శాఖాపరమైన విచారణకు ఆదేశించాం
హోం మంత్రి జార్జ్
సాక్షి, బెంగళూరు : కాఫీ షాపులో యువతి ఫొటో తీసారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడీజీపీ రవీంద్రనాథ్‌పై శాఖ పరమైన విచారణకు ఆదేశించామని హోం మంత్రి కే.జే జార్జ్ గురువారం పరిషత్‌కు తెలియజేశారు. నాణయ్య అడిగిన ప్రశ్నతో పాటు వివిధ పార్టీలకు చెందిన సభ్యులు లేవనెత్తిన సందేహాలకు ఆయన సమాధాన మిస్తూ... ఘటనకు సంబంధించి రవీంద్రనాథ్‌కు మూడు మెమోలు జారీ చేశామని తెలిపారు.
సమాధానాలు సంతృప్తికరంగాలేకపోవడం వల్ల శాఖ పరమైన విచారణకు ఆదేశించామన్నారు. ఘటన కంటే అటుపై రవీంద్రనాథ్ ప్రవర్తించిన తీరు సరిగా లేదని కే.జే జార్జ్ పరిషత్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై పలువురు సభ్యులు మాట్లాడుతూ కులం ముసుగులో తాము చేసిన తప్పుల నుంచి బయట పడటానికి వివిధ శాఖల ఉన్నతాధికారుల ప్రయత్నిస్తున్నారన్నారు.
ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఒక్కలిగ, లింగాయత్ వర్గాలకు చెందిన వారు ఉన్నారన్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగలు కులం పేరుతో సంఘాలను ఏర్పాటు చేసుకోవడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.