
అంగన్‌వాడీల వేతనాలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలు(వర్కర్లు), మినీ అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులు(హెల్పర్లు) వేతనాలను ప్రభుత్వం పెంచింది. పెంచిన వేతనాలను ఏప్రిల్ 1 నుంచి చెల్లించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంగన్‌వాడీల వేతనాలను కార్యకర్తలకు రూ.4,500 నుంచి రూ.7 వేలకు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.2,950 నుంచి రూ.4,500లకు, సహాయకులకు రూ.2,200 నుంచి రూ.4,500లకు ప్రభుత్వం పెంచింది.