Rabindranath
-
హైకోర్టు సంచలన తీర్పు: ఎంపీ రవీంద్రనాథ్ పదవి గోవింద
అఫిడవిట్లో సమర్పించిన సమాచారమే ఆయుధంగా.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులు పెట్టిన సంతకాలే సాక్ష్యాలుగా.. విచ్చలవిడిగా చేసిన డబ్బు పంపకాల దృశ్యాలే ధ్రువీకరణలుగా.. ఓసామాన్యుడు ఏకంగా ఓ ఎంపీపైనే గెలిచాడు.. అయితే ఇదంతా ఎన్నికల్లో కాదు.. న్యాయపోరాటంలో.. నీతి.. న్యాయం.. అనే ధర్మ సూత్రాలను పక్కనబెట్టి అంగ, అర్ధబలంతో అడ్డదారిన అందలమెక్కిన ఓ ప్రజాప్రతినిధిని.. ఓ ఓమాన్యుడు.. అసామాన్య రీతిలో ఎదిరించి కోర్టు ద్వారా చివరికి అతడి పదవికే ఎసరు తెచ్చాడు.. చట్టం ఎవరి చుట్టమూ కాదని నిరూపించాడు.. స్ఫూర్తి కలిగించే ఓటరు ‘మిలానీ’ పోరాటాన్ని మీరూ చదవండి. సాక్షి, చైన్నె: నియోజక వర్గంలోని ఓ ఓటరు అలుపెరగని పోరాటం.. ఏకంగా ఓ ఎంపీ సీటుకి ఎసరు తెచ్చింది. దీంతో అన్నాడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ చివరికి తన పదవిని కొల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయ పోరాటంలో సదరు ఓటరు సమర్పించిన ఆధారాలన్నీ ఎంపీకి వ్యతిరేకంగా నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఎంపీగా రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదు అని కోర్టు ప్రకటించింది. అయితే తీర్పును రిజర్వ్ చేస్తూ.. అప్పీల్‌కు 30 రోజుల పాటు అవకాశం కల్పించింది. నేపథ్యం ఇదీ.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం వారసుడు రవీంద్రనాథ్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు క్రియా శీలక రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన దృష్టి అంతా సొంత జిల్లా తేని మీదే పెట్టారు. ఎన్నికల్లో ఎంపీగా తేని నుంచే పోటీ చేశారు. ఈ కాలంలో రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండటం, తన తండ్రి పన్నీరు సెల్వం డిప్యూటీ సీఎం, పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ కావడంతో రవీంద్రనాథ్‌కు అవకాశాలు కలిసి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం రవీంద్రనాథ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు మొదలు అనేక అక్రమాలు జరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండడంతో స్థానిక ఎన్నికల అధికారి చూసి చూడనట్లు వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. చివరికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్‌పై రవీంద్రనాథ్ గెలుపొందారు. సొంత జిల్లాలో కీలక నియోజకవర్గాన్ని పన్నీరు తన కుటుంబ ఖాతాలో వేసుకుంది. తనయుడిని కేంద్ర మంత్రిని చేయడానికి సైతం ప్రయత్నించి, చివరకు అన్నాడీఎంకే గ్రూప్ రాజకీయాల పుణ్యమా అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కోర్టు సంచలన తీర్పు.. 2019 లోక్ సభ ఎన్నికలలో తేనిలో జరిగిన వ్యవహారాలపై పిటిషనర్ సమర్పించిన ఆధారాలను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సుందర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఆధారాలకు రవీంద్రనాథ్ వద్ద వివరణ కోరగా.. సమాధానం కరువైంది. ఇదే రవీంద్రనాథ్ పదవీ గండానికి కారణమైంది. దీంతో గురువారం న్యాయమూర్తి సుందర్ తుది తీర్పు వెలువరించారు. నామినేషన్ దాఖలు, పరిశీలనలో అధికార దుర్వినియోగం జరిగినట్టు ఆధారాలతో సహా నిర్ధారణ అయినట్లు ప్రకటించారు. రవీంద్రనాథ్ గెలుపు చెల్లదంటూ తీర్పు వెలువరించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, అప్పీలుకు అవకాశం ఇవ్వాలని రవీంద్రనాథ్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేసుకోగా, న్యాయమూర్తి స్పందించారు. రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదు అని ఇచ్చిన తీర్పును 30 రోజులు పెండింగ్‌లో పెడుతున్నట్టు, అంతలోపు అప్పీల్‌కు వెళ్లవచ్చని గడువు కేటాయించారు. దీంతో అప్పీలు ప్రయత్నాలపై న్యాయవాదులు దృష్టి పెట్టారు. అయితే, అప్పీలుకు వెళ్లినా రవీంద్రనాథ్‌కు అనుకూలంగా స్టే వచ్చేది అనుమానమే అని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. తాము చేయాల్సిన పనిని సాధారణ ఓటరు మిలాని న్యాయ పోరాటంతో ఎంపీ రవీంద్రనాథ్‌కు పదవీ గండం సృష్టించడాన్ని అభినందిస్తున్నానని ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థి, ప్రస్తుత డీఎంకే నేత తమిళ్ సెల్వన్ పేర్కొనడం గమనార్హం వెనక్కి తగ్గని మిలానీ.. తేని నియోజకవర్గంలో రవీంథ్రనాథ్ గెలుపును వ్యతిరేకిస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరూ కోర్టు తలుపు తట్ట లేదు. అయితే, ఆ నియోజకవర్గం ఓటరు అయిన మిలానీ మాత్రం స్పందించారు. నామినేషన్ దాఖలు మొదలు, ఫలితాల లెక్కింపు వరకు జరిగిన అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగం, నగదు బట్వాడా తదితర అన్ని ఆధారాలనూ సేకరించారు. ఆయన గెలుపు అక్రమం అంటూ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ నియోజకవర్గ ఓటరుగా తనను పరిచయం చేసుకుంటూ పిటిషన్ వేశారు. నామినేషన్ దాఖలు, పరిశీలనలో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలకు ఆధారాలను కోర్టుముందు ఉంచారు. కరోనా కాలం పుణ్యమా రెండేళ్లు విచారణ ముందుకు సాగలేదు. అయితే గత ఏడాది కాలంగా ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతూ వచ్చింది. అదే సమయంలో అన్నాడీఎంకేలో చీలికతో పన్నీరు సెల్వం కొత్త శిబిరం తో రాజకీయ పయానాన్ని మొదలెట్టడంతో రవీంద్రనాథ్‌కు వ్యతిరేకంగా పళణి స్వామి శిబిరం లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన్ని తమ పార్టీ ఎంపీగా పరిగణించ వద్దు అంటూ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో గతంలో ఎప్పుడు సాగిన అక్రమాల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడం, రవీంద్రనాథ్ ఆస్తుల అటాచ్ వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులలో ఓటరు మిలానీ రూపంలో ఏకంగా రవీంద్రనాథ్ తన ఎంపీ పదవి కోల్పోయే పరిస్థితి నెలకొంది. -
వీడిన జీలుగుకల్లు విషాదం మిస్టరీ.. టీడీపీ నేత వంతల రాంబాబు అరెస్టు
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా లోదొడ్డిలో కొద్ది రోజుల క్రితం జీలుగుకల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు టీడీపీ నేత వంతల రాంబాబు అని పోలీసులు తేల్చారు. రంపచోడవరం టీడీపీ ఇన్చార్జ్ వంతల రాజేశ్వరికి వరుసకు సోదరుడైన వంతల రాంబాబు జీలుగు కల్లుకుండలో గడ్డి మందును కలపడం వల్లే ఐదుగురూ మృతి చెందారని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. నిందితుడు రాంబాబును కాపాడేందుకు వంతల రాజేశ్వరి శతవిధాలా ప్రయత్నించారు. పోలీసులు రాంబాబు సహా పలువురిని విచారిస్తోన్న క్రమంలో వంతల రాజేశ్వరి అమాయకులైన గిరిజనులను ఇరికిస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. నిజనిర్ధారణ కమిటీ పేరిట లోదొడ్డిలో హడావుడి చేసిన టీడీపీ నేతలు స్థానికుల ద్వారా అసలు విషయం తెలుసుకుని బిక్కముఖం వేశారు. ఈ మేరకు మంగళవారం కాకినాడలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కేసు వివరాలను వెల్లడించారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డికి చెందిన పొత్తూరు గంగరాజు భార్యతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత వంతల రాంబాబుకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై కనుమ పండుగ నాడు గంగరాజు సోదరుడు లోవరాజు, రాంబాబు మధ్య ఘర్షణ జరిగింది. తన వదినతో సంబంధం సరికాదంటూ రాంబాబును లోవరాజు హెచ్చరించడంతో ఇరువురి మధ్య వివాదం మొదలైంది. కల్లు కుండలో గడ్డి మందు కలిపి.. గంగరాజు భార్య తనతో దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని రాంబాబు అతడిపై కక్ష పెంచుకున్నాడు. గంగరాజుకు చెందిన జీలుగు చెట్టు కల్లు కుండలో ఈ నెల 1 రాత్రి గడ్డి మందు కలిపాడు. ఈ విషయం తెలియని గంగరాజు మరుసటి రోజు ఉదయం చెదల సుగ్రీవు, వేము లోవరాజు, బూసరి సన్యాసిరావు, కుడే ఏసుబాబుతో కలిసి కల్లు సేవించాడు. కొద్దిసేపటికే ఐదుగురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా సుగ్రీవు, లోవరాజు, గంగరాజు, సన్యాసిరావు, చికిత్స పొందుతూ ఏసుబాబు మృతి చెందారు. ఈ ఘటనపై జడ్డంగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం ఉదయం నిందితుడు వంతల రాంబాబును అరెస్టు చేసి గడ్డి మందు ఉన్న డబ్బాను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. కేసు మిస్టరీని ఛేదించిన రంపచోడవరం అదనపు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, కాకినాడ క్రైమ్ డీఎస్పీ ఎస్.రాంబాబులను అభినందించారు. -
అమరావతి స్కామ్ విచారణకు మూడు ప్రత్యేక బృందాలు
సాక్షి, అమరావతి: అమరావతి కేపిటల్ సొసైటీ స్కామ్‌ను నిగ్గు తేల్చేందుకు మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ స్కామ్‌లో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చి.. వారిని అరెస్టు చేసేందుకు ఇవి శనివారం రంగంలోకి దిగాయి. కృష్ణా జిల్లా నూజివీడు, తిరువూరు, విస్సన్నపేటల్లో ప్రజల నుంచి లక్షలాది రూపాయల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ‘అమరావతి కేపిటల్ కోఆపరేటివ్ సొసైటీ’పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన సొసైటీ చైర్మన్ కె.ప్రకాశరావు, సొసైటీ డైరెక్టర్లు, మేనేజర్ తదితర ప్రధాన ఉద్యోగులు, ఏజెంట్లపై సెక్షన్ 406, 420తోపాటు ఐపీసీ సెక్షన్ 5, ఏపీపీడీఎఫ్ఈ యాక్ట్–1999 సెక్షన్ల ప్రకారం నూజివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బ్యాంక్ చైర్మన్‌తోపాటు డైరెక్టర్లు, ఉద్యోగుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాస్ చెప్పారు. బ్యాంకు తరహా కార్యకలాపాలు నిర్వహించిన అమరావతి కేపిటల్ సొసైటీ ఎంతమంది నుంచి ఎన్ని లక్షల రూపాయల డిపాజిట్లు వసూలు చేసింది.. ఈ సొసైటీలో ఎంతమంది నిర్వాహకులున్నారు.. వంటి వివరాలను ప్రత్యేక పోలీస్ బృందాలు ఆరా తీస్తున్నాయని తెలిపారు. బ్యాంక్ కార్యకలాపాల రికార్డులు, కంప్యూటర్లు తదితరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించనున్నారు. తక్కువ సమయంలోనే భారీ వసూళ్లు కృష్ణా జిల్లాలోని నూజివీడు, తిరువూరు, విస్సన్నపేటలపై దృష్టి పెట్టిన సొసైటీ నిర్వాహకులు తక్కువ సమయంలోనే పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు సేకరించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ 3 ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు రూ.35 లక్షలకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే డిపాజిటర్లు ఉన్నారని, అయితే ఫిర్యాదు చేస్తే డబ్బులు రావేమో అనే భయంతో వారు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ముందుకు వచ్చి సమాచారం ఇస్తే ఈ మొత్తం రూ.50 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు శనివారం నూజివీడుకు వెళ్లి అమరావతి కేపిటల్ సొసైటీ స్కామ్ విషయమై స్థానిక పోలీసులతో సమీక్షించారు. పూర్తి వివరాలు సేకరించి డిపాజిటర్లకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
కదం తొక్కిన మునిసిపల్ కార్మికులు
వైఎస్సార్ సీపీ నాయకురాలు శ్రీలక్ష్మి, సీపీఎం కార్యదర్శి బలరామ్ సహా 35 మంది అరెస్ట్ ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) :డిమాండ్ల సాధన కోసం మునిసిపల్ కార్మికులు ఏలూరులో కదం తొక్కారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహిం చిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాలోని 7 మునిసిపాలిటీల నుంచి కార్మికులు ఏలూరు చేరుకుని ప్రదర్శన జరిపారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని బైఠాయించారు. కార్మికులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోగా, తోపులాట జరి గింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికుల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. సీఎం చంద్రబాబు సింగపూర్ ఊహ ల్లో విహరిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చింతమనేని ఒక మహిళా తహసిల్దార్‌పై దౌర్జన్యం చేస్తే రాష్ట్ర కేబినెట్ ఆయనను వెనుకేసుకొస్తూ మహిళా తహసిల్దార్దే తప్పని మాట్లాడటం మహిళలను కించపర్చడమేనని ధ్వజమెత్తారు. పట్టణాల్లో పరిశుభ్రతను కాపాడేందుకు పారిశుధ్య కార్మికులు తమ జీవితాలను పణంగా పెడుతున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ మునిసిపల్ కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ సింగపూర్ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం మన రాష్ట్రాన్ని దోచిపెడుతోందని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీల మద్దతు మునిసిపల్ కార్మికుల సమ్మెకు వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ(యు) మద్దతు తెలిపాయి. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు మంతెన సీతారామ్, పార్టీ జిల్లా కార్యదర్శి బి.బలరామ్, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, ఇఫ్టూ నాయకుడు బద్దా వెంకట్రావు, ఎంసీపీఐ(యు) నాయకుడు కాటం నాగభూషణం, ఎన్జీవో సంఘాల నాయకులు ఎన్.హరనాథ్, యోగానంద్, నవ్యాంధ్ర హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మామూడూరి మహంకాళి తదితరులు కార్మికులకు మద్దతు తెలుపుతూ ప్రసంగించారు. నాయకుల అరెస్ట్ కలెక్టరేట్ ముట్టడికి హాజరైన వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, నగర శాఖ కార్యదర్శి గుడిపాటి నరసింహరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, నగర కార్యదర్శి రెడ్డి శ్రీనివాసడాంగే, ప్రజా సంఘాల నాయకులు కాటం నాగభూషణం, చింతకాయల బాబూరావు, డీఎన్‌వీడీ ప్రసాద్, పీవీ ప్రతాప్‌లతో పాటు మొత్తం 35మందిని పోలీసులు అరెస్ట్ చేసి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కార్మికులు కలెక్టరేట్ నుంచి ప్రదర్శనగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. నాయకులను సొంత పూచీకత్తుపై విడుదల చేయడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ కార్యక్రమానికి మునిసిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బి.సోమయ్య, నాయకులు సోమరాజు, దుర్గారావు, వివేకావతి, బి.జగన్నాథరావు, వి.సాయిబాబా, మావూరి శ్రీనివాస్, పి.కిషోర్ నాయకత్వం వహించారు. -
1,000 కోట్ల సమీకరణకు గ్లోబల్ హాస్పిటల్స్ రెడీ
వైదొలగనున్న ఎవర్‌స్టోన్, ఆనంద్ రాఠీ జనవరిలో డీల్ పూర్తికావొచ్చు గ్లోబల్ హాస్పిటల్స్ సీఎండీ రవీంద్రనాథ్ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: హెల్త్‌కేర్ రంగంలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ హాస్పిటల్స్ రుణ భారాన్ని మరింత తగ్గించుకొని, ప్రస్తుతం ఇన్వెస్టర్లుగా కొనసాగుతున్న సంస్థలకు ఎగ్జిట్ దారి (తమ వాటాలను అమ్ముకొనేవీలు) చూపేందుకు వీలుగా నిధుల సమీకరణ చేపట్టింది. దీనికోసం రూ వెయ్యి కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెల్త్‌కేర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని గ్లోబల్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. శుక్రవారం సాక్షి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ... బేరింగ్ ఏసియా, ఏటీ క్యాపిటల్, టీపీజీ గ్రోత్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ లాంటి సంస్థలతో నిధుల సమీకరణ సంబంధించి చర్చలు పలు దఫాలుగా జరిపామని, వీటితో పాటు మరిన్ని సంస్థలతో కూడా చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. ‘నిధుల సేకరణకు మేం సమాయత్తమౌతున్నాం. పలు సంస్థలతో చర్చలను ప్రారంభించాం. ప్రాధమిక దశలను దాటి చర్చల్లో మరింత స్పష్టమైన పురోగతి సాధించాం. జనవరిలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది’ అని రవీంద్రనాథ్ తెలిపారు. సంస్థలో ప్రధాన ఇన్వెస్టర్లయిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఎవర్‌స్టోన్ క్యాపిటల్ (35 శాతం), పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ ఆనంద్ రాఠీలకు (10 శాతం) కలిపి మొత్తం 45 శాతం వాటా ఉంది. గత ఏడు సంవత్సరాలుగా ఇందులో పెట్టుబడులు పెట్టారు. హెల్త్‌కేర్ రంగంలో మూలధనంపై వ్యయం (కాస్ట్ ఆఫ్ క్యాపిటల్) సంవత్సరానికి 15 శాతంపైనే ఉండటంతో రుణ భారాన్ని మోయడం తలకుమించిన భారం అవుతోంది. రుణ పత్రాల ద్వారా కాకుండా ఈక్విటీ నిధులను సమీకరించాలని గ్లోబల్ హాస్పిటల్స్ గత కొంత కాలంగా యోచిస్తోంది. 2016లో ఐపీవో ద్వారా పెట్టుబడుల మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. గ్లోబల్ హాస్పిటల్స్‌కు 2,200 పడకల సామర్థ్యంతో ప్రస్తుతం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై,ముంబైలలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లున్నాయి. కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులతో పాటు మల్టీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను విజయవంతంగా అందించే సంస్థగా గ్లోబల్ హాస్పిటల్స్ అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. హెల్త్ టూరిజం పెంపొందించటంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. హాట్‌కేక్‌లా మారిన హెల్త్‌కేర్ రంగం.. హెల్త్‌కేర్ రంగం ప్రస్తుతం పెట్టుబడులకు హాట్‌కేక్‌లా మారింది. కొనుగోళ్లు, విలీనాలకు ఫార్మా తర్వాత హెల్త్‌కేర్ రంగం ముందుందని జియోజిత్ పీఎన్బీ పారిబస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ అలెక్స్ మ్యాథ్యూస్ తెలిపారు. పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించేందుకు హెల్త్‌కేర్ గ్లోబల్, ఎస్ఆర్ఎల్ డయాగ్నాస్టిక్స్ (ఫార్టిస్ గ్రూప్), ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, థైరో కేర్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయన్నారు. -
శాఖాపరమైన విచారణకు ఆదేశించాం
హోం మంత్రి జార్జ్ సాక్షి, బెంగళూరు : కాఫీ షాపులో యువతి ఫొటో తీసారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడీజీపీ రవీంద్రనాథ్‌పై శాఖ పరమైన విచారణకు ఆదేశించామని హోం మంత్రి కే.జే జార్జ్ గురువారం పరిషత్‌కు తెలియజేశారు. నాణయ్య అడిగిన ప్రశ్నతో పాటు వివిధ పార్టీలకు చెందిన సభ్యులు లేవనెత్తిన సందేహాలకు ఆయన సమాధాన మిస్తూ... ఘటనకు సంబంధించి రవీంద్రనాథ్‌కు మూడు మెమోలు జారీ చేశామని తెలిపారు. సమాధానాలు సంతృప్తికరంగాలేకపోవడం వల్ల శాఖ పరమైన విచారణకు ఆదేశించామన్నారు. ఘటన కంటే అటుపై రవీంద్రనాథ్ ప్రవర్తించిన తీరు సరిగా లేదని కే.జే జార్జ్ పరిషత్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై పలువురు సభ్యులు మాట్లాడుతూ కులం ముసుగులో తాము చేసిన తప్పుల నుంచి బయట పడటానికి వివిధ శాఖల ఉన్నతాధికారుల ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఒక్కలిగ, లింగాయత్ వర్గాలకు చెందిన వారు ఉన్నారన్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగలు కులం పేరుతో సంఘాలను ఏర్పాటు చేసుకోవడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. -
జన్‌లోక్‌పాల్‌తో లోకాయుక్త నిర్వీర్యం
లోకాయుక్త మాజీ అధికారి సంతోష్‌హెగ్డే తుమకూరు, న్యూస్‌లైన్ : జన్‌లోక్‌పాల్ బిల్లు అమలైతే లోకాయుక్త అధికారాలు కోల్పోయి.. నిర్వీర్యమవుతుందని లోకాయుక్త మాజీ అధికారి సంతోష్‌హెగ్డే అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలోని అక్షయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన డిగ్రీ పట్టాల ప్రధానోత్సవ కార్యక్రమంలో సంతోష్‌హెగ్డే పాల్గొన్నారు. అనంతరం హెగ్డే మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఉద్దేశంతో ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లు అమలు చేయడానికి ముందుకు వెళ్తోందో అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ ఆ బిల్లు అమలైతే లోకాయుక్త అధికారులు ఉండరని తెలిపారు. ఈ విషయంపై ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని మీడియా ప్రశ్నించగా.. ఎన్నికలు ఉన్న కారణంగా తాను మాట్లాడలేకపోయానని సంతోష్ సమాధానమిచ్చారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానన్నారు. 2006 నుంచి 2012 వరకు లోకాయుక్తకు 24 వేల కేసులు వచ్చాయని, అందులో 700 మంది అవినీతిపరులకు శిక్ష వేయించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ర్ట పోలీస్ శాఖలో వేధింపులు ఎక్కువయ్యాయని, ఏడీజీపీ రవీంద్రనాథ్ ఉదంతమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖ నిర్లక్ష్యం వల్లే ఇంత రాద్ధాంతం జరిగిందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం తమ కర్తవ్యంగా పోలీసులు భావించాలని సూచించారు. -
కాలినడకన విచారణకు..
సీఐడీ డీజీపీ ఎదుట హాజరైన ఏడీజీపీ రవీంద్రనాథ్ తనను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి కుదరదన్న సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ రవీంద్రకు మద్దతుగా దళిత సంఘాల ధర్నా బెంగళూరు, న్యూస్‌లైన్ : కర్ణాటకలో ఐపీఎస్ అధికారుల మధ్య చిచ్చురేపిన ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్ కేసు రోజుకోమలుపు తిరుగుతోంది. శనివారం ఆయన ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని ఇంటి నుంచి కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటు నేరుగా చాలుక్య సర్కిల్ సమీపంలోని సీఐడీ కార్యాలయం చేరుకున్నారు. సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తనను అరెస్టు చేసి స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అరెస్ట్ చెయ్యడం కుదరదని బిపిన్ గోపాలకృష్ణ స్పష్టం చేయడంతో రవీంద్ర బయటకు వచ్చారు. అక్కడి నుంచి సీఐడీ విభాగం ఏడీజీపీ గర్గ్ ఎదుట హాజరై తనను అరెస్ట్ చేయాలని కోరారు. ఆయన కూడా అరెస్ట్ కుదరదని చెప్పడంతో, కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్పీ రాజప్ప ఎదుట హాజరయ్యారు. ఆయన కూడా అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన ంతరం బయటకు వచ్చిన రవీంద్రను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ తనను కేఎస్ఆర్పీ నుంచి బదిలీ చేశారని, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం తనకు వాహనం కూడా లేదని, సంఘటన రోజు హైగ్రౌండ్ పోలీసులు తనను లాకప్‌లో వేశారు, అంటే అరెస్ట్ చేసినట్లేనని, తన స్టేట్మెంట్ తీసుకుని దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన స్టేట్మెంట్ రికార్డు చేస్తే కేసు పెట్టిన యువతులకు కూడా న్యాయం జరుగుతుందని రవీంద్ర గుర్తు చేశారు. తనను అరెస్ట్ చేయ్యకుంటే కోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. ఇప్పటికే బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్, డీసీపీ రవికాంత్‌గౌడ, హైగ్రౌండ్స్ ఎస్ఐ రవిలపై కబ్బన్‌పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రవీంద్ర అన్నారు. హోం మంత్రి జార్జ్‌పై తనకు పూర్తి నమ్మకుందని, ఈ కేసు దర్యాప్తునకు రెండు మూడు రోజులు చాలని ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్ వాపోయారు. దద్దరిల్లిన టౌన్‌హాల్ తక్కువ కులానికి చెందిన వాడని ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తూ పలు సంఘాలు శనివారం టౌన్‌హాల్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ప్రజా పరివర్తన వేదిక, దళిత సంఘర్షణ సమితి, సమతా సైనికదళ, కర్ణాటక జనాందోళన సంఘటన తదితర సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దళితుడు అనే భావనతో ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై కక్ష సాధిస్తున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్, డీసీపీ రవికాంత్‌గౌడ, ఎస్ఐ రవిలను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రవీంద్రనాథ్‌కు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. -
108 రాలేదు.. వైద్యం అందలేదు గుండెపోటుతో వ్యక్తి మృతి
సికింద్రాబాద్, న్యూస్‌లైన్ : ఆరోగ్య రాజధా ని... హైటెక్ నగరం... అందులోనూ వరల్డ్‌క్లాస్ స్టేషన్.. పేరుకే ఈ భుజకీర్తులన్నీ. అత్యవసర వైద్య సదుపాయమైనా లేని దుస్థితి. అంబులెన్స్‌కూ నోచుకోని దైన్య స్థితి. సకాలంలో వైద్య సదుపాయం అందక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిండు ప్రాణం బలైపోయింది. గుండెపోటుతో ఓ వ్యక్తి రైల్వేస్టేషన్లో గంటపాటు విలవిల్లాడి తుదిశ్వాస విడిచారు. వివరాలివీ... బెంగళూరుకు చెందిన రవీంద్రనాథ్ (50) కన్నడ సినీ పరిశ్రమలో సలహాదారు. సినిమా పనిపై ఆయన నగరానికి వచ్చి తిరుగు పయనమయ్యేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గరీబ్థ్ ్రఎక్కేం దుకు మూడవ ప్లాట్‌ఫామ్ నెంబర్‌కు చేరుకున్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. విషయాన్ని గ్రహించిన తోటి ప్రయాణికుడు అంబులెన్స్ కోసం 108కి పలుమార్లు ఫోన్ ద్వారా ప్రయత్నించినా అంబులెన్స్ జాడ లేదు. స్టేషన్లోనూ కనీస వైద్య సదుపాయాలు లేకపోవడంతో రవీం ద్రనాథ్ గంట పాటు గుండెనొప్పితో విలవి ల్లాడారు. చివరకు ప్లాట్‌ఫామ్ పైనే తుది శ్వాస విడిచారు. లక్షల మంది ప్రయాణించే రైల్వే స్టేషన్లో కనీస వైద్య సదుపాయాల్లేక పోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రనాథ్ మృతికి రైల్వే అధికారులే కారణమంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రవీంద్ర నాథ్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
దోపిడీ ముఠా అరెస్టు
రామచంద్రపురం, న్యూస్‌లైన్ :ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉన్న మహిళను బంధించి, దోపిడీకి పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసు లు అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 12 మంది నిందితులు పట్టుబడ్డారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో రామచంద్రపురం డీఎస్పీ బి.రవీంద్రనాథ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న స్థానిక కోర్టు వీధిలో ఉంటున్న కోటిపల్లి పద్మావతి ఇంట్లో దోపిడీ జరిగింది. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ఐదురుగు దొంగలు చొరబడ్డారు. ఆమెపై దౌర్జన్యం చేసి, బంధించారు. ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు, ఉంగరం, రూ.1600 నగదును దోచుకుని పరారయ్యారు. రా మచంద్రపురం సీఐ పి.కాశీవిశ్వనాథం ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. రాజమండ్రి శాటిలైట్ సిటీకి చెందిన కొత్తల రంగారావు, సుగంధపు శ్రీనివాసరావు, కడపకు చెందిన చందా హరి బాబు, రామచంద్రపురానికి చెందిన గంటా శ్రీనివాస్, సుం కర మురళీ కారులో వచ్చి ఈ దోపిడీకి పాల్పడినట్టు డీఎస్పీ దర్యాప్తులో తేలింది. వీరిని విచారణ చేయగా, ఆసక్తికర విషయాలు తెలిశాయి. హైదరాబాద్‌కు చెందిన పాము నర్సింగరాజు, దామర నరేష్, కోరిపల్లి రవీంద్రరెడ్డి, కావలికి చెందిన అట్లూరి అనిల్‌కుమార్, నెల్లూరుకు చెందిన వంటి గుంట శ్రీని వాసరావు, షేక్ మస్తాన్‌వలి, అల్లూరి గ్రామానికి చెందిన గం గాపట్నం కృష్ణ, గోవిందు కలిసి, దొంగల ముఠాగా ఏర్పడ్డా రు. రామచంద్రపురంలో దోపిడీకి పాల్పడి, అనంతరం వీరం తా రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీలోని నామవరం రంగారావు ఇంటి వద్ద ఉన్నారు. గోవిందు అల్లూరి గ్రా మానికి వెళ్లిపోయాడు. వీరిని అరెస్టు చేసి, చోరీ సొత్తును, కత్తు లు, ఇనుపరాడ్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. దు రలవాట్లకు బానిసలైన వీరు అప్పులపాలై, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ధనవంతుల ఇళ్లల్లో దోపిడీలు చేసేందుకు నిర్ణయిం చుకున్నారు. పద్మావతి ఇంట్లో దోచుకున్న పుస్తెలతాడును అమ్మేందుకు ప్రయత్నించిన రంగారావు, శ్రీనివాసరావు, హరి బాబు, గంటా శ్రీనివాస్, మురళిని బుధవారం అరెస్టు చేశా రు. వీరిచ్చిన సమాచారంతో మిగిలిన వారిని అరెస్టు చేశారు. వీరిని అరెస్టు చేసిన సీఐ పి.కాశీవిశ్వనాథ్, రామచంద్రపురం ఎస్సై ఫజల్ రహ్మాన్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ఏఎల్‌ఏగా రవీంద్రనాథ్‌కు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రాష్ట్ర విభాగం న్యాయ సలహాదారు (డీఎల్ఏ) బళ్లా రవీంద్రనాథ్‌కు పదోన్నతి లభించింది. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం స్పెషల్ క్రైమ్స్ విభాగం అదనపు న్యాయ సలహాదారు (ఏఎల్ఏ)గా ఆయన నియమితులయ్యారు. ప్రస్తుతం రవీంద్రనాథ్ బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్ విభాగాల న్యాయ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఏఎల్‌ఏగా ఈ నెల 30న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 1958 జూలై 9న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో రవీంద్రనాథ్ జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీలో 1982లో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. 1983-91 మధ్య కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి.. 1992లో సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపికయ్యారు. 1997లో సీనియర్ పీపీగా, 2008లో డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ (డీఎల్ఏ)గా పదోన్నతి పొందారు. నకిలీ స్టాంపుల కుంభకోణంతోపాటు సత్యం కంప్యూటర్స్, ఓఎంసీ, ఎమ్మార్ తదితర ముఖ్యమైన కేసుల్లో ప్రాథమిక దశలో వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర సీబీఐ విభాగంలో తమిళనాడుకు చెందిన అధికారుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు అన్ని కీలక విభాగాల అధిపతులుగా తమిళనాడుకు చెందిన వారే ఉన్నారు. -
రవి కాంచిన కళ
సౌందర్యాన్ని ఆరాధించడం, అధ్యయనం చేయడం, ఆస్వాదించడం ద్వారా కళలోని అనుభూతి, ఆనందాలను సొంతం చేసుకోగలం. అలా సొంతం చేసుకున్న కళాపిపాసి రవీంద్రనాథ్ ఠాగూర్. చిత్రకళలోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ తనదైన శైలిని ప్రతిబింబించారు. పాశ్చాత్య చిత్రకారులు చార్లెస్ పామర్, గిలార్డ్ వద్ద చిత్రలేఖనం నేర్చుకున్నప్పటికీ తాను గీసిన చిత్రాల్లో భారతీయ ఆత్మను ప్రదర్శించారు. మిగిలిన చిత్రకారుల మాదిరిగా ముదురురంగుల్లో కాకుండా... నీటిరంగుల్లో, లేతరంగుల్లో, వివిధ మాధ్యమాల్లో చిత్రాలు వేశారు ఠాగూర్. సిరా, పేస్టల్స్‌తో కూడా చిత్రాలు రూపొందించారు. రవీంద్రుడికి అమితంగా నచ్చిన అంశం ప్రకృతి. జీవితంలో ఎక్కువగా భాగం ప్రకృతితో సంభాషణ చేయడానికి ఇష్టపడిన తాత్వికుడు ఠాగూర్. ఆయన గీసిన చిత్రాల వలన కలిగే అనుభూతి కాలాతీతమైనది. ఎప్పుడూ గుర్తుండి పోయేది. కృతకమైన అలంకరణలు, ఆడంబరాలు నిజమైన ప్రేమకు అడ్డుగోడగా నిలుస్తాయని ఆయన నమ్మకం. అందుకే అలంకరణను వదిలి భావవ్యక్తీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నిరాడంబరమైన చిత్రాలనేకం ఆయన కుంచె నుంచి జాలువారాయి. ఆయనకు సంగీతం కూడా ఇష్టమైనదే కావడంతో చిత్రాల్లో ‘లయ’ కనబడుతుంది. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రవీంద్రునికి ముందే అనేక మంది చిత్రరచన చేసినా ‘బెంగాలీ సంప్రదాయం’ ఠాగూర్ నుంచి వచ్చినదే. యూరప్‌లో వచ్చిన సాంస్కృతిక పునర్జీవనం లాంటిది బెంగాలీ చిత్రకళలో తీసుకువచ్చారు. రవీంద్రుని ద్వారా బెంగాల్ చిత్రకళ సరికొత్త ఉత్తేజాన్ని పొందింది. తాత్వికుడైన ఠాగూర్ దృష్టిలో కళాసృష్టి అంటే- ‘‘అంధకారబంధురమైన ఈ లౌకిక ప్రపంచంలో కొట్టుమిట్టాడే వారికి అనంత సౌందర్య ప్రపంచంలో సర్వేశ్వరుడు దర్శనమిస్తాడు’’ సౌందర్యపిపాసి అయిన ఠాగూర్ తన ఊహాసుందరి, కళాప్రేయసిని ఊహిస్తూ... ‘‘ఒక శూన్య సంతోషం నాలో నిండనీ నా చేతిని నీ చేతిలో తీసుకో అంతే చాలు చీకటి పరుచుకునే నిశివేళ నా హృదయం నీదిగా చేసుకో’’ అంటారు. రవీంద్రుడు దాదాపు మూడువేల చిత్రాల్ని సృష్టించాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. రవీంద్రుడి చిత్రాలలో ఆధునికతతో పాటు సంప్రదాయం కూడా ఉండడం వలన అవి అందరినీ ఆకట్టుకున్నాయి. మన మనోసీమలో పదిలంగా నిలిచిపోతాయి. ఇంగ్లండ్, డెన్కార్క్, రోమ్, జర్మనీ, స్వీడన్, రష్యాలలో రవీంద్రుని చిత్రప్రదర్శనలు జరిగాయి. ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌కు రవీంద్రుడి చిత్రాలంటే ఇష్టంగా ఉండేది. కవిత్వంలో, చిత్రాల్లో ప్రకృతిని సాక్షాత్కరింప చేసిన ఠాగూర్ మన మధ్య లేకపోయినా ఆయన గీసిన చిత్రాలు మాట్లాడుతూనే ఉంటాయి. రవీంద్రుడిని మన మధ్య నిలుపుతూనే ఉంటాయి. - రామశాస్త్రి (కవి, చిత్రకారుడు)