ఓడినా.. టీడీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు.. | Deputy CM Pushpa Sreevani Fire On Nannapaneni Rajakumari | Sakshi
Sakshi News home page

ఓడినా.. టీడీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు..

Published Thu, Sep 12 2019 2:19 PM | Last Updated on Thu, Sep 12 2019 2:36 PM

Deputy CM Pushpa Sreevani Fire On Nannapaneni Rajakumari - Sakshi

సాక్షి, అమరావతి: దళిత మహిళా ఎస్‌ఐను దూషించడం.. టీడీపీ అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. టీడీపీ సీనియర్‌ మహిళా నేత నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా ఖండించారు. మంత్రి తానేటి వనితతో కలసి ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణరెడ్డిలు కూడా దళితులను ఇలానే అవమానించారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో అవమానించి కన్నీళ్లు పెట్టించారని..ఇప్పుడు దళిత ఎస్‌ఐను కులం పేరుతో దూషించడం దారుణమన్నారు.

ఓడినా.. ఇంకా బుద్ధి రాలేదు..
గతంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి..దళిత మహిళా ఎస్‌ఐని అవమానించడం సిగ్గుచేటని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. దళితులను టీడీపీ నేతలు దూషించడం దారుణమన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో చంద్రబాబు అవమానిస్తే..ఇప్పుడు దళితులు దరిద్రమంటూ నన్నపనేని  చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. టీడీపీ నేతలకు దళితల పట్ల వివక్షత తగదని హితవు పలికారు. ఎన్నికల్లో టీడీపీ ఓడినా.. ఆ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement