Division Revenue
-
‘ఈ పాస్’ పుస్తకాలకు రంగం సిద్ధం
రామచంద్రపురం : రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ ద్వారా ‘ఈ పాస్’ పుస్తకాలు (పట్టాదారు) అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ పుస్తకాల పంపిణీలో జాప్యం తగ్గింపునకు, నకిలీ పాస్‌పుస్తకాల నిరోధానికి ‘ఈ పాస్’ పుస్తకాలు దోహదపడనున్నాయి. తమ శాఖను, రిజిస్ట్రేషన్‌శాఖను అనుసంధానం చేస్తూ వెబ్‌ల్యాండ్ ద్వారా ఈ పాస్ పుస్తకాలను ఆన్లైన్లో అందించేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు చర్యలు చే పట్టారు. జిల్లాలో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ ల్యాండ్ రికార్డులను రిజిస్ట్రేషన్లశాఖతో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే అడంగళ్ రికార్డుల అనుసంధానం 80 శాతం వరకు పూర్తయినట్టు రె వెన్యూ అధికారులు చెబుతున్నారు. స్థలాలను సబ్ డివిజన్ చేసే ప్రక్రియ మినహా ఏకమొత్తంగా ఉన్న అన్ని రకాల రెవెన్యూ స్థలాలను ఇప్పటికే వెబ్‌ల్యాండ్‌లో ఉం చినట్టు ఆ శాఖాధికారులు అంటున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఇకపై ఈ పాస్ పుస్తకాలకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆస్తిని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ ఆస్తి వెంటనే రెవెన్యూ రికార్డుల్లో కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారి పేరన మారుతుంది. కొనుగోలు దారుడు మీ సేవలో చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన వీఆర్వోలు, ఇతర అధికారులు తహశీల్దార్ డిజిటల్ సంతకంతో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు తీసుకున్న చెన్నైలోని ఏజెన్సీ స్పీడ్ పోస్టు ద్వారా ఈ పాస్ పుస్తకాన్ని దరఖాస్తుదారు ఇంటికి పంపిస్తుంది. ఈ మొత్తం పక్రియకు 40 నుంచి 45 రోజులు పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపై ఇప్పటికే రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో తహశీల్దార్లకు ఆర్డీఓ సుబ్బారావు ఆన్లైన్ శిక్షణ నిచ్చారు. తగ్గనున్న అధికారుల ప్రమేయం ఈ పాస్ పుస్తకాల మూలంగా రెవెన్యూ అధికారుల ప్రమేయం, అవినీతి, నకిలీ పాస్ పుస్తకాల బెడద కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అయితే టైటిల్ డీడ్ ఆన్లైన్లో ఇచ్చేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో తప్పని ఇబ్బందులుమీ సేవ ద్వారా ఈ పాస్ పుస్తకాలందించేందుకు క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బందులున్నాయంటున్నారు. స్థలాలు సబ్ డివిజన్ కాకపోవటంతో పాటు రెవెన్యూ రికార్డులు పట్టాదారు పాస్ పుస్తకాల్లోని తప్పుడు సర్వే నంబర్లతో ఉండటం కూడా ఇందుకు కారణమంటున్నారు. జిల్లావ్యాప్తంగా ల్యాండ్ సర్వే పూర్తయి, రెవెన్యూ రికార్డులు ఆన్లైన్లో పూర్తి స్థాయిలో నమోదైతే గాని స్పష్టత రాదని అధికారులే చెబుతున్నారు. -
పల్లెకు చేరిన సర్వే..
పాలమూరు : రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించనున్న సమగ్రసర్వేకు జిల్లాలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సర్వేకు సంబంధించిన ఫారాలన్నింటినీ ఎన్యుమరేటర్లకు పంపిణీ చేశారు. సర్వే వివరాలు సేకరించేందుకు నియమించిన 39,498 మంది ఎన్యుమరేటర్లు గ్రామాలు, పట్టణాలకు బయల్దేరి వెళ్లారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్ల వారీగా సిబ్బందిని సమాయత్తం చేసి సర్వే కోసం పంపారు. సర్వేకోసం జిల్లాను 501 రూట్లు, 314 జోన్లుగా విభజించారు. సమగ్ర సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 1665 వాహనాలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా జిల్లానుంచి వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు కూడా వాహనాలను ఏర్పాటు చేశారు. నేడు అంతటా బంద్ వాతావరణమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ముందుస్తుగా సెలవు ప్రకటించాయి. అన్ని ఆలయాల్లోనూ ఉదయం 8 గంటల లోపు పూజా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. బ్యాంకులు, సినిమా థియేటర్లు, వస్త్ర దుకాణాలు, పెట్రోలు బంక్‌లతోపాటు పట్టణ ప్రాంతాలు, పల్లెల్లో సైతం వ్యాపార సంస్థలు మూసివేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లా సమస్తం సెలవు రోజుగా కనబడనుంది. ఇందుకుగాను జిల్లా కేంద్రంలోని పెట్రోలు బంకుల్లో సోమవారం రాత్రి వాహనాల రద్దీ కనబడింది. ప్రభుత్వం ముందస్తుగా సెలవు ప్రకటించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారంతా జిల్లాకు చేరుకున్నారు. పల్లెల్లో పండగ సందడి సంకురాత్రి పండ్గకు కూడా రాని .. పిల్లగాండ్లు... ఏ పండ్గా.. లేని దినాన ఇంటి కొచ్చిండ్రని.. తాతా అవ్వలు శానా ఖుషీ అవుతుండ్రు.. ఏండ్ల కొద్దీ ఊరు మొఖం చూడని ఉద్యోగస్తులు కూడా ఊర్లను వెతుక్కుంటూ వెళ్లి అమ్మ, నాన్నల దగ్గరకు చేరుకోవడం జిల్లా వ్యాప్తంగా అన్ని పల్లెల్లోనూ సందడి నెలకొంది. ఎక్కడెక్కడో ఉన్న వలస జీవులంతా ఊళ్లకు చేరుకుంటుండంతో ప్రతి ఇల్లూ.. పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేను దృష్టిలో ఉంచుకొని ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబాల వారంతా మళ్లీ ఒకసారి తమ సొంతింటికి కట్టగట్టుకుని చేరుకుంటున్నారు. పండగలకు పబ్బాలకు వీలు కాక రాలేనివారు సైతం ఈ సర్వేకోసం రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. జిల్లాకు చెందిన 12 లక్షల మంది హైదరాబాద్, బెంగుళూరు, పూణె, ముంబై. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వలసకూలీలుగా, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులుగా కొనసాగుతున్న దాదాపు 3లక్షల మంది ఇళ్లకు చేరుకుంటున్నారు.