Hyderabad: Man left his girlfriend who came for him from Ongole - Sakshi
Sakshi News home page

ఫోన్‌ నెంబర్‌ కూడా తెలీదు.. ప్రియుడు కోసం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వస్తే.

Published Tue, Apr 11 2023 9:52 AM | Last Updated on Tue, Apr 11 2023 2:45 PM

Man Left Girl In Hyderabad Who Came For Him From Ongole - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలోని ఒంగోలు చెందిన ఓ బాలిక తను ప్రేమించిన వ్యక్తి కోసం హైదరాబాద్‌కు వచ్చింది. కాగా ప్రేమించిన ఆ యువకుడు ఆమెను సోమవారం రామచంద్రాపురం పట్టణంలోని లింగంపల్లిలో వదిలేసి వెళ్లాడు. దీంతో ఆ బాలిక రోడ్డుపై రోదిస్తూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెకు ధైర్యం చెప్పారు.

నిజామాబాద్‌ ప్రాంతానికి చెందిన యువకుడు ప్రస్తుతం పటాన్‌చెరులో సెంట్రింగ్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడని అతని కోసం ఇక్కడికి వచ్చానని వివరించింది. అతడి  ఫోన్‌ నంబరు కూడా తన వద్ద లేదని  సీఐ సంజయ్‌కు చెప్పగా, స్టేట్‌ హోంకు తరలించారు.  

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పోయిందని..
పటాన్‌చెరు టౌన్‌: ఉద్యోగం పోయిందని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్‌పూర్‌ పోలీసుల కథనం ప్రకారం..సాయి విల్లాస్‌లో నివాసం ఉండే హరీశ్‌(30) ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో  ఉద్యోగి. అయితే ఇటీవలే హరీశ్‌ ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఆదివారం భార్య నందిని బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న హరీశ్‌ చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య ఇంటికి రాగా ఉరివేసుకొన్న భర్త కనిపించాడు. స్థానికుల సాయంతో భర్తను మదీనగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని  పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు హరీశ్‌ సోదరుడు రమేశ్‌ ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement