Good News For Anganwadi: Welfare Schemes For Eligible Anganwadi Workers And Helpers In AP - Sakshi
Sakshi News home page

Good News For Anganwadi Workers: అంగన్‌వాడీ వర్కర్లకు గుడ్‌న్యూస్‌.. ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు

Published Mon, May 16 2022 7:52 AM | Last Updated on Mon, May 16 2022 8:46 AM

Welfare Schemes For Eligible Anganwadi Workers And Helpers In AP - Sakshi

సాక్షి, అమరావతి: అర్హులైన అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు,  సంబంధిత శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
చదవండి: Palle Vs JC: పల్లె ఉక్కిరిబిక్కిరి.. తెరవెనుక అధిష్టానం..?

ఆదాయ పరిమితిలోపు గౌరవ వేతనం పొందుతున్న అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్లకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకతో పాటు అమ్మ ఒడి, ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలకు సాయంతో పాటు వివిధ సంక్షేమ పథకాలను వర్తింపజేయాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల శాఖతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు, జిల్లా కలెక్టర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చింది.  ఈ మేరకు సంబంధిత శాఖలకు మహిళా శిశు సంక్షేమ శాఖ సర్క్యులర్‌ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement