సికింద్రాబాద్, న్యూస్‌లైన్ : ఆరోగ్య రాజధా ని... హైటెక్ నగరం... అందులోనూ వరల్డ్‌క్లాస్ స్టేషన్.. పేరుకే ఈ భుజకీర్తులన్నీ. అత్యవసర వైద్య సదుపాయమైనా లేని దుస్థితి. అంబులెన్స్‌కూ నోచుకోని దైన్య స్థితి. సకాలంలో వైద్య సదుపాయం అందక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిండు ప్రాణం బలైపోయింది. గుండెపోటుతో ఓ వ్యక్తి రైల్వేస్టేషన్‌లో గంటపాటు విలవిల్లాడి తుదిశ్వాస విడిచారు.
వివరాలివీ... బెంగళూరుకు చెందిన రవీంద్రనాథ్ (50) కన్నడ సినీ పరిశ్రమలో సలహాదారు. సినిమా పనిపై ఆయన నగరానికి వచ్చి తిరుగు పయనమయ్యేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గరీబ్థ్ ్రఎక్కేం దుకు మూడవ ప్లాట్‌ఫామ్ నెంబర్‌కు చేరుకున్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. విషయాన్ని గ్రహించిన తోటి ప్రయాణికుడు అంబులెన్స్ కోసం 108కి పలుమార్లు ఫోన్ ద్వారా ప్రయత్నించినా అంబులెన్స్ జాడ లేదు.
స్టేషన్‌లోనూ కనీస వైద్య సదుపాయాలు లేకపోవడంతో రవీం ద్రనాథ్ గంట పాటు గుండెనొప్పితో విలవి ల్లాడారు. చివరకు ప్లాట్‌ఫామ్ పైనే తుది శ్వాస విడిచారు. లక్షల మంది ప్రయాణించే రైల్వే స్టేషన్‌లో కనీస వైద్య సదుపాయాల్లేక పోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రనాథ్ మృతికి రైల్వే అధికారులే కారణమంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రవీంద్ర నాథ్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
108 రాలేదు.. వైద్యం అందలేదు గుండెపోటుతో వ్యక్తి మృతి
Published Mon, Mar 17 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
Advertisement
Advertisement