mla pushpa sreevani
-
జగనన్న బర్త్‌డే వేడుకలు నిర్వహించిన పుష్ప శ్రీవాణి (ఫొటోలు)
-
ఓడినా.. టీడీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు..
సాక్షి, అమరావతి: దళిత మహిళా ఎస్ఐను దూషించడం.. టీడీపీ అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా ఖండించారు. మంత్రి తానేటి వనితతో కలసి ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణరెడ్డిలు కూడా దళితులను ఇలానే అవమానించారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో అవమానించి కన్నీళ్లు పెట్టించారని..ఇప్పుడు దళిత ఎస్ఐను కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ఓడినా.. ఇంకా బుద్ధి రాలేదు.. గతంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి..దళిత మహిళా ఎస్ఐని అవమానించడం సిగ్గుచేటని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. దళితులను టీడీపీ నేతలు దూషించడం దారుణమన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో చంద్రబాబు అవమానిస్తే..ఇప్పుడు దళితులు దరిద్రమంటూ నన్నపనేని చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. టీడీపీ నేతలకు దళితల పట్ల వివక్షత తగదని హితవు పలికారు. ఎన్నికల్లో టీడీపీ ఓడినా.. ఆ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
కురుపాం: గుమ్మలక్ష్మీపురం మండలం మండ – పి ఆమిటి జం„క్షన్ మధ్యలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు బలంగా ఢీ కొట్టడంతో అందులో ప్రయాణికులు పది మంది తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితులు అందించిన వివరాల్లోకి వెళ్తే...కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురం, గుమ్మలక్ష్మీపురం నుంచి కురుపాం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోల్లో ఒక ఆటోకు చెందిన డ్రైవర్ సీటు విరిగిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు ఆటోల్లో ప్రయాణిస్తున్న జి.శివడకు చెందిన కడ్రక మాధవి అనే అంగన్వాడీ కార్యకర్తతో పాటు తులసివలస గ్రామానికి చెందిన డి.అశోక్, ఆయన భార్య డి.కల్పన, అద్వానంగూడకు చెందిన ఆరిక దేవ తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు ఆవిరి గ్రామానికి చెందిన బిడ్డిక నాగేశ్వరరావు, ఆయన కుమారుడు బిడ్డిక విజయ్, బొద్దిడి గ్రామానికి చెందిన మండంగి మంగు గాయపడ్డారు. వీరిని 108లో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.మెరుగైన వైద్య సేవలు కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి కొందరిని తరలించారు. గుమ్మలక్ష్మీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గుమ్మలక్ష్మీపురం మండలానికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తున్న కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మార్గమధ్యలో ప్రమాదం జరిగి రోడ్డుపైన పడి ఉన్న క్షతగాత్రులను చూసి చలించిపోయారు. 108లో కొంతమందిని ఆస్పత్రికి తరలించగా, కొందరిని తన వాహనంలోనే ఎక్కించి నేరుగా కురుపాం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన చికిత్స అందించే వరకు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై ఆరా తీసి మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైతే ఇతర ఆస్పత్రులకు తరలించాలని వైద్యులకు సూచించారు. -
మరుగుదొడ్లలో అవినీతి కంపు
జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంచాయతీ పరిధిలోని వెంటకరాజపురం, గవరమ్మపేట, ఎరుకులపేట తదితర గ్రామాల్లోని మరుగుదొడ్ల నిర్మాణాలను చూసి కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి విస్తుపోయారు. ఇవెక్కడి నిర్మాణాలంటూ ముక్కున వేలేసుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు ఆదివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యేకు మూడు అడుగుల లోతులో నిర్మించిన ట్యాంకులు.. పైపులు, మరుగుదొడ్డి షీట్లు అమర్చని గదులు.. బీటలు వారిన గోడలు.. అస్తవ్యస్తం గా ఉన్న మరుగుదొడ్లే దర్శనమిచ్చాయి. ఆమె లబ్ధిదా రుల గోడును ఆలకించారు. తమ ఇంటివద్ద మరుగుదొడ్డి నిర్మించకుండానే బిల్లు చెల్లించామని అధికారులు చెబుతున్నారని, కొత్తగా నిర్మించుకుందామంటే బిల్లు మంజూ రు కాదని చెబుతున్నారంటూ వెంకట రాజురం వాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వాస్తవంగా పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరైంది. మరుగుదొడ్లు నిర్మి స్తామంటూ దాసరి కృష్ణంనాయుడు, చింతాడ శ్రీను ముందుకొచ్చారు. నాణ్యతతో, లబ్ధిదారులు మెచ్చుకునేలా నిర్మిస్తామని అధికారులను ఒప్పిం చారు. కాంట్రాక్టు చేతికి దక్కాక ప్లేటు ఫిరాయించారు. నాసిరకం నిర్మాణాలకు తెరతీశారు. కొందరి లబ్ధిదారుల ఇళ్ల వద్ద నిర్మించకుండానే నిర్మించినట్టు రికార్డుల్లో చూపించి నిధులు నొక్కేశారు. ఇప్పుడు వారు మరుగుదొ డ్లు నిర్మించుకుందామంటే బిల్లులు చెల్లించబోమని, ఇప్పటికే మీకు మరుగుదొడ్లు మంజూ రయ్యాయంటూ అధికారులు చెబుతుండడంతో గగ్గోలు పెడుతున్నారు. గవరమ్మపేటలో.. గవరమ్మపేటలో వాడుకకు పనికిరాని మరుగుదొడ్లను చూసి ఎమ్మెల్యే ముక్కున వేలేసుకున్నా రు. ఇలాంటి నిర్మాణాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవన్నారు. కొన్నిచోట్ల గుంతలకు, రూమ్‌కు సంబంధం లేదని, కొన్నిచోట్ల ట్యాంకులే లేవని, నిర్మించకుండానే బిల్లులు స్వాహా చేసినట్టు గుర్తించామన్నారు. ఇంత స్థాయిలో అవినీతి జరుగుతున్నా అధికారులు సహకరించడం విచా రకరమన్నారు. ప్రజల సొమ్ము కాజేసే కాంట్రా క్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఎన్ని మరుగుదొడ్లు నిర్మించారో చెప్పాలని ఏపీవో సురేష్నాయుడును ప్రశ్నించారు. ఉపాధిహామీ పథకం నుంచి 124 మందికి బిల్లులు చెల్లించామని, అందులో 67 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారని, మిగిలినవి సగంలో ఉన్నాయని తెలిపారు. ఇందులో కాంట్రాక్టర్లే కాకుండా సొంతంగా కట్టుకున్నవారు ఉన్నారన్నారు. బాధ్యత అంతా ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నిక ల్ అసిస్టెంట్, ఈసీలదేనని, వారు రికా ర్డు చేస్తే నేను బిల్లు చేయాల్సిందేనని తెలపడం గమనార్హం. ఏది ఏమైనా పూ ర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టిన వారికే బిల్లులు చెల్లిస్తామని, ఒకవేళ చెల్లించి ఉంటే రికవరీ చేస్తామని తెలిపారు. అవినీతి జరిగిందని ఎంపీడీవో ఒప్పుకున్నారు.. మరుగుదొడ్ల పరిశీలనకు వెళ్లేముందు ఎంపీడీవో శ్యాంసుందర్‌తో మాట్లాడినట్టు ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తెలిపారు. గవరమ్మపేట పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎంపీడీవో అంగీకరించారన్నారు. పరి శీలన అనంతరం ఎంపీడీవోతో ఎమ్మె ల్యే ఫోన్లో మాట్లాడారు. అవినీతి జరిగిందని, వారి నుంచి రికవరీ చేస్తామని ఎంపీడీవో స్పష్టం చేశారు. మరుగుదొడ్లు మంజూరు చేయాలంటూ మావిడి గంగమ్మ, గుంట్రెడ్డి సత్యంనా యుడు, మర్రాపు లకు‡్ష్మనాయుడు, మూడడ్ల శ్రీరాములనాయుడు, బడే తాతబాబు, బడే రామినాయుడు, కర్రి తులసమ్మ తదితరులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి... మరుగుదొడ్ల పరిశీలనకు ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి దాసరి కృష్ణంనాయుడు అనే కాంట్రాక్టర్ మరుగుదొడ్లకు మరమ్మతులు చేయడం ఆరంభించారు. ఇలా ముందుగానే చేస్తే బాగుండేదని స్థానికులు అనుకోవడం గమనార్హం. ఇలా సగంలో ఉన్నవాటికి కూడా బిల్లులు చెల్లించడం అధి కారుల బాధ్యతా రాహిత్యమని ఎమ్మెల్యే తెలిపారు. -
ప్రజా సంక్షేమమే జగన్ ధ్యేయం
గుమ్మలక్ష్మీపురం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మండలంలోని ఎల్విన్‌పేట పంచాయతీ రేగులపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా రేగులపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఎన్నో రకాల హామీలిచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని వైఎస్సార్ నాటి సంక్షేమ పాలన అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తూ నవరత్నాలు వంటి ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విధ్యుత్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులైజేషన్, 45 ఏళ్లకే వృధ్యాఫ్యఫింఛన్లు, ఉచిత విద్య వంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి తీసుకువస్తారన్నారు. అనంతరం అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమైతే ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలనైనా భరించేందుకు జగన్మోహన్ రెడ్డి ముందుకొస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను లిఖిత పూర్వకంగా స్వీకరించి, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కుంబురుక దీనమయ్య, వైస్ ఎంపీపీ బిడ్డిక చంద్రమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యుడు గోరిశెట్టి గిరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మక వెంటకరావు, నాయకులు కె.నాగేశ్వరరావు, మాధవరావు, వైస్ సర్పంచ్ బిడ్డిక రాడిమ్మి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల రక్తాన్ని పీల్చేస్తున్న లంచాల జలగలు
► కేజీహెచ్ సిబ్బంది లంచాల జాడ్యం ► అసెంబ్లీలో కళ్లకు కట్టినట్టు వినిపించిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ► సామాజిక మాధ్యమాల్లో హల్చల్ విజయనగరం కంటోన్మెంట్: పాపం గిరిజనం..రోగమొచ్చినా, ప్రమాదాల్లో గాయపడినా వైద్యం సక్రమంగా అందకపోవడంతోనే కాదు, ప్రభుత్వ వైద్యుల లంచాలతోనూ విలవిల్లాడుతున్నారు. వైద్యం కోసమే కాదు, చివరకు మృతదేహాన్ని తరలించడంలోనూ కేజీహెచ్‌లో పనిచేస్తున్న సిబ్బంది, వైద్యులు లంచాలు అడుగుతూ వారిని పిడిస్తున్నారు. వైద్య సిబ్బంది లంచాల జబ్బుకు మధ్య తరగతి ప్రజలు, చేతిలో చిల్లి గవ్వలేని అమాయక గిరిజనం మౌన వేదనతోనే అనుభవిస్తున్నారు. కళ్లకు కట్టిన కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అమాయక గిరిజనుల మౌనాన్ని అసెంబ్లీ సాక్షిగా కళ్లకు కట్టినట్టు వివరించారు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి. సరైన సౌకర్యాలను పొందలేకపోవడం ఒకెత్తయితే, అంతే స్థాయిలో మోసానికి గురవుతుండడం మరోకెత్తని, కేజీహెచ్ సిబ్బంది గిరిజనాన్ని దోచుకుంటున్న విషయాన్ని సోమవారం అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తీసుకు వచ్చారామె. ఈ మేరకు కొన్ని ఉదాహరణలను స్పీకర్‌కు లెక్కలతో సహా వినిపించారామె. అలా ఆమె చెప్పిన లెక్కలన్నీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. మొత్తం 28 వేల ఖర్చు.. ఈ మేరకు ఆమె ఇటీవల గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో మరణించిన కొండగొర్రి ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి కుటుంబాన్ని వైద్య సిబ్బంది లంచాల కోసం వేధించిన తీరును వివరించారు. ప్రవీణ్ గత నెల 15న రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. ఆయన్ని వైద్యం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు రెఫర్ చేశారు. అంతే అక్కడి నుంచి ప్రవీణ్ కుటుంబీకులకు కష్టాలు మొదల్యాయి. పార్వతీపురం నుంచి కేజీహెచ్‌కు తరలించేందుకు అంబులెన్స్‌కు రూ.5 వేలు, కేజీహెచ్ స్కానింగ్ విభాగానికి రూ.2వేలు, ఐసీయూ కాపలా దారునికి రూ.వెయ్యి ఇచ్చారు. ఇంతలో ఆయన చనిపోయాడు. అప్పుడైనా లంచాలు తీసుకోవడం ఆపేస్తారనుకుంటే పొరపాటే. పోస్టుమార్టం రిజిస్టర్లో ఎంటర్ చేయడానికి రూ.వెయ్యి, రిపోర్టు ఇచ్చేందుకు రూ.వెయ్యి, మృతదేహాన్ని ప్యాకింగ్ చేసేందుకు రూ. 3వేలు (క్లాత్ ఖర్చులతో కలిపి), డాక్టర్‌కు రూ.2వేలు, సాయం చేసిన తోటికి రూ.వెయ్యి, అక్కడి నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు అంబులెన్స్‌కు రూ.12వేలు చెల్లించారు. మొత్తం రూ. 28 వేలు ఖర్చు అయింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో హల్ చల్ చేస్తున్నాయి. గిరిజనం సమస్యను ఎమ్మెల్యే కేస్ స్టడీతో సహా అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.