సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడుతున్నట్టుగా ఉంది’ జిల్లా అధికారుల తీరు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో జిల్లా కేంద్రాల్లో నిర్భయ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ సెంటర్ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి కేంద్ర వెచ్చింపుల ఆర్థిక సంఘం ఆమోదం కూడా తెలిపింది.
దీనిలో న్యాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ, ఆరోగ్య శాఖ, సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖల నుంచి సూచనలు కోరారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు ఈ సెంటర్లో కౌన్సెలింగ్‌తోపాటు న్యాయ సహాయం అందించేందుకు న్యాయవాదులను, రిటైర్డ్ పోలీసు అధికారిని నియమిస్తారు. దీని ద్వారా లైంగిక వేధింపులకు గురైన వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది. మహిళలకు ఇన్ని ఉపయోగాలున్న ఈ సెంటర్ విషయంలో ‘నిర్భయ’కు చోటేదీ జిల్లా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 50 నిర్భయ సెంటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వీటిని మొదట ముందుకు వచ్చిన వారికే కేటాయిం చాలని ప్రభుత్వం భావించింది. దీం తో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు లో నిర్భయ సెంటర్‌ను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. స్థలం చూపిస్తే సెంటర్ కేటాయిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఆయన 20 రోజుల క్రితం కలెక్టర్‌ను కలిసి సెంటర్‌కు ఐదు సెంట్ల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే విజయవాడతోపాటు పలు నగరాలు ముందుకు వచ్చినా తొలుత ఒంగోలుకు కేటాయించడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్టుగా కేంద్రం అంగీకరించినా జిల్లా అధికారులు మాత్రం స్థలం చూపించకపోవడం పట్ల జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘నిర్భయ’కు చోటేదీ
Published Mon, Sep 22 2014 1:44 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
Advertisement
Advertisement