CM Jagan Review Meeting On Women And Child Welfare - Sakshi
Sakshi News home page

క్వాలిటీ సర్టిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండాలి: సీఎం జగన్‌

Published Mon, Jul 3 2023 12:53 PM | Last Updated on Mon, Jul 3 2023 5:31 PM

CM Jagan Review Meeting On Women And Child Welfare - Sakshi

సాక్షి, తాడేపల్లి: మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. 

మంత్రి ఉషశ్రీ చరణ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఎం విజయ సునీత, ఏపీ స్టేట్‌ సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ అండ్‌ వీసీ జి వీరపాండ్యన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే...
వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ కింద ఇచ్చే టేక్‌ హోం రేషన్‌ సరుకులన్నీ అత్యంత నాణ్యంగా ఉండాలని సీఎం ఆదేశం
ఈ సరుకుల పంపిణీపై మంచి ఎస్‌ఓపీ పాటించాలని అధికారులకు ఆదేశం
క్వాలిటీ సర్టిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండాలన్న సీఎం
పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా, అర్హులైన వారందరికీ అందేలా ఎస్‌ఓపీ పాటించాలని, దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న సీఎం
ఈ కార్యక్రమంపై బలమైన పర్యవేక్షణ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

సీఎం ఆదేశాల మేరకు గ్రామంలో ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పౌష్టికాహార రోజుగా నెలలో రెండుసార్లు పాటించేలా చర్యలు తీసుకున్నామన్న అధికారులు
ప్రతి నెల మొదటి, మూడవ శుక్రవారాల్లో ఈ కార్యక్రమాలు జరగాలన్న సీఎం

ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంతో దీన్ని అనుసంధానం చేయాలన్న సీఎం
పిల్లల ఎదుగుదల, టీకాలు, పౌష్టికాహారం, చక్కటి ఆరోగ్యపు అలవాట్లు తదితర వాటిపై ఈ కార్యక్రమం ద్వారా పర్యవేక్షణ చేయాలన్న సీఎం
ఇందులో భాగంగా చికిత్సకు అవసరమైన వారిని రిఫరెల్‌ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలన్న సీఎం.
ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు అంగన్‌వాడీల సూపర్‌వైజర్‌ కూడా ఉండి.. ఈ కార్యక్రమాల్లో  పాలుపంచుకోవాలన్న సీఎం

గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు పిల్లల ఎదుగలను పర్యవేక్షించేందుకు స్టాడీ మీటర్, ఇన్‌ఫాంటో మీటర్, సాల్టర్‌ స్కేల్, బరువును తూచే యంత్రాలన్నింటినీ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన అధికారులు. 

పీపీ–1, పీపీ–2 తరగతుల విద్యార్థులకు ఇచ్చే పాఠ్యప్రణాళికపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం
ఇంగ్లిషు భాషపై పునాదులు పిల్లలకు అదే దశలో ఏర్పాటు కావాలన్న సీఎం
పదాలు పలికేతీరు, ఫొనిటెక్స్‌ తదితర అంశాలపై శ్రద్ధపెట్టాలన్న సీఎం
పిల్లలు త్వరగా నేర్చుకునే వయసు కాబట్టి వారికి అత్యుత్తమ బోధన అందించాలన్న సీఎం
అంగన్‌వాడీ టీచర్ల డివైజ్‌లో స్పోకెన్‌ ఇంగ్లిషుకు సంబంధించి పాఠ్యాంశాలను లోడ్‌ చేయడం ద్వారా వివిధ పదాలను ఎలా ఉచ్ఛరించాలన్న దానిపై తగిన  శిక్షణ పిల్లలకు ఇచ్చినట్టు అవుతుందన్న సీఎం
దీనిపై మంచి ఆలోచనలు చేసి.. వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలన్న సీఎం
తద్వారా ఇప్పుడున్న బోధనా పద్ధతులను మరింత బలోపేతం చేయాలన్న సీఎం

అంగన్వాడీల్లోని 3–6 ఏళ్ల వయస్సున్న పిల్లలకు 19 వస్తువులతో కిట్లు ఇస్తున్నామన్న అధికారులు.
ఈనెలాఖరు కల్లా ఈ పంపిణీ పూర్తవుతుందన్న అధికారులు.

అంగన్‌వాడీ సెంటర్లలో నాడు – నేడు పనులపైనా సీఎం సమీక్ష.
గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాలమేరకు అంగన్‌వాడీల్లో నాడు–నేడు పనులపై ముందుకెళ్తున్నామన్న సీఎం
సచివాలయల్లోని సిబ్బంది ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌ను పరిశీలించి ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాలన్న దానిపై పూర్తిగా వివరాలు సేకరించారని తెలిపిన అధికారులు.
తరగతి గదులు, టాయిలెట్లు, రక్షిత తాగునీరు, ఫర్నిచర్‌ ఇలా అన్నిరకాలుగా కనీస సదుపాయాలతో అంగన్‌వాడీలను అభివృద్ధి చేయాలన్న సీఎం
నాడు–నేడు ఫేజ్‌–2లో భాగంగానే ఈ పనులను పూర్తిచేయాలన్న సీఎం
ఆగస్టు 15 కల్లా ఈ పనులు ప్రారంభం కావాలని, ఫేజ్‌ –2 కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో చేపడుతున్న పనులతో పాటు ఇవి పూర్తి కావాలన్న సీఎం

బాల్య వివాహాల నిరోధంలో కళ్యాణమస్తు, షాదీతోఫా, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెనలు కీలక పాత్ర పోషిస్తాయన్న సీఎం
ఈ పథకాలు పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా టెన్త్‌ చదవాలన్న నిబంధన కూడా పెట్టామన్న సీఎం
ఒక్కసారి టెన్త్‌ చదివాక తర్వాత ఇంటర్మీడియట్‌కు అమ్మ ఒడి, ఆపై చదువులకు విద్యాదీవెన, వసతి దీవెన అమలవుతున్నాయన్న సీఎం
దీనివల్ల బాగా చదువుకునేలా ఈ పథకాలు తగిన ప్రోత్సాహాన్ని కలిగిస్తాయన్న సీఎం
కళ్యాణమస్తు, షాదీ తోఫా, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు, విద్యారంగంలో, బాల్య వివాహాలను అడ్డుకట్టవేడయంలో ఎంత కీలకమనే విషయంపై చైతన్యం కలిగించాలన్న సీఎం

మండలానికి ఒక జూనియర్‌ కళాశాల అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు. 
టెన్త్‌ తర్వాత చదువులు ఆపేయాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక జూనియర్‌ కళాశాలలు బాగా తోడ్పడతాయన్న సీఎం.  

చిల్డ్రన్‌ హోమ్స్‌లో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్న సీఎం
ఈ హోమ్స్‌ నిర్వహణలో సిబ్బందికి తర్పీదు ఇవ్వాలన్న సీఎం
చిల్డ్రన్‌ హోమ్స్‌లో పిల్లలకు మంచి శిక్షణ, బోధనాంశాలు ఉండేలా చూడాలన్న సీఎం
ఈ హోమ్స్‌లో పరిస్థితులు మెరుగుపడలా చూడాలన్న సీఎం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement