రెండేళ్లక్రితం ఢిల్లీలో ఒక వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిపి ఆమెను హతమార్చిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఆ ఉదం తానికి కారకులైన ఆరుగురిలోనూ నలుగురికి ఉరిశిక్ష పడగా, ఒక నిందితుడు అంతక్రితమే జైల్లో అనుమానస్పద స్థితిలో మరణిం చాడు. ఒకరిని బాలుడిగా పరిగణించిన కారణంగా జువెనైల్ బోర్డు విచారించి మూడేళ్ల శిక్ష విధించింది. మిగిలిన నిందితులకు ఏమాత్రం తీసిపోని క్రౌర్యాన్ని ప్రదర్శించినా ఇలా స్వల్ప శిక్షతో సరిపెట్టడమే మిటని అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన నిందితులను జువెనైల్‌గా పరిగణించరాదన్న డిమాండు ఆనాటినుంచీ ముందుకొచ్చింది. ఇలాంటి నేరగాళ్లు కూడా కఠిన శిక్షల పరిధిలోకి వచ్చేలా వయోపరిమితిని ఇప్పుడున్న 18 ఏళ్ల నుంచి 16కు తగ్గించాలని అనేకులు సూచించారు.
ఈ నేపథ్యంలో తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్న పదహారేళ్ల వయసుకు పైబడినవారి విషయంలో ఏంచేయాలో నిర్ణయించే అధికారాన్ని జువె నైల్ జస్టిస్ బోర్డుకు అప్పగిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం తీర్మానిం చింది. ఆ రకంగా మధ్యేమార్గాన్ని అనుసరించింది. ఇప్పుడున్న బాల నేరస్తుల చట్టం ప్రకారం మైనర్ నిందితులు వారెంతటి తీవ్రమైన నేరాలకు పాల్పడినా సాధారణ కోర్టులు విచారించకూడదు. జువెనైల్ జస్టిస్ బోర్డు విచారించి, గరిష్టంగా మూడేళ్ల శిక్ష విధిస్తుంది.
నేర తీవ్రతనుబట్టి నేరంలో పాలుపంచుకున్నవారిపై సమా జంలో ఆగ్రహావేశాలు రగులుతాయి. అలాంటివారిని బహిరంగంగా ఉరితీయాలనో, కాల్చిచంపాలనో డిమాండ్లు వెల్లువెత్తుతాయి. ఇలా డిమాండు చేసేవారిని తప్పుబట్టనవసరం లేదు. సమాజంలో నానా టికీ క్రౌర్యం పెరిగిపోతున్నదని, నేరాలు అంతకంతకూ విస్తరిస్తున్నా యని అలాంటివారి ఆదుర్దా, ఆందోళన. నేరానికి తగిన విధంగా కఠి నమైన శిక్షలుంటే ఇవి అంతరిస్తాయని వారి విశ్వాసం. అలాగే తమ వారిని అత్యంత దారుణంగా హింసించి హతమార్చినవారిని అదే మోతాదులో శిక్షించాలని సంబంధీకులు కోరడం వెనకున్న ఆవేదనను అర్ధం చేసు కోవచ్చు. కానీ, ప్రభుత్వం ఇంత కన్నా పరిణతితో ఆలోచించాలి. జువెనైల్ చట్టంకింద కాకుండా సాధారణ చట్టంకింద అలాంటివారిని విచారించి శిక్షిస్తే ఏమవుతుంది? ఆ శిక్ష పడిన మైనర్లు కరుడుగట్టిన హంతకులతోనూ, దోపిడీదొంగలతోనూ శిక్షాకాలమంతా గడపవలసివస్తుంది. చట్టం దృష్టిలో వారు ‘మేజర్’ లే కావొచ్చుగానీ అలాంటి నేరస్తులనుంచి తమను తాము కాపాడు కునే అవకాశం లేనివారు. ఈ క్రమంలో ఆ మైనర్లు మరింత కరుడుగ ట్టిన నేరస్తులుగా రాటుదేలడం తప్ప దీనివల్ల సాధించే ప్రయోజనం శూన్యం. పైగా ఒక వ్యక్తిని బాల నేరస్తుడిగా పరిగణించాలా లేక సాధారణ నేరస్తుడిగా చూడాలన్న విషయంలో అతను చేసిన నేరం ప్రాతిపదిక కావడం సబబనిపించుకోదు.
ఒక నేరానికి పథకం వేయ డం, ఆ నేరానికి ఎలాంటి పర్యవసానాలుండగలవో తెలిసివుండటం వంటివి ఒక వ్యక్తిని నేరస్తుడిగా నిర్ధారించడంలో కీలకపాత్ర పోషి స్తాయి. కౌమార దశలో ఉండేవారిలో విపరీతమైన ఒత్తిళ్లుంటాయని, వెనకాముందూ చూడకుండా ఎలాంటి నిర్ణయాన్న యినా తీసుకునే దూకుడు స్వభావం ఉంటుందని... స్థిరంగా ఉండి ఆలోచించడానికి వీలుకల్పించే మెదడులోని ఒక భాగం నిర్మాణ క్రమం 18 ఏళ్ల వయసు వరకూ కొనసాగడమే ఇందుకు కారణమని మనస్తత్వ శాస్త్ర వేత్తలు చెబుతారు. 18 ఏళ్లలోపువారిని బాలనేరస్తు లుగా పరిగణిం చాలని నిర్ణయించింది ఇందుకే. 1992లో కుదిరిన ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడిక వెనకున్న ఉద్దేశమూ ఇదే. ఈ ఒడంబ డికపై మన దేశం కూడా సంతకం చేసింది. దానికి అనుగుణంగానే బాలనేరస్తుల చట్టం, 2000 అమల్లోకి వచ్చింది. అంతక్రితం ఉన్న 1986నాటి చట్టప్రకారం 16ఏళ్లు పైబడిన బాలురనూ, 18 ఏళ్లు పైబడిన బాలికలను మాత్రమే బాలనేరస్తులుగా పరిగణించేవారు.
హేయమైన నేరాలకు పాల్పడిన సందర్భాల్లో నేరస్తుల వయోప రిమితిని 16 ఏళ్లుగా పరిగణించాలని యూపీఏ హయాంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. కొత్తగా ఆ శాఖను చేప ట్టిన మంత్రి మనేకా గాంధీ కూడా ఇలాంటి సూచనే చేశారు. మహి ళలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలా నిర్ణయిం చడం అవసరమని ఆమె వాదించారు. మహిళల హక్కుల సంరక్ష ణను బాలల హక్కుల సంరక్షణతో పోటీపెట్టే స్థితి ఏర్పడటం నిజంగా దురదృష్టకరమైనదే. వాస్తవానికి బాలల నేరాలు ప్రచారం జరుగుతున్న స్థాయిలో ఏమీ పెరగలేదు. బాలనేరస్తుల చట్టం పెట్టిన నాటినుంచీ మొత్తం నేరాల్లో బాల నేరస్తుల ప్రమేయం ఉన్న నేరాలు దాదాపు 2 శాతంగానే ఉన్నాయి. ఈ 2 శాతంలోనూ హింసాత్మకమైన నేరాలు 7 శాతం. గత ఏడాది బాల నేరస్తులకు సంబంధించిన నేరాలు మొత్తం 38,765 అని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాం కాలు తెలియజెబుతున్నాయి. ఇందులో అత్యాచారాల సంఖ్య 2,074. ఈ నేరాల్లో 16-18 ఏళ్ల మధ్యవయస్కులు 66.6 శాతమని ఆ గణాం కాలు చెబుతున్నాయి. నేర తీవ్రతనుబట్టి ఒక నిందితుణ్ణి జవెనైల్‌గా పరిగణించాలో, పెద్దవాడిగా చూడాలో జువెనైల్ జస్టిస్ బోర్డు నిర్ణయి స్తుందని కేబినెట్ ఆమోదించిన సవరణ చెబుతున్నది. ప్రతిదీ సంచ లనాత్మకం అవుతున్న ప్రస్తుత తరుణంలో జువెనైల్ జస్టిస్ బోర్డు అంత స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉం టుందా అన్నది అనుమానమే. కేబినెట్ ప్రతిపాదనలు పార్లమెంటు ముందుకొచ్చినప్పుడైనా ఈ విషయంలో సమగ్రమైన చర్చ జరగా లని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకో వాలని ఆశిద్దాం.
‘జువెనైల్’ మీమాంస!
Published Fri, Aug 8 2014 12:20 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement