ఎంపీడీవోతో మాట్లాడుతున్న పుష్పశ్రీవాణి
జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంచాయతీ పరిధిలోని వెంటకరాజపురం, గవరమ్మపేట, ఎరుకులపేట తదితర గ్రామాల్లోని మరుగుదొడ్ల నిర్మాణాలను చూసి కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి విస్తుపోయారు. ఇవెక్కడి నిర్మాణాలంటూ ముక్కున వేలేసుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు ఆదివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యేకు మూడు అడుగుల లోతులో నిర్మించిన ట్యాంకులు.. పైపులు, మరుగుదొడ్డి షీట్‌లు అమర్చని గదులు.. బీటలు వారిన గోడలు.. అస్తవ్యస్తం గా ఉన్న మరుగుదొడ్లే దర్శనమిచ్చాయి. ఆమె లబ్ధిదా రుల గోడును ఆలకించారు. తమ ఇంటివద్ద మరుగుదొడ్డి నిర్మించకుండానే బిల్లు చెల్లించామని అధికారులు చెబుతున్నారని, కొత్తగా నిర్మించుకుందామంటే బిల్లు మంజూ రు కాదని చెబుతున్నారంటూ వెంకట రాజురం వాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వాస్తవంగా పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరైంది.
మరుగుదొడ్లు నిర్మి స్తామంటూ దాసరి కృష్ణంనాయుడు, చింతాడ శ్రీను ముందుకొచ్చారు. నాణ్యతతో, లబ్ధిదారులు మెచ్చుకునేలా నిర్మిస్తామని అధికారులను ఒప్పిం చారు. కాంట్రాక్టు చేతికి దక్కాక ప్లేటు ఫిరాయించారు. నాసిరకం నిర్మాణాలకు తెరతీశారు. కొందరి లబ్ధిదారుల ఇళ్ల వద్ద నిర్మించకుండానే నిర్మించినట్టు రికార్డుల్లో చూపించి నిధులు నొక్కేశారు. ఇప్పుడు వారు మరుగుదొ డ్లు నిర్మించుకుందామంటే బిల్లులు చెల్లించబోమని, ఇప్పటికే మీకు మరుగుదొడ్లు మంజూ రయ్యాయంటూ అధికారులు చెబుతుండడంతో గగ్గోలు పెడుతున్నారు.
గవరమ్మపేటలో..
గవరమ్మపేటలో వాడుకకు పనికిరాని మరుగుదొడ్లను చూసి ఎమ్మెల్యే ముక్కున వేలేసుకున్నా రు. ఇలాంటి నిర్మాణాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవన్నారు. కొన్నిచోట్ల గుంతలకు, రూమ్‌కు సంబంధం లేదని, కొన్నిచోట్ల ట్యాంకులే లేవని, నిర్మించకుండానే బిల్లులు స్వాహా చేసినట్టు గుర్తించామన్నారు. ఇంత స్థాయిలో అవినీతి జరుగుతున్నా అధికారులు సహకరించడం విచా రకరమన్నారు. ప్రజల సొమ్ము కాజేసే కాంట్రా క్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఎన్ని మరుగుదొడ్లు నిర్మించారో చెప్పాలని ఏపీవో సురేష్‌నాయుడును ప్రశ్నించారు. ఉపాధిహామీ పథకం నుంచి 124 మందికి బిల్లులు చెల్లించామని, అందులో 67 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారని, మిగిలినవి సగంలో ఉన్నాయని తెలిపారు. ఇందులో కాంట్రాక్టర్లే కాకుండా సొంతంగా కట్టుకున్నవారు ఉన్నారన్నారు. బాధ్యత అంతా ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నిక ల్ అసిస్టెంట్, ఈసీలదేనని, వారు రికా ర్డు చేస్తే నేను బిల్లు చేయాల్సిందేనని తెలపడం గమనార్హం. ఏది ఏమైనా పూ ర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టిన వారికే బిల్లులు చెల్లిస్తామని, ఒకవేళ చెల్లించి ఉంటే రికవరీ చేస్తామని తెలిపారు.
అవినీతి జరిగిందని ఎంపీడీవో ఒప్పుకున్నారు..
మరుగుదొడ్ల పరిశీలనకు వెళ్లేముందు ఎంపీడీవో శ్యాంసుందర్‌తో మాట్లాడినట్టు ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తెలిపారు. గవరమ్మపేట పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎంపీడీవో అంగీకరించారన్నారు. పరి శీలన అనంతరం ఎంపీడీవోతో ఎమ్మె ల్యే ఫోన్‌లో మాట్లాడారు. అవినీతి జరిగిందని, వారి నుంచి రికవరీ చేస్తామని ఎంపీడీవో స్పష్టం చేశారు. మరుగుదొడ్లు మంజూరు చేయాలంటూ మావిడి గంగమ్మ, గుంట్రెడ్డి సత్యంనా యుడు, మర్రాపు లకు‡్ష్మనాయుడు, మూడడ్ల శ్రీరాములనాయుడు, బడే తాతబాబు, బడే రామినాయుడు, కర్రి తులసమ్మ తదితరులు ఎమ్మెల్యేకు విన్నవించారు.
ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి...
మరుగుదొడ్ల పరిశీలనకు ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి దాసరి కృష్ణంనాయుడు అనే కాంట్రాక్టర్ మరుగుదొడ్లకు మరమ్మతులు చేయడం ఆరంభించారు. ఇలా ముందుగానే చేస్తే బాగుండేదని స్థానికులు అనుకోవడం గమనార్హం. ఇలా సగంలో ఉన్నవాటికి కూడా బిల్లులు చెల్లించడం అధి కారుల బాధ్యతా రాహిత్యమని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment