దోపిడీ ముఠా అరెస్టు
Published Thu, Feb 27 2014 2:41 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
రామచంద్రపురం, న్యూస్‌లైన్ :ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉన్న మహిళను బంధించి, దోపిడీకి పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసు లు అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 12 మంది నిందితులు పట్టుబడ్డారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో రామచంద్రపురం డీఎస్పీ బి.రవీంద్రనాథ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న స్థానిక కోర్టు వీధిలో ఉంటున్న కోటిపల్లి పద్మావతి ఇంట్లో దోపిడీ జరిగింది. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ఐదురుగు దొంగలు చొరబడ్డారు. ఆమెపై దౌర్జన్యం చేసి, బంధించారు. ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు, ఉంగరం, రూ.1600 నగదును దోచుకుని పరారయ్యారు. రా మచంద్రపురం సీఐ పి.కాశీవిశ్వనాథం ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.
రాజమండ్రి శాటిలైట్ సిటీకి చెందిన కొత్తల రంగారావు, సుగంధపు శ్రీనివాసరావు, కడపకు చెందిన చందా హరి బాబు, రామచంద్రపురానికి చెందిన గంటా శ్రీనివాస్, సుం కర మురళీ కారులో వచ్చి ఈ దోపిడీకి పాల్పడినట్టు డీఎస్పీ దర్యాప్తులో తేలింది. వీరిని విచారణ చేయగా, ఆసక్తికర విషయాలు తెలిశాయి. హైదరాబాద్‌కు చెందిన పాము నర్సింగరాజు, దామర నరేష్, కోరిపల్లి రవీంద్రరెడ్డి, కావలికి చెందిన అట్లూరి అనిల్‌కుమార్, నెల్లూరుకు చెందిన వంటి గుంట శ్రీని వాసరావు, షేక్ మస్తాన్‌వలి, అల్లూరి గ్రామానికి చెందిన గం గాపట్నం కృష్ణ, గోవిందు కలిసి, దొంగల ముఠాగా ఏర్పడ్డా రు. రామచంద్రపురంలో దోపిడీకి పాల్పడి, అనంతరం వీరం తా రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీలోని నామవరం రంగారావు ఇంటి వద్ద ఉన్నారు.
గోవిందు అల్లూరి గ్రా మానికి వెళ్లిపోయాడు. వీరిని అరెస్టు చేసి, చోరీ సొత్తును, కత్తు లు, ఇనుపరాడ్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. దు రలవాట్లకు బానిసలైన వీరు అప్పులపాలై, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ధనవంతుల ఇళ్లల్లో దోపిడీలు చేసేందుకు నిర్ణయిం చుకున్నారు. పద్మావతి ఇంట్లో దోచుకున్న పుస్తెలతాడును అమ్మేందుకు ప్రయత్నించిన రంగారావు, శ్రీనివాసరావు, హరి బాబు, గంటా శ్రీనివాస్, మురళిని బుధవారం అరెస్టు చేశా రు. వీరిచ్చిన సమాచారంతో మిగిలిన వారిని అరెస్టు చేశారు. వీరిని అరెస్టు చేసిన సీఐ పి.కాశీవిశ్వనాథ్, రామచంద్రపురం ఎస్సై ఫజల్ రహ్మాన్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Advertisement
Advertisement