జన్‌లోక్‌పాల్‌తో లోకాయుక్త నిర్వీర్యం | Dispose of an Lokpal bill | Sakshi
Sakshi News home page

జన్‌లోక్‌పాల్‌తో లోకాయుక్త నిర్వీర్యం

Published Sat, Jun 7 2014 1:47 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

Dispose of an Lokpal bill

  • లోకాయుక్త మాజీ అధికారి సంతోష్‌హెగ్డే
  • తుమకూరు, న్యూస్‌లైన్ : జన్‌లోక్‌పాల్ బిల్లు అమలైతే లోకాయుక్త అధికారాలు కోల్పోయి.. నిర్వీర్యమవుతుందని లోకాయుక్త మాజీ అధికారి సంతోష్‌హెగ్డే అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలోని అక్షయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన డిగ్రీ పట్టాల ప్రధానోత్సవ కార్యక్రమంలో సంతోష్‌హెగ్డే పాల్గొన్నారు.

    అనంతరం హెగ్డే మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఉద్దేశంతో ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లు అమలు చేయడానికి ముందుకు వెళ్తోందో అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ ఆ బిల్లు అమలైతే లోకాయుక్త అధికారులు ఉండరని తెలిపారు. ఈ విషయంపై ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని మీడియా ప్రశ్నించగా.. ఎన్నికలు ఉన్న కారణంగా తాను మాట్లాడలేకపోయానని సంతోష్ సమాధానమిచ్చారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానన్నారు.

    2006 నుంచి 2012 వరకు లోకాయుక్తకు 24 వేల కేసులు వచ్చాయని, అందులో 700 మంది అవినీతిపరులకు శిక్ష వేయించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ర్ట పోలీస్ శాఖలో వేధింపులు ఎక్కువయ్యాయని, ఏడీజీపీ రవీంద్రనాథ్ ఉదంతమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖ నిర్లక్ష్యం వల్లే ఇంత రాద్ధాంతం జరిగిందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం తమ కర్తవ్యంగా పోలీసులు భావించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement