సన్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన వైఎస్సార్ సీపీకి రుణపడి ఉంటానని శోభారాణి అన్నారు. తుని పట్టణాభివృద్దికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. అనంతరం 28వ వార్డులో దాడిశెట్టి రాజా, శోభారాణితో కలసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. -
దోపిడీ ముఠా అరెస్టు
రామచంద్రపురం, న్యూస్‌లైన్ :ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉన్న మహిళను బంధించి, దోపిడీకి పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసు లు అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 12 మంది నిందితులు పట్టుబడ్డారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో రామచంద్రపురం డీఎస్పీ బి.రవీంద్రనాథ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న స్థానిక కోర్టు వీధిలో ఉంటున్న కోటిపల్లి పద్మావతి ఇంట్లో దోపిడీ జరిగింది. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ఐదురుగు దొంగలు చొరబడ్డారు. ఆమెపై దౌర్జన్యం చేసి, బంధించారు. ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు, ఉంగరం, రూ.1600 నగదును దోచుకుని పరారయ్యారు. రా మచంద్రపురం సీఐ పి.కాశీవిశ్వనాథం ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. రాజమండ్రి శాటిలైట్ సిటీకి చెందిన కొత్తల రంగారావు, సుగంధపు శ్రీనివాసరావు, కడపకు చెందిన చందా హరి బాబు, రామచంద్రపురానికి చెందిన గంటా శ్రీనివాస్, సుం కర మురళీ కారులో వచ్చి ఈ దోపిడీకి పాల్పడినట్టు డీఎస్పీ దర్యాప్తులో తేలింది. వీరిని విచారణ చేయగా, ఆసక్తికర విషయాలు తెలిశాయి. హైదరాబాద్‌కు చెందిన పాము నర్సింగరాజు, దామర నరేష్, కోరిపల్లి రవీంద్రరెడ్డి, కావలికి చెందిన అట్లూరి అనిల్‌కుమార్, నెల్లూరుకు చెందిన వంటి గుంట శ్రీని వాసరావు, షేక్ మస్తాన్‌వలి, అల్లూరి గ్రామానికి చెందిన గం గాపట్నం కృష్ణ, గోవిందు కలిసి, దొంగల ముఠాగా ఏర్పడ్డా రు. రామచంద్రపురంలో దోపిడీకి పాల్పడి, అనంతరం వీరం తా రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీలోని నామవరం రంగారావు ఇంటి వద్ద ఉన్నారు. గోవిందు అల్లూరి గ్రా మానికి వెళ్లిపోయాడు. వీరిని అరెస్టు చేసి, చోరీ సొత్తును, కత్తు లు, ఇనుపరాడ్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. దు రలవాట్లకు బానిసలైన వీరు అప్పులపాలై, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ధనవంతుల ఇళ్లల్లో దోపిడీలు చేసేందుకు నిర్ణయిం చుకున్నారు. పద్మావతి ఇంట్లో దోచుకున్న పుస్తెలతాడును అమ్మేందుకు ప్రయత్నించిన రంగారావు, శ్రీనివాసరావు, హరి బాబు, గంటా శ్రీనివాస్, మురళిని బుధవారం అరెస్టు చేశా రు. వీరిచ్చిన సమాచారంతో మిగిలిన వారిని అరెస్టు చేశారు. వీరిని అరెస్టు చేసిన సీఐ పి.కాశీవిశ్వనాథ్, రామచంద్రపురం ఎస్సై ఫజల్ రహ్మాన్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
అంతా అడ్డగోలు
రామచంద్రపురం, న్యూస్‌లైన్ :ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధికి గత హామీలు గుర్తుకొస్తున్నట్టున్నాయి. ఏదో ఒకటి చేసి ప్రజలను మభ్యపెట్టే పనిలో పడ్డారు. దానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. గత ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు పట్టణంలోని ఒక సామాజిక వర్గానికి జి+1 పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికై, పదవీ కాలం పూర్తి కావస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయనకు ఆ హామీ గుర్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు, సంబంధిత సామాజికవర్గ నాయకులు కలిసి, పట్టణంలోని ముచ్చిమిల్లి వద్ద గల కవలవారిసావరంలో ఒక రైతు వద్ద 83 సెంట్ల భూమి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. కొంత అడ్వాన్స్ ఇచ్చారు. ఆ స్థలంలో 80 కుటుంబాలకు జి+1 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర హౌసింగ్ ఎండీకి ఎమ్మెల్యే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి స్థలం ఎంపిక చేయాలని, లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని తహశీల్దార్‌ను జిల్లా హౌసింగ్ అధికారులు ఆదేశించారు. ఈ తంతంగం జరుగుతుండగానే గత ఏడాది డిసెంబర్ 9న ఆ 83 సెంట్ల భూమిలో జి+1 ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హౌసింగ్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భవన నిర్మాణాలకు కావాల్సిన అనుమతులు, నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ప్రజాప్రతినిధి అనుచరులు అక్కడ భవన నిర్మాణాలను ప్రారంభించేశారు. విద్యుత్ అధికారులు ఒక అడుగు ముందుకేసి ఆ నిర్మాణాలకు మీటర్లు కూడా మంజూరు చేసేశారు. అనధి కారికంగా జరుగుతున్న ఈ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణ వాసులు కొందరు జిల్లా ఉన్నతాధికారులకు, విజి లెన్స అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. భూ బదలా యింపు జరగకుండానే పంట భూమిలో నిర్మాణాలు సాగుతు న్నాయని వారు పేర్కొన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే అనుచరుల్లో అయోమయం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు కదా అని వెంటనే ఆయన అనుచరులు సొంత ఖర్చులతో చకచకా పనులు ప్రారంభించేశారు. నిర్మాణం మొదలుపెడితే నిధులు మంజూరవుతాయనుకున్నారు. కానీ ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు, నిధులు రాకపోవటంతో డైలమాలో పడ్డారు. నిబంధనలిలా అతిక్రమించారు ఇప్పటికీ ఆ 83 సెంట్ల భూమి రైతు పేరిటే ఉంది. అతడి నుంచి ఇప్పటివరకూ ఆ భూమిని పూర్తిగా కొనుగోలు చేయలేదు. అది వరి పండించే భూమిగానే రెవెన్యూ రికార్డులో ఉంది. భూ బదలాయింపు అనుమమతులు తీసుకోలేదు. జి+1 నిర్మాణాలకు మున్సిపల్ అధికారుల అనుమతులు కూడా పొందలేదు. ఇలా ఏ అనుమతులూ లేకుండానే విద్యుత్ శాఖ మీటర్ కూడా మంజూరు చేసేసింది. ప్రభుత్వానికి నష్టం ఇలా... స్థలానికి రిజిస్ట్రేషన్ జరగలేదు. పంటభూమి బదలాయింపు కాలేదు. ప్లాన్ అప్రూవల్ కాలేదు. వీటన్నింటి రూపేణా మొత్తం రూ.18 లక్షల మేరకు ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది.